Kunanneni sambashiva rao
-
త్వరలోనే మహ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో
-
త్వరలోనే పీపుల్ మేనిఫెస్టో
హైదరాబాద్: గోల్కొండ రిసార్ట్‌లో ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించడం కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి మహాకూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా వారి సూచనలు సలహాలను ఇచ్చారు. అన్ని విషయాలను క్రోడీకరించి త్వరలోనే పీపుల్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అన్ని ప్రయోజనాలు తీర్చే విధంగా ఉంటుందన్నారు. కేవలం ఉమ్మడి మేనిఫెస్టో ఏర్పాటు గురించి మాత్రమే సమావేశం జరిగిందన్నారు. టిక్కెట్ల సర్దుబాటు గురించి చర్చించలేదన్నారు. దానికి మరొక కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరకు సుధాకర్ మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్‌కి వ్యతిరేకంగా పనిచేయడం కోసం కూటమిగా పనిచేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆహ్వానించిందన్నారు. మా పార్టీ తరపున కొన్ని సూచనలు సలహాలను ఇచ్చామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను అధికారికంగా అమలు చేయాలని సూచించామని చెప్పారు. 34 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని కోరామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారికి జిల్లా కేంద్రాల్లో కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని కోరామని, ఇంకా అనేక విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఉమ్మడి మేనిఫెస్టోకి తుది రూపునివ్వడానికి చర్చిస్తున్నామని, కేసీఆర్ మాదిరి చెప్పినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందకుండా అన్నీ బేరీజు వేసుకుంటున్నామని వివరించారు. బడ్జెట్ ఎంత అవుతుంది అన్న విషయాలను కూడా సరిచేసుకుంటున్నామని, ఆర్ధిక నిపుణులతో కూడా సంప్రదించాలని, అదే విధంగా రిటైర్డ్ అధికారులతో కూడా దీనిపై సంప్రదించాలని కాంగ్రెస్‌కి సలహా ఇచ్చామని వివరించారు. -
సీపీఐకి భంగపాటు..
ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో బలమైన వామపక్ష పార్టీగా ఉన్న సీపీఐకి ఈ సార్వత్రిక ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. సులువుగా గెలుస్తుందనుకున్న స్థానాల్లో కూడా ప్రత్యర్థులకు కనీసం పోటీ కూడా ఇవ్వలేక చతికిలపడింది. సీపీఐ పోటీ చేసిన స్థానాల్లో ఎవరూ ఊహించని విధంగా ప్రజలు ఇతర పార్టీలకు పట్టం కట్టి విలక్షణ తీర్పు ఇచ్చారు. దీంతో జిల్లాలో ఒక స్థానంలో కూడా ఆ పార్టీ కనీసం బోణీ కూడా కొట్టలేదు. సాక్షాత్తు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో నిల్చున్నా.. జిల్లా ప్రజలు ఆయనకు ఓటమి రుచి చూపించారు. మాటల మాంత్రికుడిగా పేరున్న నారాయణ మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటూ ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయడంతో ఆయన విజయం ఖాయమని, జిల్లాలో మూడు స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులను కూడా ఆయన చరిష్మాతో గెలిపించుకుంటామని కార్యకర్తలు ధీమాతో ఉన్నారు. కానీ శుక్రవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎక్కడా కూడా వారు గెలుపొందిన అభ్యర్థుల దరిదాపుల్లో కూడా నిలవలేకపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ కొంపముంచిందా? ఎప్పుడూ లేని విధంగా వామపక్ష సిద్ధాంతాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమకు ఓట్లు వేసి గెలిపిస్తారని కొంతమంది సీపీఐ నాయకులు ధీమాతో ఉన్నప్పటికీ మరికొంత మంది మాత్రం కాంగ్రెస్ నాయకుల తీరుపై మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి అనుమానాలకు తగినట్టుగానే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ది ఫలితాల్లో తేలింది. సీపీఐ పోటీ చేసిన ఖమ్మం పార్లమెంట్‌తోపాటు పినపాక, వైరా, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రె స్ పార్టీ బహిరంగంగానే ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చినట్లు తేలిపోయింది. గత తీర్పుకు భిన్నంగా... గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి మూడు స్థానాల్లో సీపీఐ పోటీచేసింది. వీటిలో కొత్తగూడెం, వైరా స్థానాలను గెలుచుకోగా, పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా సీపీఐ అభ్యర్థులు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఆ సీట్లలోనే పో టీకి దిగారు. ఈసారి మాత్రం ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చా రు. ఎంతో ఆశలు పెట్టుకున్న కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు ఘోరమైన ఓటమిని చవిచూశారు. కొత్తగూడెం అభ్యర్థి కూనంనేని సాంబశివరావు తాను ఓడిపోతానని తెలిసినప్పటికీ ఈ స్థాయిలో ఓడిపోతానని అనుకోలేదని కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే బానోతు చంద్రావతిని కాదని ఆమె బంధువైన డాక్టర్ మూడు నారాయణను బరిలో నిలిపారు. దీంతో టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన చంద్రావతి అక్కడ సీపీఐ ఓట్లను భారీగా చీల్చి ఆ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారు. అక్కడ మూడు నారాయణ మూడో స్థానానికి పడిపోయారు. అదేవిధంగా పినపాక నియోజకవర్గంలో ప్రస్తుత వైఎస్సార్సీపీ తరుపున గెలుపొందిన పాయం వెంకటేశ్వర్లు గత ఎన్నికల్లో సీపీఐ తరుపున పోటీచేశారు. ఓటమి పాలైనా కూడా అప్పుడు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావుకు ము చ్చెమటలు పట్టించారు. అనంతరం సీపీఐనుంచి పాయం వెంకటేశ్వర్లును బయటకు పంపిం చగా, ఆయన వైఎస్సార్సీపీలో చేరి ఈ ఎన్నికల్లో తన సత్తా చాటి గెలుపొందారు. అక్కడ సీపీఐ తరుపున పోటీచేసిన తోలెం రమేష్ నాలుగో స్థానానికి పడిపోయారు. జిల్లాలో బలమైన క్యాడర్ ఉందని నమ్మిన సీపీఐకి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులా మారాయి. దీంతో వారు తమ ఓటమి వెనుక గల కారణాలపై పోస్టుమార్టం చేయడానికి సమాయత్తం అవుతున్నారు. నారాయణకూ తప్పని ఓటమి... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గా కాంగ్రెస్మద్దతుతో పోటీకి దిగిన కె.నారాయణకు ఓటమి తప్పలేదు. మూడో స్థానానికే పరిమితమయ్యారు. నారాయణ ఎంతో నమ్మకంతో జిల్లాలోని సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు తనను గెలిపిస్తాయని భరోసాతో అందరికన్నా ముందుగానే ప్రచారం మొదలు పెట్టినా ఫలితం లేకుండాపోయింది. ముఖ్యంగా ఆయన స్థానికేతరుడు కావడంతోపాటు జిల్లా రాజకీయాలపై సరైన అవగాహన కూడా లేకపోవడం ఆయన ఓటమికి ముఖ్యకారణమని సీపీఐ, కాంగ్రెస్‌పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పార్లమెంట్ స్థానం కోసం పువ్వాడనాగేశ్వరరావు పోటీ పడినా కూడా జిల్లా కార్యవర్గం పట్టుపట్టి నారాయణనే బరిలోకి దింపింది. దీంతో నారాయణ కూడా తమ పార్టీపై పూర్తి నమ్మకంతో బరిలోకి దిగారు. అయితే ఆయన జిల్లా ప్రజల నాడిని కనిపెట్టలేకపోయారు. -
కామ్రేడ్స్ ఏంటిలా..?
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కార్మిక ప్రాంతమైన కొత్తగూడెం నియోజకవర్గంలో ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న సీపీఐకి స్థానిక సంస్థల ఎన్నికలు అచ్చొచ్చినట్లుగా కనిపించడం లేదు. నియోజకవర్గం సీపీఐకి సిట్టింగ్ సీటు అయినా స్థానిక ఫలితాలను తమకు అనుకూలంగా రాబట్టలేకపోయింది. ఆ పార్టీ నాయకుల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సింగరేణిలో బలమైన కార్మికసంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సీపీఐకి అనుబంధంగా ఉండటంతో కొత్తగూడెం మండలంలో ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. గత మండల పరిషత్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని ఎంపీపీని దక్కించుకుంది. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యేగా సీపీఐకి చెందిన కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సింగరేణి కార్మికులకు అండగా ఉంటున్న ఏఐటీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండేది. ఇన్ని అనుకూలతలు ఉన్నా ఆ పార్టీ ప్రాదేశిక ఎన్నికల్లో డీలా పడటంపై చర్చసాగుతోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే, ఎంపీపీ స్థానాలు చేతిలో ఉన్న సీపీఐ తన కేడర్‌ను విస్తరించుకోలేకపోయింది. ఎలాగైనా గెలుస్తామనే ధీమా వారిలో ఉన్నా ఈసారి జరిగిన మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికలు వారికి నిరాశను మిగిల్చాయి. తాజా మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై ఉన్న అసంతృప్తి కూడా పార్టీని దెబ్బతీసిందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. కిందిస్థాయి కేడర్‌ను పట్టించుకోక పోవడంతో వారంతా ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. కూనంనేని సాంబశివరావు పరిషత్ ఎన్నికల్లో పాల్వంచ మండలంపై దృష్టి సారించి విస్తృత ప్రచారం చేశారు. అయినా ఒక్కస్థానం కూడా రాకపోవడం ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీపీఐ పాల్వంచలో పట్టుతప్పిందనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో కూడా పెద్దగా పట్టు లేకపోవడం వల్లే ఎనిమిది వార్డులకే పరిమితం కావాల్సి వచ్చిందంటున్నారు. పరిషత్ ఎన్నికల్లోనూ ఈ మండలంలో కేవలం తొమ్మిది సీట్లను మాత్రమే సాధించగలిగింది. అయితే ఈ మండలంలో ఇతర పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో సీపీఐ మద్దతు కీలకంగా మారింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మున్సిపల్, పరిషత్ ఫలితాలే ఇలా వస్తే రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. అందుకే వైఫల్యాలపై విస్తృత చర్చ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.