హైదరాబాద్: లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద శనివారం సాయంత్రం పోలీసులకు, బోయలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసెందుకు లేక్ వ్యూ అతిథి గృహానికి బోయలు వచ్చారు. అయితే లోపలికి ప్రవేశం లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంత వేడుకున్నా వారిని అనుమతించక పోవడంతో బోయలు ఆగ్రహించి, లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, బోయలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల సమయంలో తమను ఎస్టీలలో కలుపుతామని బాబు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ విషయంపై కలవడానికి వచ్చిన తమకు ఏపీ సీఎం ముఖం చాటేస్తున్నారని బోయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.