లగడపాటి రాజీనామాను ఆమోదించిన స్పీకర్
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన లోక్సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. లగడపాటి రాజీనామా లేఖను స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మంగళవారం లోక్సభలో ఆమోదం పొందటంతో లగడపాటి తీవ్ర మనస్థాపం చెందారు. ఈ నేపథ్యంలో తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. తన రాజీనామా లేఖను మంగళవారం ఆయన స్పీకర్ కు పంపారు. దాంతో బుధవారం ఉదయం స్పీకర్ మీరాకుమార్ లోక్ సభలో లగడపాటి రాజీనామా లేఖను చదవి సభ్యులకు వినిపించారు.