ఈతకెళ్లి నలుగురు యువకుల గల్లంతు
హైదరాబాద్‌సిటీ: రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్ పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో లక్ష్మిగూడ చెరువులో ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు.
గల్లంతైన వారు బహదూర్‌పురాకు చెందిన అమీర్, ఫారూఖ్, సల్మాన్, ఆసిఫ్‌లుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.