Ladki Movie
-
నిర్మాత శేఖర్ రాజుపై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు..
RGV Police Complaint Against Sekhar Raju: సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం 'లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జులై 15న విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలను వర్మ తీసుకున్నట్లు శేఖర్ రాజు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు ఆర్జీవీ. నిర్మాత శేఖర్ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'లడ్కీ' చిత్రాన్ని నిలుపుదల చేశారని సీఐ హరీశ్ చంద్రారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో ఆర్జీవీ పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. శేఖర్ రాజు నాకే డబ్బు ఇవ్వాలి. లడ్కీ చిత్రంపై తప్పుడు సమాచారంతో సివిల్ కోర్టులో కేసు వేశారు. కోర్టును తప్పుదోవ పట్టించడంతో సినిమాను నిలిపివేయాలని ఈరోజు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. సినిమాపై ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. నిర్మాత శేఖర్ రాజుకు నేను ఎలాంటి డబ్బు ఇవ్వాల్సింది లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను. అని తెలిపారు. చదవండి: కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ ఏందయ్యా రాహుల్ ఈ తమాషా.. నటుడి న్యూడ్ పిక్ వైరల్ డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
రామ్ గోపాల్ వర్మకు షాక్.. 'లడ్కీ' సినిమాపై కోర్టు స్టే..
Civil Court Stay On Ram Gopal Varma Ladki Movie: ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన "లడ్కీ (అమ్మాయి)" సినిమాపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో "సాఫ్ట్ వేర్ సుధీర్" సినిమాను నిర్మించిన తాను రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాలని సంకల్పించానని, ఆ మేరకు ఆయనను కలిశానని శేఖర్ రాజు వెల్లడించారు. అయితే తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటూ వస్తున్నారని, శేఖర్ రాజు వివరించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదని, దాంతో తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌తో కోర్టును ఆశ్రయించానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న సిటీ సివిల్ కోర్టు ''లడ్కీ" సినిమాను అన్ని భాషల్లో ప్రదర్శనను నిలుపివేస్తూ, ఆర్డర్స్ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్‌లో సినిమాను అమ్మడానికి కానీ, బదిలీ చేయడానికి కానీ, ప్రదర్శించడానికి వీలులేకుండా తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కాగా లడ్కీ చిత్రం జులై 15న విడదలై పాజిట్వ్ టాక్‌తో సందడి చేస్తోంది. చదవండి: 👇 పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్..! బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ -
కొత్త తరహా సినిమాలను ఆదరిస్తారు
‘‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా చూసినప్పటి నుంచి అలాంటిది చేయాలనుకున్నాను. అందుకే ‘అమ్మాయి’ సినిమా నా కలల ప్రాజెక్ట్. పూజా భాలేకర్ లాంటి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త తరహా సినిమాలు తీస్తే ఆదరిస్తామని మరోసారి ‘అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకులు నిరూపించారు’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి’). టి. అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మాయి’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో టి. అంజయ్య మాట్లాడుతూ– ‘‘ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ)గారు తీసిన ‘శివ’ తర్వాత ‘అమ్మాయి’ సినిమానే పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయమంటున్నారు. ఆ చిత్రాన్ని నేనే నిర్మిస్తా’’ అన్నారు. ‘‘అమ్మాయి’ వంటి మంచి హిట్ ఇచ్చిన ఆర్జీవీ, అంజన్నగార్లకు థ్యాంక్స్’ అని అన్నారు నిర్మాత రామ సత్యనారాయణ. -
రామ్ గోపాల్ వర్మ 'లడ్కీ'కి హిట్ టాక్.. మరిన్ని థియేటర్లలో..
Ram Gopal Varma Ladki Movie: పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ చిత్రం టి అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై రూపొందింది. ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, సక్సెస్ అవ్వడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. ఇక సినిమా విజయవంతంగా ప్రదర్శితం కావడంతో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన మా శ్రేయోభిలాషిగా ఈ సినిమా కోసం ఎంతో పని చేశారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పాను. ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసినప్పటి నుంచి అలాంటిది ఒకటి చేయాలని అనుకున్నాను. పూజా భాలేకర్ లాంటి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త జానర్లో సినిమాను ప్రయత్నించాం. కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్లీ ‘అమ్మాయి’ సినిమాతో నిరూపించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రాపర్ సక్సెస్ మీట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తాం’ అని తెలుపారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘అమ్మాయి లాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆర్జీవీ గారికి, వెనుకుండి సపోర్ట్ ఇచ్చిన మా అంజన్న గారిని అభినందిస్తున్నాను. మా అంజన్న ఐదు సినిమాలు తీశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. ఇక రేపటి నుంచి ఏపీలో మరో వంద థియేటర్లు పెంచుతున్నారని చెప్పడం కోసం మీడియా ముందుకు వచ్చాం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆర్జీవీ. చైనాలో 40 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. మొదటి రోజే రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది జర్నలిస్ట్ మిత్రుడు చెప్పారు. అన్ని చోట్లా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పూజా బాగా నటించింది. ఇప్పటికే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు ఆర్జీవీ గారు, అంజన్న గారికి థ్యాంక్స్’ అని అన్నారు. నిర్మాత టి. అంజయ్య మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఆయనతో నాది ఐదేళ్ల ప్రయాణం. ఈ చిత్రం ఆయనకు మానసిక పుత్రిక. సినిమాను చూస్తూ అందరూ చొక్కాలు చించుకుంటున్నారు. శివ తర్వాత ఈ సినిమానే అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయమని అంటున్నారు. ఆ చిత్రాన్ని కూడా నేనే నిర్మిస్తాను. ఎంతో పెద్ద సక్సెస్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా కూడా ఆర్జీవీ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’ అని పేర్కొన్నారు. -
నా కల నెరవేరింది: రామ్ గోపాల్ వర్మ
తన కల నెరవేరిందంటున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. ఇటీవల ఈయన చిత్రాలకు తీసుకుంటున్న నేపథ్యం కూడా వివాదాంశం గానే మారుతుంది. తరచూ బయోపిక్‌లపై దృష్టి పెడుతున్న రాంగోపాల్ వర్మ తాజాగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూర్తి కమర్షియల్ ఫార్ములాలో లడ్కీ అనే చిత్రాన్ని హిందీలో రూపొందించారు. ఆర్ట్సీ మీడియా ప్రొడక్షన్స్, ఇండో చైనీస్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు పొన్ను అనే పేరును నిర్ణయించారు. త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ తాను కళాశాలలో చదువుతున్న సమయంలోనే నటుడు బ్రూస్లీ తన హృదయాన్ని టచ్ చేశారన్నారు. ఆయన నటించిన చిత్రాలను తాను వరుసగా చూసేవాడినని తెలిపారు. ఆ తరహా మార్షల్ ఆర్ట్స్ కథా చిత్రాలు మన దేశంలో తెరకెక్కించలేదన్నారు. దీంతో తాను మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకున్నానని, ఇప్పటికీ నెరవేరిందన్నారు. బ్రూస్లీ తరహా పాత్రను లేడీతో చేయాలనుకున్నట్లు చెప్పారు. చాలామంది నటీమణులను పరిశీలించి చివరకు పూజా భలేకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆమె నిజ జీవితంలో మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి అని తెలిపారు. ఈ చిత్రంలో ఆమె నటనను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.