labour department officers
-
వ్యవస్థల్లో అవినీతిని ఏరిపారేయండి
సాక్షి, అమరావతి: వ్యవస్థల్లో అవినీతిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో అవినీతి ఉండకూడదని, అవినీతి వల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతి గురించి సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొన్నారని అధికారులు వివరించారు. ఎల్ఐసీ నుంచి బీమా చెల్లింపులు నిలిచిపోయాయని, ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. బీమా చెల్లింపుల కోసం ప్రధానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సేవలు మెరుగు పరచడం, మందుల కొనుగోళ్లు తదితర అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సీఎం సూచనలు, ఆదేశాలు - మందుల కొనుగోలులో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలి. - ఈఎస్ఐ కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ (గుడ్ మానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలు ఉండాలి. - ఈఎస్ఐ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. - వైద్య సేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే నిర్దేశించుకున్న ప్రమాణాలు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలి. - ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నాం. - ఇప్పుడున్న టీచింగ్ ఆస్పత్రుల సంఖ్యను 11 నుంచి 27కు పెంచుతున్నాం. - ఈ కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారు. - వీరి సేవలను కూడా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలి. - వైద్య ఆరోగ్య శాఖతో అనుసంధానమైన ఈఎస్ఐ ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. - కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి. - ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏమైనా సేవలు మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు పంపితే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. - కాలుష్య నివారణపైనా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడుకోవాలి. - కాలుష్యం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలుష్య నివారణ ప్రమాణాలు ప్రదర్శించాలి. - సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదిలేయడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీంతో భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయి. దీన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. -
ఈఎస్ఐలో అవినీతిని ఏరిపారేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికశాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అవినీతిపై కూడా సమావేశంలో ప్రస్తావించారు. ఈ క్రమంలో మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కూడా కొన్నారని అధికారులు సీఎం జగన్కు వెల్లడించారు. కాగా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని, వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి ఆయన అధికారులకు సూచించారు. 'నాడు-నేడుపై దృష్టిని కేంద్రీకరించండి' అవినీతివల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు. కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈఎస్ఐ బిల్లులు కూడా ఎప్పటికప్పుడు విడుదలచేయాలని పేర్కొన్నారు. వైద్యసేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నామని, ఆ ప్రమాణాలు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బోధన ఆస్పత్రితో పాటు నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉన్న బోధన ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నందునా పెద్ద సంఖ్యలో వైద్యులు ఈ కాలేజీల నుంచి వస్తారన్నారన్నారు. వీరి సేవలనుకూడా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖతో అనుసంధానమై ఈఎస్ఐ ఆస్పత్రులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఆసుపత్రితో సేవల మెరుగు కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. కాగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన కాలుష్య నివారణపైనా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను ఆందోళనకు గురిచేయద్దు : సీఎం జగన్ అదే విధంగా రాష్ట్రాన్ని కాలుష్యం బారినుంచి కాపాడుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కాలుష్యం బారిన పడకుండా చూసుకుంటే రాష్ట్రానికి మేలు చేసినట్టేనని, సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదిలేస్తున్నారన్నారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం, భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయన్నారు. కాలుష్య నివారణ ప్రమాణాలు డిస్ప్లే చేయాలని, కాలుష్యం వల్ల అందులో పనిచేసే కార్మికుల ఆరోగ్యానికీ ఇబ్బందులు వస్తాయన్నారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా ఎల్ఐసీ నుంచి బీమా చెల్లింపు నిలిచిపోయాయని, ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదని కార్మిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకేళ్లారు. ఇక బీమా రూపంలో ఎల్ఐసీ బకాయిలు పడ్డ చెల్లింపు కోసం ప్రధాని మోదీకి లేఖ రాస్తామని సీఎం జగన్ తెలిపారు. -
13 ఏళ్లుగా పనిచేసినా కనీస వేతనం లేదు..
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కార్మికులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస వేతనాలు కరువై, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా చితికిపోతున్నారు. అనారోగ్యం పాలైనా, ఆపదొచ్చినా వారిని యజమానులు ఆదుకోవడం లేదు. ఒక్కరోజు పనికి వెళ్లక పోయినా ఇచ్చే వేతనం నుంచి కోత విధిస్తున్నారు. ఆదివారం కూడా యజమానులు పనిచేయించుకుంటున్నారు. తమ సమస్యలు కార్మిక శాఖాధికారులకు చెబుతామన్న తమను యజమానులు ఉద్యోగం నుంచి తొలగిస్తారని భయపడుతున్నారు. కార్మిక శాఖాధికారులు కూడా కార్మికుల జీవితాలు, వారి సమస్యలపై దృష్టి సారించిన దాఖ లాలు లేవు. జిల్లాలో కార్మికులు 60 వేల పైనే.. జిల్లాలో కార్మిక శాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రర్ చేయించుకున్న వస్త్ర, వ్యాపార, వాణిజ్యం, హేయిర్ కట్టింగ్, టైలరింగ్, కిరాణం, ఫ్యాక్టరీలు, ఇతర దుకాణాలు జిల్లా వ్యాప్తంగా 11 వేల పైచిలుకు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోని దుకాణాలు ఐదు వేలపైనే ఉంటాయి. వీటిలో మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు 60 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు షాపులు తీసి రాత్రి 9 గంటల ప్రాంతంలోగా మూసేయాలని కార్మికశాఖ చెబుతోంది. మధ్యలో భోజనం, విశ్రాంతి కోసం గంటన్నర సేపు సమయం ఇ వ్వాలని ఉంది. అంటే రోజుకు 13 గంటలు షా పులు నిర్వహిస్తుండడంతో కార్మికులు ఉదయం 7 గంటలకే ఇళ్ల నుంచి బయలుదేరి యజమానులు రాకముందే షాపులకు చేరుకుంటారు. షాపులు మూసేవరకు అందుబాటులో ఉంటారు. ఇక ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వర్కర్లు, సెక్యూరిటీ గార్డులైతే రోజుకు 8 నుంచి 10 గంటల వరకు విధులు నిర్వర్తిస్తుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో దర్జీలు 18 గంటలు పనిచేస్తుంటారు. ప్రతి ఆదివారం విశ్రాంతి దొరకడం కార్మికులకు కష్టమైంది. అమలుకు నోచుకోని చట్టాలు కార్మికులు పనిచేస్తున్న సంస్థలు, పనిభారం, ప్రాంతాలను బట్టి కార్మికశాఖ వీరికి వేతనాలు నిర్ణయించింది. స్వీపర్ మొదలు మేనేజర్ స్థాయి వరకు 59 కేటగిరీల్లో కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి. గ్రేడ్-1 మున్సిపల్ పరిధిల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు రూ.6,208 నుంచి రూ.8,065 (హోదాను బట్టి) ఇవ్వాలి. గ్రేడ్-2 మున్సిపాలిటీలు, మండలాల్లో పనిచేసే వారికి రూ.5,878 నుంచి రూ. 7,865 ఇవ్వాలని 2007లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 116, కార్మిక చట్టం చెబుతోంది. ఏటా సెప్టెంబర్, మార్చి నెలల్లో వేతనాలు పెంచాలని ఆ చట్టం చెబుతుంది. కానీ జిల్లాలో ఎక్కడా కార్మిక శాఖ నిర్ణయించిన వేతనాలు కార్మికులకు అందడం లేదు. ఏళ్ల తరబడి ఒకే వేతనంతో పనిచేస్తున్న కార్మికులున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని షాపులపై చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో 1 నుంచి 14 వార్డు వరకు, చెన్నూరు, జైపూర్, కోటపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల్లో కేవలం 450 షాపు యజమానులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. జిల్లాలో పని చేస్తోన్న కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదు చేయడం లేదు.. - రవీందర్, సహాయ కార్మిక అధికారి, సర్కిల్-2, మంచిర్యాల సాధారణ తనిఖీల్లో భాగంగా మేం షాపులకు వెళ్తుంటాం. ఆ సమయంలో యజమాని పనిలో నుంచి తీసేస్తాడని కార్మికులు సమస్యలు చెప్పరు. పనిలో నుంచి వెళ్లిన తర్వాత వచ్చి ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి వారికీ న్యాయం చేస్తున్నాం. పదేళ్ల షాపులో పని చేసి విరమిస్తే.. ఐదు నెలల వేతనం ఇప్పిస్తున్నాం. మా వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న షాపుల్లో పనిచేసే కార్మికుల పిల్లల చదువుకు ఉపకార వేతనాలు, ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.5 వేల నగదు అందిస్తున్నాం. అనారోగ్యం పాలైతే చికిత్స కోసం ఎలాంటి సహాయం అందించలేం.