L1
-
తుది‘దశ’లో ఆదిత్య ఎల్1
తిరువనంతపురం: సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక త్వరలోనే దాని ఎల్–1 పాయింట్లోకి చేరుకోనుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. తొలి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘ ఆదిత్య తన దిశలో దూసుకుపోతోంది. ఇది దాదాపు తన తుదిదశకు చేరుకుంది. ఎల్–1 పాయింట్లోకి దానిని చేర్చేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీకల్లా ఎల్–1లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం’’ అని చెప్పారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఇన్ఫోసిస్, టీసీఎస్ ప్రాధాన్యం ఇక వారికేనట!
ముంబై: భారతీయ ఐటీ విద్యార్థుల ప్లేస్మెంట్ కలలు ఇక కల్లలుగానే మిగిలిపోనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా ఉద్యోగులపై దృష్టిపెట్టనున్నట్టు నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇక మీదట అమెరికాలోని ఫ్రెషర్స్ కే ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. అమెరికా లోని ఇంజనీరింగ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టనున్నాయి. దీంతో వేలాదిమంది భారతీయ ఐటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందని రిపోర్ట్ చేసింది. హెచ్-1బీ, ఎల్1 వీసాల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి, అధిక ఆదాయం పొందుతున్న భారత ఐటీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుందనే అంచనాలతో కంపెనీలు ఇకమీదట అమెరికా వాసులకే ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. ఇటీవల జెఫ సెషన్స్ చేసిన ప్రతిపాదనలను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు శరాఘాతమే. ఇక ఈ వీసాల ద్వారా అమెరికాలో ప్రవేశించటం భారతీయ ఐటీ విద్యార్థులకు దాదాపు కష్టమైనట్లే. కాగా గత వారం, అటార్నీ జనరల్ పదవికి ట్రంప్ నామినేట్ చేసిన జెఫ్ సెషన్స్ హెచ్-1బీ , ఎల్1 వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ఒక అమెరికన్ ఉద్యోగాన్ని విదేశాల్లో తక్కువ జీతంతో పనిచేసే మరొకరితో భర్తీ చేయడం సరైనదేనని భావించడం చాలా తప్పు అని సెనేట్ జ్యుడీషియరి కమిటీ ముందు జెఫ్ తెగేసి చెప్పారు. గతంలో సెషన్స్, గ్లాసరీ , సెనేటర్ డిక్ డర్బిన్ హెచ్-1బీ, ఎల్1 వీసా సంస్కరణ బిల్లును సహ స్పాన్సర్ చేసిన సంగతి తెలిసిందే. -
భారతీయులకు ‘హెచ్1బీ’ జారీ తగ్గలేదు
* దానిపై పెరిగిన ఫీజుల ప్రభావం లేదు * భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఫీజులు పెంచలేదు * మీడియాతో అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ కాన్సులార్ అఫైర్స్ బాండ్ సాక్షి, హైదరాబాద్: హెచ్1బీ, ఎల్1 వీసా ఫీజులను ఇటీవల భారీగా పెంచినప్పటికీ భారతీయ వృత్తి నిపుణులకు జారీ చేసిన ఆ వీసాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ కాన్సులార్ అఫైర్స్ మిషెల్ బాండ్ తెలిపారు. వీసా ఫీజుల పెంపుపై భారతీయ కంపెనీల ఆందోళనను అర్థం చేసుకోగలమని, అయితే భారత్‌ను లక్ష్యంగా చేసుకొని వీసా ఫీజులు పెంచలేదని ఆమె తెలిపారు. అమెరికా చట్టాల్లో మార్పుల వల్లే వీసా ధరలు పెరిగాయన్నారు. ఇతర దేశాల వీసా ఫీజులతో సమానంగా అమెరికా వీసా ఫీజులు ఉన్నాయని వివరించారు. భారత్‌తో వ్యాపార సంబంధాలు తమకు ఎంతో ముఖ్యమని, ఫీజుల పెంపు ప్రభావం దానిపై ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మిషెల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతేడాది భారతీయులకు అత్యధిక టూరిస్టు, బిజినెస్ వీసాలు జారీ చేశామని, గత ఐదేళ్లతో పోల్చితే ఇది 81 శాతం అధికమన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య పెరుగుతున్న సంబంధాలకు ఈ లెక్కలు నిదర్శనమన్నారు. 2017లో టూరిస్టు, స్వల్పకాలిక బిజినెస్ వీసాల సంఖ్యపై పరిమితి (క్యాప్) ఉండదన్నారు. అర్హులైన దరఖాస్తుదారులందరికీ వీసాలు జారీ చేస్తామన్నారు. పదేళ్ల కాలపరిమితితో ఈ వీసాలు జారీ చేస్తామని, వీటితో ఎక్కువ పర్యాయాలు అమెరికాలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. నైపుణ్యంగల భారతీయ ఉద్యోగులను అమెరికా ఆహ్వానిస్తోందన్నారు. అమెరికాలో ఉద్యోగం కోసం జారీ చేసే హెచ్1బీ వీసాల విషయంలో అత్యంత లబ్ధిపొందిన దేశం భారతేనన్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాల్లో 72 శాతం, ఎల్1 వీసాల్లో 30 శాతం వీసాలను భారతీయులే అందుకున్నారని చెప్పారు. అమెరికా వీసాలు పొందడంలో భారతీయుల విజయాలకు ఈ గణాంకాలే నిదర్శమన్నారు. భారతీయ వ్యాపారవేత్తలకు సత్వరమే సమర్థంగా, పారదర్శకంగా సేవలందించేందుకు ఇక్కడి అమెరికన్ రాయబార, కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఐదో స్థానంలో హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్... భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు అమెరికాలోని వర్సిటీలు, కాలేజీల్లో చేరుతుండడం తమకు సంతోషదాయకమని మిషెల్ పేర్కొన్నారు. గతేడాది 60 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేశామని తెలిపారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత రెండో స్థానం భారతీయ విద్యార్థులదేనన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య గతేడాదికి 1.32 లక్షలకు పెరిగిందన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం అత్యధిక వీసాలు జారీ చేసిందని, ప్రపంచంలోని 200 యూఎస్ కాన్సులేట్ కార్యాలయాలతో పోల్చితే అత్యధిక వీసాల జారీలో నగరంలోని కాన్సులేట్ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. హైదరాబాద్ టీం పనితీరుపై గర్వపడుతున్నామన్నారు. అమెరికా-భారత్‌ల మధ్య ఆర్థిక, వాణిజ్య, సామాజిక సత్సంబంధాలే తమకు అత్యంత ప్రాధాన్యాంశమన్నారు. ఇరు దేశాల నడుమ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 2017ను పర్యాటక సంవత్సరంగా పరిగణించాలని గత జూన్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీ ప్రకటించారని మిషెల్ గుర్తుచేశారు. కొత్త భవనం నిర్మిస్తాం... అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లో కొత్త కాన్సులేట్ జనరల్ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. 2017లో నిర్మాణం ప్రారంభించి 2020 నాటికి భవనం అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ భవనంలో 52 ఇంటర్వ్యూ విండోలు ఉంటాయన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని, ఎవరిపైనా వివక్ష చూపబోమన్నారు. గతేడాది కొందరు భారతీయ విద్యార్థులను అమెరికా ఎయిర్‌పోర్టుల నుంచే స్వదేశానికి తిప్పి పంపిన ఉదంతంపై విలేకరుల ప్రశ్నలకు మిషెల్ స్పందించారు. వీసాలు మంజూరు చేసినా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, స్క్రీనింగ్ అధికారులు ప్రత్యేక కేసులు, ఏదైనా సమాచారం ఆధారంగా అమెరికాలోకి ఎవరి ప్రవేశాన్నైనా నిరాకరించే అవకాశం ఉందన్నారు.