ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53) మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర శోకంలో మునిగిపోయింది. వివిధ భాషల్లో కలుపుకుని సుమారు 800కు పైనే పాటలు పాడిన ఆయన మే 31 రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత గుండెపోటుతో మరణించారు. వేలాది యాడ్స్‌కు సైతం తన గొంతును సవరించిన ఆయన పెళ్లి పేరంటాల్లో మాత్రం పాడేందుకు నో చెప్పారట.
2008లో హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. మీరు ఇప్పటివరకు ఏదైనా ఆఫర్స్‌కు నో చెప్పారా? అన్న ప్రశ్నకు కేకే స్పందిస్తూ.. 'అవును, పెళ్లి కార్యక్రమాల్లో పాడమని అడిగితే కుదరదని చెప్పేశా. కోటి రూపాయలిస్తామన్నారు, అయినా సరే పాడనని కుండ బద్ధలు కొట్టేశా. పైసల కోసం నేను నటించలేను. కొన్ని సంవత్సరాల క్రితం ఓ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది కానీ పాయింట్ బ్లాక్‌లో నో చెప్పాను' అని చెప్పుకొచ్చారు. కాగా కేకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ సహా పలు భాషల్లో ఆలపించారు.
చదవండి: ఎవరీ కేకే, ఆయనకంటే మేమే బాగా పాడతామన్న సింగర్.. నెట్టింట ట్రోలింగ్
సింగర్ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు!
సీక్రెట్ ఎంగేజ్‌మెంట్, కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన పూర్ణ
Comments
Please login to add a commentAdd a comment