kurnool range dig
-
జిల్లాలో పనిచేసిన ప్రతి అధికారి ఆదర్శప్రాయుడే
► కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ కడప అర్బన్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ కోసం, రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచేలా జిల్లా పోలీసు అధికారులు కృషి చేశారని కడప, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ ప్రశంసించారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తూ నెల్లూరుజిల్లాకు బదిలీపై వెళుతున్న పీహెచ్డీ రామకృష్ణ, జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీగా పదోన్నతిపై వెళుతున్న బి.సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పీగా పనిచేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఓఎస్డీగా వెళుతున్న అన్బురాజన్, జిల్లాలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న గౌతమిసాలీలకు ఆదివారం కడప నగర శివార్లలోని మేడా కన్వెక్షన్ హాలులో వీడ్కోలు, సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఐజీతోపాటు అధికారులకు పోలీసులు స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ అంకితభావంతో ఎస్పీ రామకృష్ణ, మిగతా అధికారులు పనిచేసి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచేలా చేశారన్నారు. జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాం గానికి ఎస్పీ రామకృష్ణ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు యంత్రాంగం, ప్రజలు, మీడియా తన విధులను చట్టపరంగా నిర్వర్తించేందుకు ఎంతో సహకరించారన్నారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణలో తన వెన్నంటి ఉన్నారన్నారు. పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ పోలీసు అధికారుల సహకారంతో అనేక టాస్క్‌లను పూర్తి చేయగలిగామన్నారు. డీటీసీ బసిరెడ్డి మాట్లాడారు. అనంతరం అధికారులను సన్మానించారు. ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, షౌకత్ అలీ, సుధాకర్, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, మహిళా అప్‌గ్రేడ్ డీఎస్పీ వాసుదేవన్, డీసీఆర్బీ డీఎస్పీ నాగేంద్రుడు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
‘రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయం’
అనంతపురం మెడికల్ : రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా పని చేద్దామని కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పిలుపునిచ్చారు. రవాణా రంగంలో పని చేస్తున్న 405 మంది కార్మికుల పిల్లలకు శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో శనివారం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో స్కాలర్షిప్పులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎస్పీ రాజశేఖర్‌బాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జాతీయ రహదారులపై నిఘా ఉంచి తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల వరకు వాహనాలను ఆపి డ్రైవర్ల ముఖాలు కడిగించి పంపుతామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ జోనల్ బిజినెస్ హెడ్ అంజా అలి, రీజనల్ బిజినెస్ హెడ్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ 7వ తరగతిలో 60 శాతం మార్కులు వచ్చిన వారికి మూడేళ్ల నుంచి స్కాలర్షిప్స్ ఇస్తున్నామన్నారు. డీఎస్పీలు శివరామిరెడ్డి, వెంకటరమణ, మహబూబ్‌బాషా, నరసింగప్ప, కంపెనీ రీజనల్ క్రెడిట్ హెడ్ రాజశేఖరరెడ్డి, సీనియర్ మేనేజర్ నాగేశ్వరయ్య, సీఐ యల్లమరాజు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. చివరగా విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. ఆడిటోరియంలో ఉద్విగ్న క్షణాలు ప్రముఖ నాట్యాచార్యులు సంధ్యామూర్తి ప్రసంగించే సమయంలో ఆడిటోరియం మొత్తం నిశ్శబ్దంగా మారింది. తన భర్త రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారని, కుటుంబ పెద్ద దిక్కుపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు. -
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు
-
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు
కడప : కడప నగరంలోని నారాయణ ప్రైవేట్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతి ఘటనపై విచారణాధికారులను నియమించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ బి.వి. రమణకుమార్ వెల్లడించారు. ఈ కేసులో విచారణాధికారులుగా ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం, స్పెషల్ పోలీస్ బెటాలియన్ డీఎస్పీ సుధాకర్ వ్యవహరిస్తారని తెలిపారు. బుధవారం కడపలో రమణకుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థినుల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థినుల మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. విద్యార్థులు రక్తంతో రాసినట్లు చెప్పబడుతున్న లేఖను డీఎన్ఏ టెస్ట్‌కు పంపామని... అలాగే విద్యార్థినుల సూసైడ్ నోట్‌ను కూడా పరీక్షల కోసం ఫోరెన్సిక్ లేబ్‌కు పంపినట్లు చెప్పారు. విద్యార్థినుల మృతిపై ఎవరైనా సమాచారం ఇవ్వాలంటే 9440796935 ఈ సెల్ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పోలీసుల విచారణపై ఎలాంటి అనుమానాలు అక్కరలేదని... ఈ కేసు నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని ఈ సందర్భంగా రమణకుమార్ తెలిపారు. మృతి చెందిన విద్యార్థినుల ఫ్రెండ్స్‌తో పాటు రూమ్మేట్స్, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం అందర్నీ విచారిస్తామని ఆయన వివరించారు.