KVP Ramchandra Rao
-
కారుకే నేరేడుచర్ల..
సాక్షి, సూర్యాపేట : తీవ్ర ఉత్కంఠ నడుమ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో చెర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. టీఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యులతో 11 ఓట్ల బలం ఉంటే.. కాంగ్రెస్‌కు 10 ఓట్లు ఉండటంతో మెజార్టీ సభ్యులు ఉన్న టీఆర్ఎస్కే నేరేడుచర్ల సొంతమైంది. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని ఎక్స్ అఫీషియో ఓటుగా చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని వాకౌట్ చేసింది. కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. సుభాష్‌రెడ్డి ఓటుతో చైర్మన్ గిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచందర్‌రావు ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత మంగళవారం ఎన్నిక ఉంటుం దని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడంతో టీఆర్ ఎస్ మరో ఎక్స్ అఫీషియో ఓటును పెట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఎత్తు ఫలించింది. ఎన్నిక వాయిదాకు ముందు కేవీపీ ఓటుతో కాంగ్రెస్‌కు 10 ఓట్లు, టీఆర్ఎస్కు 10 ఓట్లు ఉన్నాయి. దీంతో టాస్ వేస్తే ఎవరికి విజయం దక్కుతుందోనని భావించిన టీఆర్ఎస్.. తిరస్కరించిన కేవీపీ ఓటును మళ్లీ ఎలా జాబితా లో పెడతారని వేసిన పాచికతో ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఇరుపార్టీలకు సమానంగా ఓట్లు ఉండటంతో శేరి సుభాష్‌రెడ్డి ఓటును నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నమోదు చేయించింది. దీంతో ఆ పార్టీ సభ్యుల బలం 11కు చేరింది. సుభాష్‌రెడ్డి పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎన్నిక ప్రారంభానికి ముందు చేర్చారు. తొలి జాబితాతోనే ఎన్నిక చేపట్టాలి ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి ప్రారం భిస్తూ ఓటు హక్కు జాబితాలో ఉన్న వారి పేర్లను సమావేశంలో వెల్లడించారు. దీంతో సుభాష్‌రెడ్డికి ఇప్పుడెలా ఓటు హక్కు కల్పిస్తారని ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ సభ్యులు పీఓను ప్రశ్నించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీ షియో సభ్యుడిగా ఓటు హక్కు పొందిన తొలి జాబితాతోనే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని, ఆ తర్వాత నమోదు చేసిన సుభాష్‌రెడ్డి పేరును జాబితాలో నుంచి తీసివేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యే ముందు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, అందకే సుభాష్‌రెడ్డి పేరును ఓటు జాబితాలో చేర్చామని పీవో వివరించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలనే తాము అనుసరిస్తామని పీఓ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ రాస్తారోకో శేరి సుభాష్‌రెడ్డికి ఓటు హక్కు కల్పించడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఉత్తమ్, కేవీపీలు నేరేడుచర్లలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికైన∙మెజార్టీ సభ్యులు బయట ఉన్నా.. ఎన్నిక కాని వారితో చైర్మన్ ఎన్నికను పూర్తిచేశారని విమర్శించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారికే చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని తనకు పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి, ఈసీ చెప్పారన్నారు. ఈ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా మున్సిపల్ ఎన్నికల్లో పంచారని ఆరోపించారు. -
నెరేడుచర్ల: సస్పెన్స్ వీడినట్టేనా!?
సాక్షి, సూర్యాపేట: నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సినిమా ట్విస్టులను తలపిస్తున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచందర్రావును అధికార టీఆర్ఎస్ అడ్డుకోగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే కాసేపట్లో నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి ఓటుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ కేవీపీకి ఎక్స్అఫీషియో ఓటు కల్పించగా.. తాజాగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి కూడా ఓటు కల్పించింది. దీనిలో భాగంగా ఓటరు లిస్టులో కేవీపీ, సుభాష్ రెడ్డిల పేర్లను చేరుస్తూ ఈసీ కొత్త జాబితా విడుదల చేసింది. దీంతో వీరిద్దరు ఈ రోజు జరగబోయే నెరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటంతో సస్పెన్ వీడింది. సుభాష్‌రెడ్డి ఓటు చట్టవిరుద్ధం: కాంగ్రెస్ అయితే సుభాష్‌రెడ్డికి ఓటు కల్పించడంపై కాంగ్రెస్ అభ్యంతర వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే నిదర్శనమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకే సమయం ఉందని, కానీ గడువు దాటినా శేరి సుభాష్‌రెడ్డి పేరు నమోదు చేయడం చట్ట విరుద్దమన్నారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాగా, కేవీపీ, సుభాష్‌రెడ్డిల ఓట్లతో టీఆర్ఎస్కు 11, కాంగ్రెస్‌కు 10 మంది సభ్యుల సంఖ్యా బలం ఏర్పడింది. నెరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపును ఏడుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ తరుపున 8 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. అయితే టీఆర్ఎస్కు నాలుగు, కాంగ్రెస్‌కు రెండు ఎక్స్‌అపీషియో ఓట్లు లభించనున్నాయి. -
బాబూ.. పోలవరంపై కౌంటర్ దాఖలు చేయండి
హైదరాబాద్: పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు బుకాయించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. పోలవరంపై హైకోర్టులో తాను దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన సీఎంకు బుధవారం ఒక లేఖ రాశారు. పోలవరం నిధుల కోసం తరచూ నాగపూర్, ఢిల్లీకి పరుగులు మానుకుని ఈ విషయంలో విభజన చట్టం ప్రకారం కేంద్ర బాధ్యతలను వివరిస్తూ కేంద్రం వివక్ష వైఖరిని తెలియజేస్తూ ఉన్నత న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని సూచించారు. జాతీయ ప్రాజెక్టులు ఏవీ సకాలంలో పూర్తికావడంలేదనే సాకుతో కేంద్రం ఆంక్షలకు ఒప్పుకుంటూ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని మీ చేతుల్లోకి తీసుకుని అంచనాలను నచ్చిన రీతిలో పెంచుకుంటూ ప్రాజెక్టును గందరగోళ స్థితికి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శ్వేతపత్రం అవసరమని రాష్ట్ర ప్రజానీకం భావిస్తున్నా అందుకు నిరాకరించడం తగదన్నారు. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని తాను ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశానని రామచంద్రరావు గుర్తు చేశారు. దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల సమయం ఇస్తూ విచారణను ఈనెల 19కు వాయిదా వేసినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయలేదని తెలుస్తోందన్నారు. కేంద్రం తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలిల్సిన మీరు కేంద్రం అడుగులకు మడుగులొత్తడం చూస్తుంటే మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా వెనుకాడడంలేదని స్పష్టమవుతోందని చంద్రబాబుపై కేవీపీ ధ్వజమెత్తారు. -
పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతోంది
పెద్ద నోట్ల రద్దుపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన ఎంపీ కేవీపీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల కష్టార్జితాన్ని అవసరాలకు సకాలంలో వినియోగించనివ్వకుండా నోట్ల రద్దుతో పౌరుల రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచారంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)కు సోమవారం ఫిర్యాదు చేశారు. ‘పౌరుల గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డున నిలబెట్టింది. నోట్ల రద్దు కారణంగా షాక్‌కు గురై లేదా ఏటీఎం, బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోరుున వారి కుటుంబాలకు రూ.10 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలి. డిసెంబర్, జనవరి నెలల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పౌర సరఫరా శాఖలు తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరండి. రూ.50, రూ.100 నోట్ల సరఫరా పెంచాలి. వేతన జీవులు ఇంటి అద్దె, స్కూలు ఫీజు, ఇంటి అవసరాలకు వెచ్చిం చేందుకు వీలుగా నెలలో ఒకేసారి రూ.50 వేలు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించాలి. వీటన్నింటినీ అమలుచేసేలా ఆదేశాలు జారీచేయాలి..’ అని కోరారు.