Labour Welfare Department
-
కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
సాక్షి, హైదరాబాద్: దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా ఉపకారవేతనాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ వరకు ఏదైనా కోర్సు పూర్తి చేసిన కార్మికుల పిల్లలు సంబంధిత కార్మిక కమిషనర్ కార్యాలయం నుంచి దరఖాస్తును పొందాలని, వాటిని పూర్తి వివరాలతో పూరించి 2020 ఫిబ్రవరి 15వ తేదీలోగా కార్మిక శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులని, రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఉపకారవేతనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించింది. -
ప్రతిభ ఆధారంగా ఉపకారవేతనాలు
సాక్షి, హైదరాబాద్: వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రతిభ ఆధారంగా ఉపకారవేతనాలను ఇవ్వనున్నట్లు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి శనివారం తెలిపింది. దుకాణాలు, వాణిజ్య, మోటర్ రవాణా, సహకార, ధార్మిక సంస్థలు, ట్రస్టులు, కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. సంబంధిత కార్మిక సహాయ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు పొందాలని, పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 15లోగా సమర్పించాలని సూచించింది. 2016–17 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పదో తరగతి, ఐటీఐ విద్యార్థులకు రూ.1000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.1,500, డిగ్రీ విద్యార్థులకు రూ.2000 చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు వివరించింది. విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొంది. -
సింగరేణికి జాతీయ స్థాయి అవార్డులు
కొత్తగూడెం: సింగరేణి సంస్థకు జాతీయ స్థాయి లో అవార్డులు లభించాయి. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ)ఆధ్వర్యం లో కార్మిక సంక్షేమ విభాగంలో నిర్వహించిన హౌస్ జర్నల్స్ పోటీలో ‘సింగరేణీయుల సమాచారం’ (సెప్టెంబర్-అక్టోబర్2015) సంచికకు, వీడియో డాక్యుమెంటరీ చిత్రాల విభాగంలో ‘సింగరేణి’ చిత్రానికి అవార్డులు లభించారుు. 2015 వాల్ క్యాలెండర్కు తృతీయ, సింగరేణి వెబ్సైట్కు స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కా రుు. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ చేతుల మీదుగా అవార్డులను సింగరేణి జీఎం నాగయ్య అందుకున్నారు.