తన కల నెరవేరిందంటున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. ఇటీవల ఈయన చిత్రాలకు తీసుకుంటున్న నేపథ్యం కూడా వివాదాంశం గానే మారుతుంది. తరచూ బయోపిక్‌లపై దృష్టి పెడుతున్న రాంగోపాల్ వర్మ తాజాగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూర్తి కమర్షియల్ ఫార్ములాలో లడ్కీ అనే చిత్రాన్ని హిందీలో రూపొందించారు. ఆర్ట్సీ మీడియా ప్రొడక్షన్స్, ఇండో చైనీస్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. కాగా పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు పొన్ను అనే పేరును నిర్ణయించారు.
త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ తాను కళాశాలలో చదువుతున్న సమయంలోనే నటుడు బ్రూస్లీ తన హృదయాన్ని టచ్ చేశారన్నారు. ఆయన నటించిన చిత్రాలను తాను వరుసగా చూసేవాడినని తెలిపారు. ఆ తరహా మార్షల్ ఆర్ట్స్ కథా చిత్రాలు మన దేశంలో తెరకెక్కించలేదన్నారు.
దీంతో తాను మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకున్నానని, ఇప్పటికీ నెరవేరిందన్నారు. బ్రూస్‌లీ తరహా పాత్రను లేడీతో చేయాలనుకున్నట్లు చెప్పారు. చాలామంది నటీమణులను పరిశీలించి చివరకు పూజా భలేకర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆమె నిజ జీవితంలో మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి అని తెలిపారు. ఈ చిత్రంలో ఆమె నటనను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment