మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ
వరంగల్ : మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కుక్కల రవీందర్ అలియాస్ అర్జున్ను పోలీసు అరెస్ట్ చేశారు. రవీందర్‌తో పాటు భార్య అడవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ 25ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నాడు. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దర్ని పోలీసులు ఖమ్మం జిల్లాలో అరెస్ట్ చేసినట్లు సమాచారం. రవీందర్‌పై ప్రభుత్వం రూ.20లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరి అరెస్ట్‌ను పోలీసులు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.
కాగా అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో సంచరిస్తున్నారనే వార్తలతో పోలీసులు అప్రమత్తం అయిన విషయం తెలిసిందే. మాచ్‌ఖండ్, సీలేరు నదీ పరివాహక ప్రాంతంలో దళసభ్యులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ ఉధృతం చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.