kurnool-kadapa
-
కేసీకి కోతలు..
సాక్షి, కడప: కేసీ కెనాల్ కథ ముగిసింది. కర్నూలు-కడపజిల్లాల్లో సుమారు మూడు లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన కేసీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీరు సక్రమంగా రాకపోగా.... తుంగభద్ర నీరు రావడం కూడా గగనమైంది. కేటాయింపుల్లో పారదర్శకత లోపించడం, ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించిన నీటి కోటాలోనూ కోతలు... వెరసి దశాబ్దాలుగా కర్నూలు, కడప రైతుల పొలాలను తడిపిన కేసీకెనాల్ నిరుపయోగంగా మారనుంది. దాని ఉనికికే ప్రమాదం వాటిల్లనుంది. తుంగభద్ర నుంచి కేసీకి కేటాయింపుల విషయంలోనూ తాగునీటి అవసరాల పేరుతో కొంత అనంతపురానికి తరలించడం వివాదాస్పదమవుతోంది. ఇటు తుంగభద్ర నీరో, అటు శ్రీశైలం నుంచి వచ్చేనీటినైనా మరికొన్ని రోజులు పూర్తి స్థాయిలో వచ్చి ఉంటే కేసీ పరిధిలోని వరి రైతులకు ధైర్యంగా ఉండేది. ఉన్న ఫలంగా నీటిని నిలిపి వేయడంతో వరి రైతులు ఆవేదనతో ఉన్నారు. తుంగభద్ర నీరు ‘అనంత’కే కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 32 టీఎంసీల నీటి కోటా ఉండగా, రిజర్వాయర్‌లో పూడిక పెరగడం, రిజర్వాయర్ కుదించకపోవడం లాంటి కారణాలతో 2014-15కు 26 టీఎంసీలు కేటాయించారు. ఈ నీటిలో మూడు, నాలుగు టీఎంసీల తుంగభద్ర నీరు వైఎస్సార్ జిల్లాకు వస్తోంది. మిగతాదంతా అనంతపురం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు... తాగు, సాగునీటి అవసరాలకు వాడుకుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే తుంగభద్ర నుంచి కేసీ కెనాల్‌కు కూడా పది టీఎంసీల నీటి కోటా ఉంది. తుంగభద్రలో పూడిక నెపంతో ఈసారి 6.8 టీఎంసీల నీటిని కేసీకి కేటాయించారు. అందులోనూ అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకంటూ ఇందులో కొంతశాతాన్ని మళ్లింపుకు రంగంసిద్ధం చేశారు. ఇప్పటికే 1.50 టీఎంసీలకు సంబంధించి నీటిని విడుదల చేశారు. మరో రెండున్నర టీఎంసీ నీటిని అనంత నీటి అవసరాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదంతా అక్కడి అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి తీసుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముందే కరువు కోరల్లో ఖరీఫ్‌ను కోల్పోయి విలవిల్లాడుతున్న రబీ రైతుకు కనీసం తుంగభద్ర నీరు కేసీకి వస్తుందని ఆశ పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి. శ్రీశైలం నీటి కథ ముగిసింది శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి కేసీకి పది టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికి ఏదో కొంత మేర ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటి మట్టానికి చేరితే ఇక ఎలాంటి కాలువలకు, ప్రాజెక్టులకు నీరిచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 849 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపాడుకు 200 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నా కేసీకి నామమాత్రంగానే వదులుతున్నారు. అది కూడా కర్నూలు జిల్లాలోని ఎగువ ప్రాంత రైతులు వాడుకోగా కడప జిల్లా రైతుకు దక్కేది శూన్యమే. బ్రహ్మంసాగర్‌కు ఎప్పటికి చేరేను? కర్నూలు జిల్లా రుద్రవరం సమీపంలోని వెలుగోడు ప్రాజెక్టు నుంచి ఈనెల 19న తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్బాగమైన బ్రహ్మంసాగర్‌కు నీటిని విడుదల చేశారు. వెయ్యి క్యూసెక్కులే విడుదల చేయడంతో అవి ఎప్పుడు బ్రహ్మంసాగర్‌కు వస్తాయో అంతు చిక్కడం లేదు. మైదుకూరు మండల పరిధిలోని లెక్కలవారిపల్లె వద్ద ఎస్ఆర్-2, ఎస్ఆర్-1 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక టీఎంసీ బ్రహ్మంసాగర్‌కు అధికారులు కేటాయించారు. ఈ మధ్యనే ఎస్ఆర్-1 ప్రాజెక్టు ద్వారా రోజుకు రెండు వేల క్యూసెక్కులనీరు విడుదల చేస్తే బ్రహ్మంసాగర్‌కు వెళ్లేసరికి వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే వెళ్లింది. మధ్యలో కాలువలు దెబ్బతిని ఉండడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. అయతే వెలుగోడు వద్ద కేవలం వెయ్యి క్యూసెక్కులు వస్తే ఎలా వస్తాయి. పైగా తాగనీటి అవసరాల పేరుతో ఎగువ రైతులు యధేచ్ఛగా వాడేసుకుంటున్నారు. ఈ స్థితిలో బ్రహ్మంసాగర్‌కు ఎంత నీరు ఎప్పటికి వస్తుందనేది అధికారులే చెప్పాలి. -
ఆశలు పండేనా
కర్నూలు(రూరల్)/ఆదోని: కర్ణాటకలోని తుంగభద్రజలాశయానికి వరదనీరుపోటెత్తుతోంది. వరుణుడుముఖం చాటేయడంతో.. టీబీడ్యాంపై ఆశలు పెట్టుకున్నజిల్లాలోని దిగువ కాలువ,కర్నూలు-కడప కాలువ ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎగువ భాగంలోకుండపోత కారణంగాఆదివారం మధ్యాహ్నానికిడ్యాంలోకిసుమారు 90వేల క్యూసెక్కులనీరు వచ్చి చేరుతోంది. పస్తుతం డ్యాంలో 72టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుఅధికారుల ద్వారా తెలుస్తోంది.ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే నాలుగైదు రోజుల్లో దిగువకు నీరువిడుదల చేసే అవకాశంఉంది. అదే జరిగితే పదిరోజుల్లో తుంగభద్ర జలాలుజిల్లాకు చేరుకోనున్నాయి. అయితే కర్నూలు-కడప కాలువఆయకట్టుకు ఖరీఫ్‌లో వరి సాగుకు నీరందించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇందుకు జిల్లాలోవర్షాభావ పరిస్థితులు.. నదిపై కర్ణాటక ప్రభుత్వం అనుమతి లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్న ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. తుంగభద్ర జలాలు ఆర్డీఎస్ను దాటి దిగువనున్న సుంకేసులకు, అక్కడి నుంచి కుడి కాలువైన కేసీకిసాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం సుంకేసులబ్యారేజీలో 1.09 టీఎంసీల నీరు మాత్రమే నిల్వఉండగా.. కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకుకేసీ ద్వారా రోజుకు సుమారు 100 క్యూసెక్కుల నీరువిడుదలవుతోంది. కేసీ కెనాల్ కింద కర్నూలు-కడపజిల్లాల్లో మొత్తం ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలు కాగా..కేసీ కెనాల్ కింద ఖరీఫ్‌లో కర్నూలు జిల్లాలోనే 1.10లక్షల ఎకరాల్లో వరి, కడప జిల్లాలో 60వేల ఎకరాల్లోవరి సాగవుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగారైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే ఉత్తమమని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 30న నిర్వహించనున్న సాగునీటి సలహామండలి సమావేశంలోనే అధికారులు ఇదే విషయాన్నిస్పష్టం చేయనున్నట్లు సమాచారం.గస్తీకి ప్రత్యేక బృందాలుదిగువ కాలువ కింద జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు50వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది జిల్లాలోనెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలుపూర్తిస్థాయిలో వేసుకోలేని పరిస్థితి. కర్ణాటకలో భారీవర్షాల కారణంగా టీబీ డ్యాంలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం నీటిపారుదల శాఖ జిల్లా అధికారులు ఎల్ఎల్సీకి రోజుకు 690క్యూసెక్కులు చొప్పున సాగునీరు విడుదల చేయాలనిటీబీ బోర్డు అధికారులకు ఇండెంట్ పెట్టారు. డ్యాంలోకివచ్చే నీరు అధికంగా ఉండటంతో అదే రోజు దిగువకాలువకు నీరు విడుదల చేశారు. కర్ణాటకలో జలచౌర్యం కారణంగా ఆయకట్టు రైతులు తరచూ గగ్గోలుపెడుతుండటం తెలిసిందే. ఈ ఏడాది ఆ పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఇరిగేషన్ అధికారులు కాల్వ131 కి.మీ. నుంచి 250 కి.మీ. వరకున్న 30 డిస్ట్రిబ్యూటరీల్లో ఒక్కో దానికి ముగ్గురు లస్కర్లు.. ఐదుగురువీఆర్వోలు, వీఆర్ఏలు, సమీప ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్,ఎంపీడీఓ, పంచాయతీరాజ్ఇంజనీర్లను బృందాలుగానియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. 250 కి.మీ.నుంచి 324 కి.మీ. వరకున్న 25 డిస్ట్రిబ్యూటరీలకుఒక్కోదానికి 3 నుంచి 5 లస్కర్లు, ఆయా మండలాలసబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులచే బృందం ఏర్పాటు చేసినీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని భావిస్తున్నారు. ప్రత్యేకబృందాల నివేదికను నీటి పారుదల శాఖ అధికారులుగత శనివారం కలెక్టర్ విజయమోహన్‌కు అందజేశారు.వరి మళ్లు సిద్ధం చేసిన రైతులు: ఎల్లెల్సీ పరీవాహకప్రాంతంలోని ఆయా మండలాల రైతులు బోర్డు,బావులు, తుంగభద్ర, వేదావతి నదుల కింద వరినారుమళ్లు పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఇప్పటికే 20 నుంచి30 రోజుల వరి నారు పచ్చగా కళకళలాడుతోంది.నలభై రోజుల్లోపు వరి నాట్లు వేయాల్సి ఉంది. కాలువకు నీరు విడుదల కావడంతో రైతులు తమ భూములను అరక దున్ని చదును చేసుకుంటున్నారు.