ladies hostels
-
పైశాచికత్వం: యువతుల లోదుస్తులు కాజేసి..
భోపాల్ : బాలికల హాస్టళ్లలోకి ప్రవేశించి వారి లోదుస్తులు కాజేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఓ దొంగను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇండోర్ ప్రాంతంలోని లేడీస్ హాస్టల్స్, అమ్మాయిలు అద్దెకు ఉండే నివాసాల్లో గత కొన్ని రోజులుగా లోదుస్తులు మాయం అవుతున్నాయి. అయితే ఈ ఘటనలు రాత్రి వేళల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఇటీవల లోదుస్తుల చోరీలు అధికమవుతున్న నేపథ్యంలో బాధిత మహిళలు విజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో లోదుస్తులు, బట్టలను దొంగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అంతేగాక వాటిని చింపేస్తున్నది కూడా తానేనని ఒప్పుకున్నాడు. (బాలికను బలవంతపు పెళ్లి చేసుకున్న విద్యార్ధి) కాగా ఏడాది క్రితం కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకోగా, ఆ కేసులో కూడా ఇతడే నిందితుడని తేలడంతో నిందితుడిని జైలుకు తరలించారు.ఈ విషయంపై విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి తెమజీబ్ ఖాజీ మాట్లాడుతూ.. తమకు లేడీస్ హాస్టల్స్ నుంచి లోదుస్తులు మాయమవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుల సహాయంతో పోలీసు బృందాలను రాత్రి సమయాల్లో బాలికలు నివసించే హాస్టళ్ల ప్రాంతంలో మోహరించామని తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. (ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య ) -
మహిళా హాస్టళ్లకు మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుప్పలు తెప్పలుగా లేడీస్ హాస్టళ్లు వెలుస్తున్నాయి. వీటిలో అధికశాతం హాస్టళ్లకు సరైన అనుమతులు ఉండవు. ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించవు. పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ, ఫుడ్ విషయంలోనూ మెజారిటీ యాజ మాన్యాలు నిబంధనలను అమలు చేయడం లేదు. చాలామంది యాజమాన్యాలకు తమ హాస్టళ్లలో ఉండే మహిళలు, విద్యార్థినుల సంఖ్య, వారి చిరు నామాలు కూడా తెలియవు. ఇలాంటి హాస్టళ్లలో ఉండే వారికి భద్రత పెంచాలన్న సంకల్పంతో తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లేడీస్ హాస్టళ్లపైనా దృష్టి సారించింది. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలకుపైగానే ఈ లేడీస్ హాస్టళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసులైనప్పుడు ఇబ్బందులు.. లేడీస్ హాస్టళ్లలో వర్కింగ్ విమెన్స్, విద్యార్థినులు అదృశ్యమైనా, ఆత్మహత్యలకు పాల్పడినా.. వారిని ఎవరైనా వేధించినా, ఆ విషయం పోలీసుల దృష్టికి రావడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. నగలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్టు వంటివి చోరీ అయినా.. చాలామంది తమ ఊరు కాదు కాబట్టి అస్సలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇంట్లో వారి సంరక్షణ నుంచి హాస్టల్లోకి వచ్చాక సహజంగానే వారి సంరక్షణ యాజమాన్యాలు తీసుకోవాలి. కానీ చాలా తక్కువ హాస్టళ్లు మాత్రమే అలా చేస్తున్నాయి. చాలా హాస్టళ్లు డబ్బులు తీసుకున్నాక విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. అందుకే ఇకపై అన్ని హాస్టల్ యాజమాన్యాలతో కలిపి ఓ రిజిస్టర్‌ను రూపొందించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, స్థానిక పోలీసుల సాయంతో దశలవారీగా ఈ రిజిస్టర్ రూపొందిస్తారు. అందులో హాస్టల్ యజమాని పేరు, అనుమతులున్నాయా? ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? విద్యార్థుల చిరునామాలు సేకరించారా? సీసీ కెమెరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో ప్రమాణాలకు లోబడి ఉన్నారా? లేదా? ఎలాంటి ఆహారం పెడుతున్నారు? అన్న విషయాలు పొందుపరుస్తారు. అంతేగాకుండా ఈ అన్ని హాస్టళ్ల విద్యార్థులకు ఆపదలు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? పోకిరీ వేధింపులు, సైబర్ వేధింపులు ఎదురైనపుడు ఎలా వ్యవహరించాలి? తదితర విషయాలపై షీటీమ్స్ ఆధ్వర్యంలో పూర్తి అవగాహన కల్పిస్తారు. ముందుగా భాగ్యనగరంలోనే.. ఈ రిజిస్టర్ అమలు తొలుత హైదరాబాద్ కమిషనరేట్‌లోనే మొదలుకానుంది. ముందుగా అమీర్‌పేట, ఎస్సార్ నగర్ ఏరియాల్లో ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే దాదాపు 3 వేల హాస్టళ్లు ఉంటాయని పోలీసుల అంచనా. ఇక హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలు కలిపితే 10 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మరో 5 వేలు అంటే మొత్తం 15 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని, అన్నింటి పూర్తి వివరాలు సేకరించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగించేందుకే: సుమతి, ఎస్పీ, విమెన్‌సేఫ్టీ వింగ్ చాలామంది హాస్టల్ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. తమ హాస్టల్లో ఉండేవారి వివరాలు కూడా సరిగా నమోదు చేయడం లేదు. ఇలాంటి కారణాల వల్ల మిస్సింగ్ కేసులు, చోరీ కేసుల దర్యాప్తులో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చాలామంది తమకు వేధింపులు ఎదురైనా మౌనంగా భరిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హాస్టల్లో ఉండే ఆడవారి రక్షణ మా ధ్యేయం: స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడవారి భద్రతే మా ధ్యేయం. ఇలా హాస్టళ్లలో ఉండే చాలామంది వేధింపులు ఎదుర్కొంటున్నా.. వాటిని అటు ఇంట్లోనూ, ఇటు పోలీసులకూ తెలియపరచడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని పోకిరీలు మరింత చెలరేగుతున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్స్‌ని ఆశ్రయించేలా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తాం. అందుకే ఈ రిజిస్టర్ రూపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. -
పేద విద్యార్థినులను వ్యభిచారకూపంలోకి..
ఓ ప్రైవేటు సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పని చేసేందుకు ఓ యువతి పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చింది. ఇక్కడ ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. వచ్చే జీతంలో ఖర్చులు పోగా నామమాత్రంగానే చేతిలో మిగులుతోంది. ఆ డబ్బును కూడా ఇంటికే పంపించేది. ఇక చేతిలో ఖర్చులకు చిల్లిగవ్వ ఉండటం లేదు. అదే హాస్టల్లో ఉంటున్న తోటి యువతి ఆమెను ఎలాగైనా తన మాదిరిగానే పడుపు వృత్తిలోకి దించాలని నిర్ణయించుకుంది. తన దగ్గర ఖరీదైన సెల్‌ఫోన్, బట్టలు, చేతి నిండా డబ్బును చూపుతూ ప్రలోభ పెట్టింది. ‘నీవు కూడా ఎంతకాలం డబ్బుకు ఇబ్బందులు పడతావు... నేను చెప్పినట్లు వింటే కోరినంత డబ్బు వస్తుం’దంటూ ఆశ పెట్టడంతో సదరు యువతి కొద్ది రోజులకు సరేనంది. ఉద్యోగం మానేసి ఆమెతో కలసి వ్యభిచార కూపంలోకి దిగింది. జీవితాన్ని నాశనం చేసుకుంది. గుంటూరు: అనుమతులు ఉండవు.. నిబంధనలు అసలే పట్టవు.. రక్షణ చర్యలు ఏమాత్రం తీసుకోరు.. ధనార్జనే వారి ధ్యేయం.. ఇందుకోసం విద్యార్థినుల జీవితాలు నాశనమైనా వారికి చీమకుట్టినట్లైనా ఉండదు.. నెలవారీ మామూళ్లతో అధికారులు, పోలీసుల్ని మేనేజ్ చేస్తూ కొందరు యథేచ్ఛగా లేడీస్ హాస్టళ్లను కొనసాగిస్తున్నారు. రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరుకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు నుంచి వచ్చిన విద్యార్థినులు, ఉద్యోగాలు కోసం వచ్చే యువతులు లేడీస్ హాస్టళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ముఖ్యంగా డిగ్రీ, ఇంజినీరింగ్, బీఫార్మసీ వంటి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థినులు ఆయా కళాశాలల్లో వసతి లేకపోవడంతో ప్రైవేటు హాస్టళ్లను వెతుక్కోవాల్సి వస్తోంది. కొన్ని కళాశాలల్లో సౌకర్యం ఉన్నప్పటికీ భోజనం బాగోలేదనో, వసతులు సక్రమంగా లేవనే కారణాలతో అధిక శాతం మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వాటి నిర్వాహకులు సైతం విద్యార్థినుల్ని ఆకర్షించేలా అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని అందులో వారికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. అనుమతులు లేకుండా పలుచోట్ల ఏర్పాటు జిల్లావ్యాప్తంగా 300కు పైగా లేడీస్ హాస్టల్స్ కొనసాగుతున్నాయి. వీటిలో అధికంగా గుంటూరు అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో ఉన్నాయి. లేడీస్ హాస్టల్ నిర్వహించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదరు అధికారులు హాస్టల్ ఏర్పాటు చేసే భవనాలను పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించి ఆయన ఆదేశాల మేరకు అనుమతివ్వాలి. లేడీస్ హాస్టళ్లు కావడంతో అనుమతి ఇచ్చే సమయంలో బిల్డింగ్ చుట్టూ ప్రహరీ గోడ ఉందా.. సరైన రక్షణా చర్యలు చేపట్టారా? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే, ప్రస్తుతం లేడీస్ హాస్టళ్ల నిర్వాహకులు అనుమతులు లేకుండానే వీటిని నడుపుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆమ్యామ్యాలు స్వీకరించి మిన్నకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రక్షణ కరువు పట్టణాలతోపాటు ఊరికి దూరంగా ఉన్న లేడీస్ హాస్టళ్లలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. అపార్టుమెంట్లలో కింద, పైన వ్యాపార సముదాయాలకు అద్దెకిచ్చి మధ్యలో లేడీస్ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. విజయవాడలోని లేడీస్ హాస్టల్లో అయేషామీరా హత్య ఉదంతం, తెనాలి హాస్టల్లోకి సైకో ప్రవేశించి దారుణాలకు పాల్పడిన సంఘటనలతోపాటు బయటకు పొక్కని సంఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ నిర్వాహకులకు చీమకుట్టి నట్లైనా ఉండటం లేదు. అక్కడ విద్యార్థినులకు ఏం జరిగినా బయటకు పొక్కడానికి వీల్లేదు. అదేమంటే బయటకు తెలిస్తే ‘మీపరువే పోతుంది.. మీ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మాన్పించి ఇంటికి తీసుకెళ్తా’రంటూ విద్యార్థినులను భయపెడుతున్నారు. విద్యార్థినుల రక్షణ గురించి పర్యవేక్షించాల్సిన అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావిడి చేస్తూ చేతులు దులుపుకుంటున్న పోలీసులు, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి వీటిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలు బేఖాతర్ లేడీస్ హాస్టళ్లను మహిళలు మాత్రమే నిర్వహించాలి. కళాశాల విద్యార్థినులకు ఏర్పాటు చేసిన చోట్ల బయట మహిళలకు వసతి కల్పించకూడదు. విద్యార్థినుల్ని చేర్చుకునే సమయంలో కూడా వారు చదివే కళాశాల యాజమాన్యం లేఖ ఇవ్వాలి. అయితే, నిర్వాహకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఉద్యోగాల సాకుతో వచ్చే కొందరు ఆకతాయి మహిళలకు సైతం వసతి కల్పిస్తున్నారు. వీరు నిరుపేద విద్యార్థినులకు డబ్బు, బట్టలు, సెల్‌ఫోన్ వంటి వాటిని ఇచ్చి ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి హాస్టల్ నిర్వాహకులు సైతం సహకరిస్తూ రాత్రి వేళల్లో యువకులను హాస్టల్లోకి అనుమతిస్తూ విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక దృష్టి సారిస్తాం హాస్టల్స్ నిర్వహణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులను ఆప్రమత్తం చేస్తాం. ఇప్పటికే ఆయా హాస్టల్స్‌పై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. - సీహెచ్. విజయారావు, అర్బన్ ఎస్పీ ఎంతటి వారైనా ఉపేక్షించం నిబంధనలకు విరుద్ధంగా లేడీస్ హాస్టల్స్‌ను నిర్వహిస్తే సహించేది లేదు. ఇప్పటికే శక్తి బృందాలు వారి పరిధిలో కొనసాగుతున్న హాస్టల్స్‌కు వెళ్లి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా నిర్భయంగా తెలియచేయవచ్చు. వ్యభిచారాన్ని ప్రోత్సహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోం. – ఎస్.వి. రాజశేఖరబాబు, రూరల్ ఎస్పీ -
టీడీపీ నేతల వేధింపులు: హాస్టల్ వార్డెన్ ఆత్మహత్యయత్నం
-
స్మార్ట్ కోరల్లో చిక్కి..
నగర శివారులోని ఓ సంక్షేమ గృహంలో ఉండే బాలిక నీలిచిత్రాలు చూస్తుండగా వార్డెన్ పట్టుకున్నాడు. అప్పటి నుంచి అందరికీ చెబుతానని బెదిరించి బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం పదిమందికీ తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీసుల సలహా మేరకు వారు మరో ఊరుకు మకాం మార్చారు. ఎనిమిదో తరగతి చదువుతున్నఓ బాలుడు మాదాపూర్‌లో ఓ లేడీస్ హాస్టల్లో మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. అతని ట్యాబ్‌లో ఏకంగా 3,000 వీడియోలు దొరికాయి. ఇదంతా ఎలా తీశావంటే.. యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని చెబితే విస్తుపోవడం పోలీసుల వంతైంది. 50 ఏళ్లున్న ఓ పెద్దమనిషి ఫేస్బుక్లో ఓ బాలికను మాయమాటలతో మభ్యపెట్టి, ఆమె నగ్నచిత్రాలు తస్కరించి వేధించడం ప్రారంభించాడు. విషయం సైబర్ పోలీసుల దాకా వెళ్లడంతో బాలిక అపాయం నుంచి బయటపడింది. సాక్షి, హైదరాబాద్: నగరం.. ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పిల్లలు, స్కూలు, ఇల్లు, ఉద్యోగాలు అంటూ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మినీ యుద్ధమే చేస్తారు. ఈ క్రమంలో పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అన్న విషయాలపై శ్రద్ధ లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణం. ఇంట్లో ఇంటర్నెట్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వదిలి వెళ్తున్నాం, మా పిల్లలెలా ఉన్నారో వీడియో కాల్ ద్వారా చూసి ఆనందపడుతున్నాం అనుకుంటున్నారు కానీ.. వారు గాడ్జెట్లతో ఏం చేస్తున్నారన్నది పోలీస్‌స్టేషన్ నుంచి పిలుపొచ్చే దాకా తల్లిదండ్రులకు తెలియట్లేదు. ఇలాంటి ఘటనలు వారిని తలెత్తుకోనీకుండా చేస్తున్నాయి. భవిష్యత్తును నాశనం చేస్తున్న ఫోన్లు.. మొన్నటిదాకా బ్లూవేల్ గేమ్‌ల పేరుతో ప్రాణాలు తీసుకున్న పిల్లలు, ఇపుడు పబ్జీ గేమ్‌ల పేరుతో 24 గంటలూ గ్రూపులుగా గేమ్‌లోనే మునిగిపోతున్నారు. ఓవైపు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నా.. ఎవరిలోనూ ఎలాంటి ఆందోళనా లేదు. అర్ధరాత్రి ఒంటిగంట లేదా తెల్లవారుజామున 4 గంటల దాకా గ్రూపులుగా ఉండి మరీ ఈ వీడియో గేములు ఆడుతున్నారు. తీరా రిజల్ట్ వచ్చేసరికి బ్యాక్‌లాగ్స్‌తో తెల్లమొహాలు వేస్తున్నారు. ఇంటర్లో 90 శాతం తెచ్చుకున్న విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీకి వచ్చేసరికి బండెడు బ్యాక్‌లాగ్స్ పెట్టుకోవడం తల్లిదండ్రులను, పాఠాలు చెప్పే గురువులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. మొత్తానికి స్మార్ట్‌ఫోన్ ఎడిక్షన్లో కూరుకుపోయిన పిల్లలు తమ తప్పు తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. స్మార్ట్ ఎడిక్షన్ లక్షణాలు.. ►ఇది టీనేజీ పిల్లల్లో అధికం. స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం ఉండరు తినేటప్పుడు, పడుకునేటప్పుడు, తరగతి గదిలో, చివరికి బాత్రూంలోనూ ఇది లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంటారు ►డిప్రెషన్‌కు లోనవడం, చీటికీమాటికీ చిరాకుపడటం ►అశ్లీల సాహిత్యం, వీడియోలకు బానిసవడం, ఇంటర్నెట్ లేకపోతే మౌనంగా కూర్చోవడం, ఎవరితోనూ కలవలేకపోవడం ► మిత్రులపై గాసిప్స్ క్రియేట్ చేయడం, వాటిని షేర్ చేయడం ►ఏకాంతంగా ఉండటం, చదువుపై శ్రద్ధ చూపకపోవడం ► పదేపదే అద్దంలో చూసుకోవడం, తమలో తామే నవ్వుకోవడం, బాధపడటం. అందంగా ఉన్నవాళ్లతో తమను పోల్చి చూసుకోవడం ► నిత్యం కొత్తదనం కోసం తపించడం, హింసాత్మక గేమ్‌లు ఆడటం ఇది నిశ్శబ్ద ప్రమాదం: ఎండ్ నౌ ఫౌండేషన్ స్మార్ట్‌ఫోన్ దుర్వినియోగం ఇప్పుడు ఒక వ్యసనంగా మారింది. దీనిపై స్పందించకుంటే భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ‘ఎండ్ నౌ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ రాచమల్ల. లేత వయసులో ఇలాంటి ఘటనలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సమాజంలో వారిని తలెత్తుకోనీయకుండా చేయడంతో బాగా కుంగిపోతారు. కానీ, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పిల్లలకు స్మార్ట్‌ఫోన్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే వారి తరువాత ఇలాంటి ఘటనల్లో రెండో బాధితులు తల్లిదండ్రులే. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ విషసంస్కృతిపై అందరం పోరాడాలి. ఇలాగే వదిలేస్తే ఇది దేశ భవిష్యత్‌ని కబళిస్తుంది. అందుకే ఆన్లైన్ భద్రత, సైబర్ సమస్యలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, స్మార్ట్‌ఫోన్‌ను ఎంతవరకు వినియోగించాలి? వాటి దుష్ప్రభావాలపై విద్యార్థులకు కౌన్సెలింగ్, పోలీసులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైన పిల్లలకు మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వాటివల్ల సమాజంలో బంధాలు, బాంధవ్యాలు ఎలా నాశనమవుతాయో, వారి కెరీర్ ఎలా విచ్ఛిన్నమవుతుందో వివరిస్తున్నాం. ఈ ప్రయత్నంలో మా సంస్థ సైనికులు కూడా విద్యార్థులే కావడం విశేషం. మాతోపాటు సంస్థలో జస్టిస్ ఈశ్వరయ్య, విశ్రాంత ఐపీఎస్ కాశీనాథ్ బత్తిన, డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులు భాగస్వాములుగా ఉన్నారు. ఎలా అరికట్టాలి..? ►వీటిని నివారించాలంటే.. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి కేసుల స్వీకరణకు పోలీసులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి ► విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చి సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి ► యువత, టీనేజర్లకు చైనా తరహాలో ‘స్మార్ట్ డీ–ఎడిక్షన్’ సెంటర్లు ఏర్పాటు చేసి చికిత్స అందించాలి ► ఆన్లైన్ వేధింపులకు శిక్షలు కఠినతరం చేయాలి ► ప్రమాదకరంగా మారిన గేమింగ్ సైట్లను ఎప్పటికపుడు గుర్తించి నిషేధించాలి ► అశ్లీలం, హింసను ప్రేరేపించే సైట్లపై పర్యవేక్షణ ఉంచాలి ►చిన్నారులపై ఆన్లైన్ ద్వారా వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి -
ఏయూ హాస్టల్లో విద్యార్థుల వికృత చేష్టలు
-
ఏయూ హాస్టల్లో విద్యార్థుల వికృత చేష్టలు
► గంజాయి సేవించి వీరంగం ► లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి అభ్యంతరకర విన్యాసం ► ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన ► ఆ నలుగురు సస్పెన్షన్ సాక్షి, విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు హద్దులు మీరారు. పూటుగా గంజాయి సేవించి వీరంగం చేశారు. మత్తెక్కిన మైకంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించారు. తూగుతూ, ఊగుతూ సరాసరి లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించారు. అక్కడున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఏయూ చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి, అధ్యాపక వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. అప్రమత్తమై న యాజమాన్యం ఆ విద్యార్థులను సస్పెండ్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు గంజాయి సేవనానికి అలవాటు పడ్డారు. వీరిలో నలుగురు విద్యార్థులు తాముంటున్న హాస్టల్ వద్ద శుక్రవారం రాత్రి పూటుగా గంజాయి సేవించారు. బయట ఉన్న కొందరితో అరగంట పాటు వాగ్వాదానికి దిగారు. మత్తు నషాళానికి ఎక్కిన తర్వాత ఒళ్లు మరిచారు. సమీపంలో ఉన్న లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించారు. ఒకరిద్దరైతే తమ ఒంటిపై ఉన్న దుస్తులను కూడా తొలగించుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డు కున్నా ఆగకుండా దూసుకెళ్లారు. హాస్టల్లో ఉన్న విద్యార్థినుల వైపునకు వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా స్పృహ లేకుండా నానా హంగామా చేశారు. పావుగంట పాటు వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు సెక్యూరిటీ సిబ్బంది నిలువరించి వారిని అతికష్టంపై అక్కడ నుంచి బయటకు గెంటివేశారు. మత్తులో తూగుతూ అదుపు తప్పిన వీరిని చూసి హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు భయకంపితులయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది చొరవతో బయటకు పంపడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొన్నాళ్లుగా ఇదే తంతు.. ఏయూలో కొంతమంది ఇంజినీరింగ్ విద్యార్థులు మద్యానికి అలవాటుపడ్డారు. తాము ఉంటున్న హాస్టల్ గదుల్లో నిర్భయంగా మద్యం సేవిస్తున్నారు. హాస్టళ్ల పరిసరాల్లో ఎక్కడబడితే అక్కడ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తూనే ఉంటున్నాయి. అయినా హాస్టళ్ల వార్డెన్లు, ఏయూ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రాత్రి పూట బయట వ్యక్తులు కూడా మద్యంతో పాటు గంజాయి సేవిస్తున్నారు. కొన్నాళ్ల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా గంజాయి పీల్చడానికి అలవాటు పడ్డారు. ఇటీవల కాలంలో అది మరింత అధికమవుతోంది. ఫలితంగా ఇప్పుడు హద్దులు మీరి వీరంగం చేయడం, లేడీస్ హాస్టళ్లలోకి ప్రవేశించే స్థాయికి చేరుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆ నలుగురు సస్పెన్షన్! మత్తులో తూగి అసభ్యకరంగా ప్రవర్తించిన నలుగురు విద్యార్థులను ఏయూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కెమికల్ ఇంజినీరింగ్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న వారిగా గుర్తించారు. తక్షణమే వారిని సస్పెండ్ చేయాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించినట్టు ఏయూ వీసీ జి. నాగేశ్వరరావు శనివారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి విషయాన్ని వారికి తెలియజేశామన్నారు. ఏయూలో అసాంఘిక కార్యకలాపాలను, గంజాయి, మద్యం సేవనాన్ని సహించబోమన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీని వేశామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
లేడీస్ హాస్టళ్లే అతడి టార్గెట్
భాగ్యనగర్ కాలనీ : గుట్టుచప్పుడు కాకుండా లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి సెల్ఫోన్లు ఎత్తుకెళ్లడమే కాకుండా.. ఆ ఫోన్లో ఉన్న యువతుల నెంబర్లకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గురువారం సీఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన సిలివేరి సంతోష్ కుమార్ (19) బోరబండ పరిధిలోని పర్వత్‌నగర్‌లో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఇతను కొంతకాలంగా కేపీహెచ్‌బీ కాలనీ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని లేడీస్ హాస్టళ్లలో రాత్రి పూట చొరబడి.. బ్యాటరీ చార్జింగ్ కోసం కిటికీలో పెట్టిన సెల్ఫోన్లు తస్కరిస్తున్నాడు. హాస్టల్లో చొరబడ్డ ఇతడిని యువతులెవరైనా గమనించి ఎవరు నీవని ప్రశ్నిస్తే.. అసభ్యంగా మాట్లాడడమే కాకుండా... నగ్నంగా ఫొటోలు తీసి నెట్లో పెడతానని బెదిరించి పారిపోతాడు. గతనెల 19న కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న శ్రీకమల లేడీస్ హాస్టల్లోన ఒక గదిలో ఓ యువతి నిద్రపోయింది. చార్జింగ్ పెట్టిన ఆమె సెల్‌ఫోన్‌ను సంతోష్‌కుమార్ దొంగిలించాడు. అలికిడికి మేల్కొన్న ఆ యువతి సంతోష్‌ను చూసి బిగ్గరగా అరవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ చూపించి చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోన్లో ఉన్న ఆమె నెంబర్లను గుర్తించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉండగా... హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సంతోష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. హాస్టళ్లలో సెల్ఫోన్లు దొంగిలించడంతో పాటు యువతులకు ఫోన్ చేసి వేధిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి 8 సెల్ఫోన్లు, 2 మెమొరీకార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నిర్భయతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్ఐ విజయ్‌కుమార్, క్రైమ్ ఎస్సై తిరుపతి పాల్గొన్నారు. -
లేడీస్ హాస్టళ్లలో ఫోన్లు చోరీ చేసి...
హైదరాబాద్: లేడీస్ హాస్టళ్లలో సెల్ఫోన్లు కొట్టేస్తూ యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాలివీ.. సంతోష్‌కుమార్ అనే యువకుడు గత కొంత కాలంగా లేడీస్ హాస్టళ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతేకాదు, చోరీ చేసిన సెల్ఫోన్లతో యువతులను బెదిరిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంతోష్‌కుమార్‌ను గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.