kulumanali
-
మంచు కొండల్లో విహారానికి సై
స్నో అడ్వెంచర్లకు కులుమనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. డిసెంబరులో కులుమనాలి చూసేందుకు వేలాది మంది సందర్శకులు వెళుతున్నారట. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్‌గానూ పిలచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం నుంచి చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంటుంది. లద్దాఖ్‌లో మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కేబుల్ కార్ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనగర్, డార్జిలింగ్, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రదేశాలకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిని తట్టుకునే బట్టలు వెంట తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. అక్కడి రహదారులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కొత్త అనుభూతినిచ్చింది.. కుటుంబ సభ్యులంతా కలసి మనాలి టూర్ వెళ్లాం. ఎనిమిది రోజుల లాంగ్ టూర్ అది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో వెళ్లాం. అక్కడి నుంచి రాత్రంతా బస్సు ప్రయాణం. మనాలిలో ఒక రోజు బస చేశాం. కొత్త ప్రాంతం మంచు కొండలు, ప్రకృతి అందాలు, గ్రీనరీ మనసుకు హాయిగా అనిపించాయి. నదిలో రాప్టింగ్ చేశాం. హోటల్లో రాత్రి ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి వాతావరణం, వస్త్రధారణ కొత్త అనుభూతినిచ్చింది. – విజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవాలి. యువత కార్, మోటారు సైకిళ్లను అద్దెకు తీసుకుని మంచు కొండల్లో రయ్.. రయ్..మంటూ దూసుకుపోతున్నారు. -
కులుమనాలిలో చిక్కుకున్న జీవీఎంసీ కార్పొరేటర్లు
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అధ్యయన యాత్రకు వెళ్లిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కు చెందిన 74 మంది కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కులు మనాలిలో చిక్కుకు పోయారు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో దాదాపు 20 గంటలపాటు నీరు, ఆహారం లేక అవస్థలు పడ్డారు. ఆర్మీ అధికారులు శనివారం రాత్రి ట్రాఫిక్ క్లియర్‌చేసి వాహనాలను వదలడంతో ఊపిరిపీల్చుకున్నారు. విశాఖ నుంచి మొత్తం 141 మంది ఈ నెల 16న అధ్యయన యాత్రకి వెళ్లారు. తొలుత ఢిల్లీ, ఆ తర్వాత సిమ్లాకు వెళ్లారు. అక్కడి నుంచి కులు మనాలి వెళ్లారు. మనాలి కార్పొరేషన్ విజిట్ అనంతరం శుక్రవారం చండీగఢ్‌కు వెళ్లాల్సి ఉంది. వీరిలో ఏడుగురు విమానంలో చండీగఢ్ వెళ్లేందు కులు మనాలిలో ఉండిపోయారు. మిగతా 134 మంది 4 బస్సుల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరారు. చండీఘర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో మండీ వద్ద జోరుగా కురుస్తున్న వానకు కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్పొరేటర్ల బస్సులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు బస్సులోనే ఉండాల్సి వచ్చింది. కనీసం తాగడానికి నీరు కూడా దొరకలేదని కొందరు కార్పొరేటర్లు చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల అనంతరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్రం నుంచి ఆర్మీ అధికారులు వచ్చారని, కొన్ని అరటిపండ్లు, రొట్టెలు ఇవ్వడంతో కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు. శనివారం రాత్రి 7 గంటల తర్వాత అధికారులు రోడ్డుపై బండ రాళ్లను, దెబ్బ తిన్న వాహనాలను తొలగించారు. దీంతో కార్పొరేటర్ల బస్సులు కూడా బయల్దేరాయి. అందరూ సురక్షితం : మేయర్ కార్పొరేటర్లంతా సురక్షితంగానే ఉన్నారని విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారి చెప్పారు. కార్పొరేటర్లంతా ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచి వైజాగ్ వస్తారని ఆమె తెలిపారు. -
Spiti Valley: నింగికీ నేలకూ మధ్య ఓ నది
పదిహేను వేల అడుగుల ఎత్తు. లామాలకు ఇష్టమైన ప్రదేశం. ఎటు చూసినా మంచుకొండలు. మంచు కరిగి నీరవుతోందా లేక... చుట్టూ ఉన్న మంచు చల్లదనానికి నీరు గడ్డకట్టిపోతోందా? ఏమో! రెండూ నిజమే కావచ్చు!! స్పితిలోయలో ఏడాదిలో కొంతకాలం కొండలు కరిగి నీరవుతుంటే... మరికొంత కాలం నీరు మంచుగా మారుతుంది. కంటి ముందు మంద్రంగా ప్రవహిస్తున్న నది చూస్తూ ఉండగానే ప్రవాహం వేగం తగ్గిపోయి గడ్డకడుతుంది. ఇది హిమాలయ శ్రేణుల్లో విస్తరించిన ప్రదేశం. కులు నుంచి స్పితిలోయకు వెళ్లే దారిలో కనిపిస్తుంది కుంజుమ్ కనుమ. శీతాకాలంలో పర్వతాలను కప్పేసిన మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. స్పితి లోయలో ప్రవహిస్తున్న నది. ఈ నది మరీ పెద్దదేమీ కాదు. ప్రవాహ దూరం నూటముప్పై కిలోమీటర్లు మాత్రమే. స్పితి అంటే... మధ్యనున్న నేల అని అర్థం. అటు నింగికీ– ఇటు భూమికీ మధ్యనున్న నేల కావడంతో దీనికి అదే పేరు స్థిరపడింది. లామాల నివాసం హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితిలోయ బౌద్ధం కొలువుదీరిన ప్రదేశం. బౌద్ధలామాలు మౌనంగా పర్వతసానువుల్లో అలవోకగా నడిచిపోతుంటారు. పదిహేను వేల అడుగుల ఎత్తు బోర్డు దాటి ముందుకెళ్లి కొండ మలుపు తిరిగితే అనేక బౌద్ధారామాలు, చైత్యాలతోపాటు ‘కీ’ మోనాస్టెరీ, టాబో మోనాస్టెరీలు కనిపిస్తాయి. ఇవి బౌద్ధం పురుడుపోసుకున్న తొలినాళ్లలో కట్టిన బౌద్ధచైత్యాలు. అందుకేనేమో ఇది దలైలామాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అయింది. -
నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణం
సాక్షి, సిటీబ్యూరో: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమానాలిలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో కిందపడి ప్రాణాలు కోల్పోయిన నగరానికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఉదంతంలో నిర్వాహకుడిని నిర్లక్ష్యం ఉన్నట్లు మనాలీ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పారాగ్లైడింగ్ నిర్వాహకుడు బుధీ సింగ్‌ను సోమవారం అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీలోని సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 15 వరకు కులుమనాలీ ప్రాంతాల్లో పారాగ్లైడింగ్, రివర్ ర్యాఫ్టింగ్స్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించిన కులు పోలీసులు ఉల్లంఘించిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తపేట డివిజన్, సమతాపురి కాలనీకి చెందిన వేమారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి (24) ఈసీఐఎల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా విధులు నిర్వహించేవారు.గత బుధవారం అతను సమతాపురి కాలనీకి చెందిన తన స్నేహితులు విశాల్, అఖిల్‌తో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలికి విహారయాత్రకు బయలుదేరి వెళ్లాడు. శనివారం అక్కడి మంఝా గ్రామంలో పారాగ్లైడింగ్ చేయాలని భావించిన అతను ఈ తరహా సంస్థను నిర్వహించే షనాగ్ గ్రామానికి చెందిన బుధీసింగ్‌ను సంప్రదించాడు. అయితే మాన్సూన్ సీజన్లో పారాగ్లైడింగ్ నిషేధం ఉంటుందన్న విషయం తెలిసినప్పటికీ బు«ధీసింగ్ ఈ విషయాన్ని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పలేదు. యాత్రికులను పారాగ్లైడింగ్ తీసుకువెళ్లడానికి తన వద్ద ఉత్తరప్రదేశ్‌కు చెందిన జోగీందర్‌ను పైలెట్‌గా నియమించుకున్నాడు. తక్కువ జీతం ఇవ్వవచ్చనే ఉద్దేశంతో సుశిక్షుతుడు కాకపోయినా జోగీందర్‌తోనే పారాగ్లైడింగ్ చేయిస్తున్నాడు. శనివారం ఇతడితో కలిసే పారాగ్లైడింగ్కు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాదం జరగడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో జోగీందర్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే చంద్రశేఖర్ మృతదేహం నగరానికి చేరుకోవడంతో పాటు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కులు పోలీసులు నిర్వాహకుడి నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో బుధీసింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సెప్టెంబర్ 15 లోగా ఎవరైనా కులుమనాలీల్లో పారాగ్లైడింగ్æ, రివర్ ర్యాఫ్టింగ్ నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కులు ఎస్పీ గౌరవ్ సింగ్ ప్రకటించారు. ఈ విషయం పర్యాటకులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. -
పారాచూట్ తెరుచుకోక..
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వైద్యుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమనాలి విహారయాత్రకు వెళ్లి అక్కడ మృతి చెందారు. దీంతో కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్ పరిధిలోని సమతాపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్క వేమారెడ్డి–లక్ష్మిల దంపతుల చిన్న కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(24) నగరంలోని ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమతాపురి కాలనీకి చెందిన స్నేహితులు విశాల్, అఖిల్‌తో కలసి హిమాచల్ ప్రదేశ్‌లోని కులూమనాలికి బుధవారం వెళ్లారు. శనివారం విహార యాత్రలో రోప్‌వేలో ప్రయాణిస్తుండగా వైర్లు తెగిపడ్డాయి. దీంతో పారాచూట్ సహాయంతో కిందికి దిగేందుకు ప్రయత్నించగా అది సరిగ్గా తెరుచుకోకపోవడంతో కిందపడి పోయారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా మాట్లాడించి మృత దేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కులు మనాలిలో తెలుగు వ్యక్తి మృతి
సాక్షి: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులుమనాలీకి విహార యాత్రకు వెళ్లిన నాగోలుకు చెందిన చంద్రశేఖర్ అనే వైద్యుడు శనివారం ప్రమాదవశాత్తు చనిపోయాడు. యశోద ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్న చంద్రశేఖర్ స్కై డైవింగ్ చేస్తుండగా, ప్యారాచూట్ తెగిపడడంతో మృతిచెందినట్టు తెలుస్తోంది. -
పోతూపోతూ.. 2వేల టన్నుల చెత్తను వదిలివెళ్లారు
న్యూఢిల్లీ : మే-జూన్ నెలలో దాదాపు 10లక్షల మంది పర్యాటకులు మనాలిని సందర్శించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు పోతూ పోతూ.. 2000 టన్నుల చెత్తను వదిలిపెట్టిపోయారట. ఈ చెత్తలోనూ ఎక్కువభాగం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనాలిలో ప్రతిరోజు 10 టన్నుల చెత్త మాత్రమే బయటికి వస్తోందని, అయితే పర్యాటకులు అధికంగా వచ్చే సమయంలో మాత్రం రోజకు 35 టన్నుల చెత్త ఉత్పత్తవుతుందని స్థానిక అధికారులు తెలిపారు. రోహతంగ్ పాస్, సోలాంగ్ నుంచి మనాలికి వెళ్లే దారిలో ఉన్న హోటళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను దగ్గర్లోని బర్మానా సిమెంట్ ప్లాంట్‌కు తరలించి అక్కడే తగలబెడుతున్నారు. కానీ చెత్త సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. 'ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఒకేసారి 100 టన్నుల వ్యర్థాలను తగలబెట్టే సామర్థ్యం గల పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నార'ని మనాలి మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ అధికారి నారాయణ సింగ్ వర్మ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ వచ్చే వారంలో ప్రారంభమమ్యే అవకాశం ఉందని, దీని వల్ల సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యధికంగా వెలువడుతున్నచెత్త వల్ల బియాస్ నది, అలాగే పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా చూడాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కులు,మనాలి మున్సిపల్ విభాగాలను ఆదేశించింది. అయితే మనాలిలో స్థానిక జనాభా కంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులు వేస్తున్న చెత్తే ఎక్కువగా ఉంటుంది. -
ఎంత కష్టం!
సినిమాకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి షూటింగ్ లొకేషన్లో ఏర్పడే మనస్పర్థల వల్ల, ఆర్టిస్టుల డేట్స్ విషయంలోనూ, ప్రకృతి వల్ల కూడా అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అనూహ్య ఇబ్బందిలోనే చిక్కుకుంది ‘దేవ్’ టీమ్. కార్తీ, రకుల్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని కులూమనాలిలో ప్లాన్ చేసి, యూనిట్ అక్కడకు చేరుకుంది. సడెన్‌గా కుండపోతగా వర్షం కురవడంతో వరదలు వచ్చాయి. దాంతో షూటింగ్ ప్రదేశమంతా బీభత్సంగా తయారవ్వడంతో పాటు సుమారు 140 మంది యూనిట్ మెంబర్స్ అక్కడ చిక్కుకుపోయారట. ఈ విషయాన్ని కార్తీ షేర్ చేస్తూ – ‘‘మంచు పడుతున్న సీన్స్ షూట్ చేద్దామని హిమాచల్ ప్రదేశ్ వచ్చాం. మాకు అనుగుణంగానే లొకేషన్ ఉండటంతో షూటింగ్ సజావుగా జరుగుతుందనుకున్నాం. హఠాత్తుగా భారీ వర్షం మొదలైంది. కొండ మీదున్న రాళ్లు జారి రోడ్డు మీద పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. షూటింగ్ లొకేషన్లో (కొండ మీద) చిక్కుకుపోయిన వాళ్లతో కమ్యూనికేషన్ లేదు. సేఫ్టీ కోసం నన్ను కొండ కింద ఊర్లోనే ఉండ మన్నారు’’ అన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం నిర్మాతకు సుమారు కోటిన్నరకు పైనే నష్టం మిగిల్చిందట. అలాగే గత 23 ఏళ్లలో హిమాచల్ ప్రదేశ్‌లో ఇంతటి బీభత్సాన్ని చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. -
జగదీష్ రాకకోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
-
కన్నవారి ఆశలు...గల్లంతు
-
గల్లంతైన విద్యార్థులు వీరే !
-
కన్నవారి ఆశలు...గల్లంతు
సమాచారం అందక విలపిస్తున్న బంధువులు జాడ లేని కళాశాల యాజమాన్యం నగరం శోకసంద్రమైంది.. సర్వత్రా విషాదం అలముకుంది.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.. హిమాచల్‌ప్రదేశ్ విహారయాత్ర విషాదంగా మారి నగరానికి చెందిన 24 మంది విద్యార్థులు గల్లంతైన ఘటన సిటీవాసులను తీవ్రంగా కలచివేసింది. విహారయాత్రకు వెళ్లిన తమ పిల్లలు త్వరలో తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకీ వార్త తీరని గుండెకోతను మిగిల్చింది. చార్ధామ్ ఘటనను మరువక ముందే మరో విషాదం సంభవించ డాన్ని నగరవాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. విజ్ఞానంతోపాటు విహారం అందిస్తుందనుకున్న యాత్ర తమ పిల్లల జీవితాల పాలిట విషాదయాత్రగా పరిణమించడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. పలువురు విద్యార్థుల కుటుంబాల్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థుల క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు వారి తల్లిదండ్రులు తెల్లవార్లూ నిద్ర లేకుండా గడిపారు. యాత్రలో పాల్గొన్న విద్యార్థులతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల బంధువులు వారి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. తమ పిల్లలను క్షేమంగా నగరానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. జగద్గిరిగుట్ట(బాచుపల్లి), న్యూస్‌లైన్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం కులుమనాలి సమీపంలోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థుల ఆచూకీ కోసం నగరంలో వారి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు ఈ నెల 3న విహారయాత్రకు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లారు. వీరిలో పలువురు నదిలో ఫొటోలు దిగుతుండగా కొట్టుకుపోయారని వెలువడిన వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు కలత చెందారు. ఆదివారం రాత్రి పెద్దసంఖ్యలో కళాశాల వద్దకు వచ్చారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ విలపించారు. దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల తల్లిద్రండులు కళాశాల సమీప ప్రాంతాల్లో ఉంటున్న తమ బంధువుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. విహారయాత్రకని పంపిస్తే ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తదితరులు కళాశాలకు వచ్చి విద్యార్థుల వివరాలపై ఆరా తీశారు. పత్తాలేని యాజమాన్యం.. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు కళాశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులకు తగిన సమాచారం అందించేందుకు కళాశాలలో ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. యాజమాన్యం సైతం జాడ లేదు. పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు కళాశాల వద్ద నుంచి ఫోన్లో ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా తాను వస్తున్నానంటూ చెప్పి ఎంతకీ రాలేదు. ఆయన కోసం ఏసీపీ మూడు గంటల పాటు నిరీక్షించారు. కళాశాల యాజమాన్యం అటు పోలీసులు ఇటు విద్యార్థుల బంధువులకు సహకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమైంది. గతంలోనూ ఇదే విధంగా.. 2012లో ఇలాగే గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్ట్‌కు ఈ కళాశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. ఆ ఘటనతోనైనా విద్యార్థులను బయటకు పంపేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే తాజా ఘటన జరిగి ఉండేది కాదని బాధితులు వాపోయారు. -
దత్త పిల్లలతో కులుమనాలి
ఉన్నోళ్లంతా మనసున్నోళ్లు కాలేరు. మంచి మనసున్నోళ్లు ధనం ఉన్నోళ్లకంటే పేరున్నోళ్లవుతారు. ఈ రెండు ఉన్న వాళ్లలో నటి హన్సిక ఒకరని చెప్పవచ్చు. అభాగ్యులను ఆదుకునే ఆపన్న హస్తం ఈమెది. ఒక్కో ఏడాది ఒక్కో అనాథను అక్కున చేర్చుకుంటూ 25 ఏళ్ల పుత్తడి బొమ్మ 25 మంది చిన్నారులను దత్తత తీసుకుంది. మరిన్ని ఇతరత్రా గుప్త దానాలతో తన సేవా కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న హన్సిక తజాగా తాను సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న 25 మంది పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని భావించారు. దీంతో వారందరితో జూన్‌లో వారం రోజులపాటు కులుమనాలికి విహార యాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడిస్తూ వచ్చే ఏడాది ఈ పిల్లలతో విదేశీయానం చేయాలని హన్సిక భావిస్తున్నట్లు తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో బిజీ హీరోయిన్ హన్సిక. అలాంటి నటికి ప్రతి నిమిషం చాలా ఖరీదయినది. అయినా దత్తత తీసుకున్న పిల్లల కోసం ఇంత సమయాన్ని కేటాయిస్తున్నారంటే నిజంగా ఆమె సేవా నిరతికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.