Kupwara encounter
-
హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ము,కశ్మీర్లోని గత మూడు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా కుప్వారా జిల్లా హంద్వారా ఏరియా బాబాగుండ్లో ఆదివారం భద్రతాదళాలు...ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో రెండు ఇళ్లు, రెండు గోశాలలు ధ్వంసమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా గత మూడు రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు జమ్ము,కశ్మీర్ పోలీసులు ఉన్నారు. -
ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఆర్మీ కల్నల్ మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని మణిగావ్ అడవుల్లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఒక ఆర్మీ కల్నల్ వీరమరణం పొందారు. ఉదయం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్లో ఆ అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ప్రాంతంలో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదుల్లో అడవుల్లో నక్కి.. వారి కోసం గాలిస్తున్న భద్రతా దళాలపై కాల్పులకు దిగారు. గతవారం ఇదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు భద్రతా దళాలను ఎదుర్కొన్న ఉగ్రవాదులే.. తాజాగా ఎన్కౌంటర్లోనూ పాల్గొన్నట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదుల బృందమే భద్రతాదళాలతో ఎదురుకాల్పులకు దిగుతున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి.