Ram Gopal Varma Filed Police Complaint Against Producer Sekhar Raju, Details Inside - Sakshi
Sakshi News home page

RGV: అతనికి నేను ఎలాంటి డబ్బు ఇచ్చేది లేదు

Published Wed, Jul 20 2022 1:48 PM | Last Updated on Wed, Jul 20 2022 3:15 PM

Ram Gopal Varma Police Complaint Against Producer Sekhar Raju - Sakshi

RGV Police Complaint Against Sekhar Raju: సంచలనాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం 'లడ్కీ: ఎంటర్‌ ది గర్ల్ డ్రాగన్‌'. పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జులై 15న విడుదలైన మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలను వర్మ తీసుకున్నట్లు శేఖర్‌ రాజు ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఈ విషయానికి సంబంధించి తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు ఆర్జీవీ. నిర్మాత శేఖర్‌ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'లడ్కీ' చిత్రాన్ని నిలుపుదల చేశారని సీఐ హరీశ్‌ చంద్రారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో ఆర్జీవీ పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్ గోపాల్‌ వర్మ.. శేఖర్‌ రాజు నాకే డబ్బు ఇవ్వాలి. లడ్కీ చిత్రంపై తప్పుడు సమాచారంతో సివిల్ కోర్టులో కేసు వేశారు. కోర్టును తప్పుదోవ పట్టించడంతో సినిమాను నిలిపివేయాలని ఈరోజు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. సినిమాపై ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. నిర్మాత శేఖర్ రాజుకు నేను ఎలాంటి డబ్బు ఇవ్వాల్సింది లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను. అని తెలిపారు. 

చదవండి: కరీనా కపూర్‌ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్‌
ఏందయ్యా రాహుల్‌ ఈ తమాషా.. నటుడి న్యూడ్‌ పిక్‌ వైరల్‌
డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్‌.. గర్భవతిగా నమ్మిస్తూ..
చిక్కుల్లో సింగర్‌ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక
ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్‌ తమ్ముడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement