Lake View Guest House
-
బాబుకు ఆ వైరస్ సోకింది: మంత్రి
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. కరోనాపై కాకుండా మా ప్రభుత్వంపై, మాపై పోరాటం చేస్తున్నారు అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రపంచానికి కోవిడ్ సోకితే బాబుకు నీచ రాజకీయ వైరస్ సోకింద’ని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతూ.. కోవిడ్-19 నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటుంటే మాస్కులు, కిట్లు లేవని నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ డాక్టర్ వికటించడంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. లోకేష్, అయ్యన్నపాత్రుడు డైరెక్షన్లో డాక్టర్ సుధాకర్ కూడా N95 మాస్కులు లేవంటూ అసత్య ప్రచారానికి దిగాడని మండిపడ్డారు. (హలో.. జర సునో!) ఒక డాక్టర్ అయి ఉండి, ఇలాంటి దురాలోచన ఎందుకు వచ్చిందో తెలియట్లేదని ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ ఆపత్కాలంలో డాక్టర్ల సేవలను కొనియాడాల్సింది పోయి ఒక వైద్యుడిగా ఇలా నిందలు వేయడం సరి కాదని హితవు పలికారు. పీపీఈ కిట్లు, N95 మాస్కుల కొరత లేదని స్పష్టం చేశారు. N95 మాస్కులు 20 నుంచి 25 రోజులపాటు వాడవచ్చని ప్రోటోకాల్ చెప్తోందన్న విషయాన్ని ప్రస్తావించారు. కరోనా వ్యతిరేక పోరాటం కోసం రూ.3000 కోట్ల నిధులు విడుదల చేశామని, రూ.1000, బియ్యం, చక్కెర ఉచితంగా పేదలకు ఇస్తున్నామన్నారు. దేశంలోనే మెచ్చుకునే విధంగా గ్రామ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. (అయ్యన్నకు కుట్ర రాజకీయాలు అలవాటే : సన్యాసిపాత్రుడు) -
అప్పగింతలపై సయోధ్య!
నేడు గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల కమిటీల భేటీ సెక్రెటేరియట్ తెలంగాణకు.. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఏపీకి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల అప్పగింతలపై బుధవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. దీనిపై రాజ్‌భవన్ కార్యాలయం రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. విభజన చట్టం పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయా లు, నివాస భవనాల అంశంపైనే చర్చించను న్నట్లు ప్రస్తావించింది. రెండు రాష్ట్రాలు ఇప్ప టికే ఏర్పాటు చేసుకున్న కమిటీ ప్రతినిధుల తోపాటు సభ్య కార్యదర్శులను (మెంబర్ సెక్రెటరీ) సమావేశానికి పంపించాలని ఆహ్వా నించింది. భవనాల అప్పగింతకు ఏపీతో సం ప్రదింపులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. వీరితోపాటు సాధారణ పరిపాలన శాఖ (రాష్ట్ర పునర్విభజన) ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును మెంబర్ సెక్రెటరీగా నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కమిటీ ప్రతినిధులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులుతో పాటు అక్కడి మెంబర్ సెక్రెటరీ ప్రేమ్‌చంద్ రెడ్డి సమావేశానికి హాజరవుతారు. సయోధ్య కుదిరిందా! భవనాల అప్పగింతపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇప్పటికే పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. తమకు కేటాయిం చిన అసెంబ్లీ, కౌన్సిల్, సెక్రెటేరియట్ భవనాలను తిరిగి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయంగా తమకు రాజ్‌భవన్ రోడ్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌ను స్వాధీనం చేయాలనే ప్రతిపాదన లేవనెత్తింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సమ్మతించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ ఏపీ ఆధీనంలోనే ఉంది. హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం పేరుతో కొనసాగుతోంది. అందుకే ఈ భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దగా అభ్యంతరం చెప్పటం లేదు. -
లేక్‌వ్యూ వద్ద వీడియో రికార్డింగ్
బాబును కలిసేందుకు విశాఖ నుంచి వచ్చి ఇక్కట్లపాలైన అంధుడు హైదరాబాద్: సీఎం క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిథిగృహంలో వీడియో రికార్డింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాబుని కలిసేందుకొచ్చేవారిని చిత్రీకరించడం కోసం ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేశారు. ఇలా చిత్రించిన దృశ్యాల్ని టేపులుగా మార్చేందుకూ ఏర్పాట్లు చేశారు. ప్రతి శనివారం ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండే చంద్రబాబు ఈ శనివారం మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. చివరికి ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసులకు సైతం లేక్‌వ్యూ ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో సీఎంని కలిసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చిన సామాన్య ప్రజానీకం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఓ నిరుపేద అంధుడు సీఎంకు తన మొరవినిపించేందుకు ఉ. 9 గంటలకు రాగా సాయంత్రం 3 గంటలకు కలిసేలా చేస్తామని, అప్పటిదాకా బయట కూర్చోమని భద్రతా సిబ్బంది చెప్పారు. కానీ సాయంత్రం 5 గంటలవరకు నిరీక్షించినా ఫలితం దక్కలేదు. తనకు ఇంటిస్థలం లేదని, దానికోసం అంత దూరం నుంచి ఎంతో ఆశతో వచ్చానని, అయినా సీఎంను కలిసే అవకాశం దొరకలేదని అంధుడు వాపోయాడు. ఏపీ సచివాలయం, డీజీపీ కార్యాలయాలవద్దా ఇలాగేవీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. -
చంద్రబాబుపై బోయల ఆగ్రహం
హైదరాబాద్: లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద శనివారం సాయంత్రం పోలీసులకు, బోయలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసెందుకు లేక్ వ్యూ అతిథి గృహానికి బోయలు వచ్చారు. అయితే లోపలికి ప్రవేశం లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంత వేడుకున్నా వారిని అనుమతించక పోవడంతో బోయలు ఆగ్రహించి, లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, బోయలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల సమయంలో తమను ఎస్టీలలో కలుపుతామని బాబు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ విషయంపై కలవడానికి వచ్చిన తమకు ఏపీ సీఎం ముఖం చాటేస్తున్నారని బోయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుటుంబానికి ఒకటే పింఛన్
* మంత్రులు, డ్వాక్రా సంఘాలు, అధికారులతో వీడియో సమావేశంలో సీఎం మరో కొత్త మెలిక * అవకతవకలు జరిగితే సంబంధిత మంత్రులు, కమిటీలు, అధికారుల నుంచి రికవరీ * రోజూ రెండు గ్రామ సభల్లో పాల్గొంటా * జన్మభూమి సభల తర్వాత గ్రామానికో విజన్ డాక్యుమెంట్ * పాలనంతా ఐ ప్యాడ్ల ద్వారానే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కుటుంబానికి ఒకటే పింఛన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక కేసుల్లో ఏదైనా కుటుంబానికి మరో పింఛన్ ఇవ్వాల్సి వస్తే జిల్లాస్థాయి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మంజూరు చేయాలని చెప్పారు. శనివారం తన క్యాంపు కార్యాలయం లేక్ వ్యూ అతిథి గృహం నుంచి స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాలు, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలు, అధికారులతో 3 గంటల పాటు వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అర్హులకు పింఛన్లను అందించడం, పరిశీలనే మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేకుండా ఎంపిక ప్రక్రియ జరగాలని, ఈమేరకు మార్గదర్శకాలు ఇచ్చామని తెలిపారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత మంత్రులు, కమిటీలు, అధికారుల నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో నిర్దయగా వ్యవహరిస్తానని తెగేసి చెప్పారు. పింఛన్ సొమ్ము లబ్ధిదారునికి చేరిన సమాచారాన్ని వారి మొబైల్ ఫోన్లకు అందిస్తామని తెలిపారు. పింఛన్ల కోసం ఏడాదికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 2 నుంచి జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని అధికారులు ఎంత వినూత్నంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరొస్తుందని, మనసు పెట్టి ఈ సభలు జరపాలని సూచించారు. గ్రామ కార్యదర్శి, సర్పంచి నుంచి ప్రధాన కార్యదర్శి వరకు సమిష్టిగా పనిచేయాలన్నారు. జన్మభూమి సభల అనంతరం గ్రామానికో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామన్నారు. ప్రతి మున్సిపాలిటీ గ్రోత్ సెంటరుగా మారాలని ఆకాంక్షించారు. గ్రామసభల్లో ప్రజలు ప్రస్తావించే సమస్యల పరిష్కారంపైనా సమీక్ష ఉంటుందన్నారు. తాను ప్రతిరోజూ రెండు గ్రామ లేదా వార్డు సభల్లో పాల్గొంటానని చెప్పారు. గ్రామసభల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రతి గ్రామానికి వైద్యుల్ని పంపుతామన్నారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, రోగులను ఎన్టీఆర్ ఆరోగ్య సేవకు రిఫర్ చేస్తారని తెలిపారు. ఈ పథకంలో మరో వంద వ్యాధుల్ని కలిపామన్నారు. కంటి ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 1,340 పశు వైద్య శిబిరాలు నిర్వహించేందుకు 1,300 బృందాల్ని పంపుతున్నామన్నారు. 45 లక్షల మేకలు, గొర్రెలకు వ్యాక్సిన్లు ఇస్తారని, 5.5 లక్షల గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ పరీక్షలు చేస్తారని చెప్పారు. వంద రోజుల పాలనపై పుస్తకాలు ముద్రించామని, వీటి ద్వారా డ్వాక్రా సంఘాలుప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాలనంతా ఐప్యాడ్ల ద్వారానే.. ఇకపై ప్రభుత్వ పాలనంతా ఐప్యాడ్ల ద్వారానే నిర్వహిస్తామని సీఎం చెప్పారు. మంత్రులకు ఇప్పటికే ఐప్యాడ్లు ఇచ్చామని, త్వరలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకూ ఇస్తామని తెలిపారు. ఆతర్వాత జిల్లా, మండల స్థాయి అధికారులకూ ఇవ్వాలనే యోచన ఉందన్నారు. డ్వాక్రా సంఘాలకు, విద్యార్థులకు ఐప్యాడ్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ గ్రిడ్ ద్వారా డిజిటల్ ఇండియాకు ఊతమిస్తామన్నారు. ప్రతీ పంచాయతీకి బీటీ రోడ్డు లక్ష్యమన్నారు. గ్రామాల్లో ఎల్పీజీ సిలిండర్లు, పట్టణ ప్రాంతాలకు పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేసేం దుకు గ్రిడ్ రూపొందించామన్నారు. దీనికోసం కేజీ బేసిన్లో గ్యాస్ కోసం పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 20 శాతం మంది కూడా మరుగుదొడ్లు వాడటంలేదని సీఎం చెప్పారు. వీటి నిర్మాణాన్ని ఓ ఉద్యమంలా చేపడతామని, ఇందుకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకానికీ ఆధార్ లింకేజి తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. అసెంబ్లీలో మాట్లాడినట్లు మాట్లాడితే ఎలా? వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల నుంచి మంత్రులు కొందరు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన పలువురు మంత్రులకు సీఎం చురకలంటించారు. ‘‘అసెంబ్లీలో మాట్లాడినట్లు మాట్లాడితే ఎలా? కేబినెట్ సమావేశాలు మీకు సరిపోతాయి’’ అని వ్యాఖ్యానించారు. గుంటూరు నుంచి సమావేశంలో పాల్గొన్న మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘‘పనిచేసే వాళ్లకి మాట్లాడే అవకాశమిస్తే మీరెందుకు లైన్లోకి వస్తున్నారు’’ అంటూ సీఎం అడ్డుకున్నారు. తనకు చివరి అవకాశమని మంత్రి రావెల అనగా.. ‘‘క్లారిటీ ఇవ్వాల్సింది మీకు కాదు. కిందిస్థాయి అధికారులకు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పలుసార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ను ఆషామాషీగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని చోట్ల అధికారులు ఫోన్లో మాట్లాడటాన్ని తప్పు పట్టారు. స్కిల్ డెవలప్మెంట్పై అధికారులకు సీఎం క్లాసు తీసుకున్నారు. జన్మభూమిలో పింఛన్ల తనిఖీ ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం లో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను తనిఖీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జన్మభూమి-మా ఊరు పేరుతో వచ్చే నెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 వేల గ్రామ పంచాయితీల్లో, పట్టణాల్లోని వార్డుల్లో అధికార, ఉద్యోగ యంత్రాంగం పర్యటించనుంది. ఇందుకోసం మండలాల వారీగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. విధివిధానాలను ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. -
లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మంత్రుల సమావేశం
-
10 ఏళ్ల తర్వాత సచివాలయానికి బాబు
-
10 ఏళ్ల తర్వాత సచివాలయానికి బాబు
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేళ్ల తర్వాత సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈనెల 19న మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయానికి వెళ్లనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా బాబు సచివాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాగా సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లోని 8వ అంతస్తును బాబుకు కేటాయించినప్పటికీ అక్కడ మరమ్మత్తులు పూర్తికాకపోవడంతో తాత్కాలికంగా కొన్నిరోజులపాటు ఆయన లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కాగా 19న ఉదయం 8 గంటలకు లేక్‌వ్యూ అతిధి గృహానికి బాబు అడుగు పెట్టనున్నారు.