Lakshmana
-
Srirama Navami 2023: పరిపూర్ణ పురుషోత్తముడు..
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అంతటా వ్యాపించి ఉన్న భగవానుడు మనకోసం ఒక రూపంలో ఒదిగిపోయి దివి నుంచి భువికి దిగి వస్తే, దాన్ని అవతారం అంటారు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మానవ జీవితానికి అతి దగ్గరగా ఉండే అవతారం రామావతారం. చైత్ర శుద్ధ నవమి రోజు, లోకాలన్నిటి చేత నమస్కరింపబడే రాముడు ఈ భూమి మీద జన్మించాడు. పుట్టింది మొదలు ధర్మాన్నే అనుసరించాడు. పితృధర్మం, మాతృధర్మం, భ్రాతృధర్మం, స్నేహ ధర్మం, పత్నీ ధర్మం, ఋషుల ధర్మం... ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఆచరించినవాడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటూ శత్రువులు కూడా ఆయనను స్తుతించారు. నేడు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా... ఆ పరిపూర్ణ పురుషోత్తముడి గురించి తెలుసుకుందాం. అప్పటికి కౌసల్యాసుతునికి పదిహేను పదహారేళ్ల వయసుండొచ్చు. ఒకానొక రోజు దశరథమహారాజు రాముణ్ణి పిలిచి విశ్వామిత్ర మహర్షివైపు చూపిస్తూ ‘‘ఈ మహర్షితోపాటు నువ్వు అడవులకు వెళ్లాలి నాయనా...’’ అని అంటాడు. మరో పిల్లాడయితే ఏమనేవాడో ఏమో కానీ, రాముడు మాత్రం తండ్రి చెప్పాడు కాబట్టి కిమ్మనకుండా బయలుదేరాడు. అనుగు సోదరుడు లక్ష్మణుడు తోడు రాగా అడవుల్లోకి దారితీశాడు. తాటక సంహారం చేశాడు. అహల్యకు విమోచన ప్రసాదించాడు. రాముడు ఎంతటి క్రమశిక్షణ కలవాడంటే అంతఃపురంలో ఉన్నంత కాలమూ కన్నవారి మాట జవదాటలేదు. అరణ్యాల్లో ప్రవేశించాక విశ్వామిత్రుని ఆజ్ఞ మీరలేదు. సీతాస్వయంవరానికి తీసుకువెళతానని ఆ గురువర్యుడంటే∙మారు మాట్లాడకుండా అనుసరించాడు. పెద్దల మాటకే ప్రాధాన్యం జనకమహారాజు నెలకొల్పిన స్వయంవరమంటపంలో శ్రీరాముడు అడుగుమోపినా శివధనుస్సు ఉండే చోటికి హడావుడిగా వెళ్లిపోలేదు. దాన్ని భళ్లున ఎత్తేసి, ఫెళ్లున విరిచేసి, చేతులు దులిపేసుకోలేదు. ఎలాంటి తొందరపాటూ పడకుండా సభాభవనంలో నిమ్మళంగా కూర్చున్నాడు. శివధనువును ఎత్తాలంటూ విశ్వామిత్రుడు అనుజ్ఞ ఇచ్చాకనే రాముడు ఆ పనికి పూనుకున్నాడు. ధనస్సును సున్నితంగా ఎత్తిపట్టుకుని, నారి సారించి, విరిచాడు. ఇదంతా ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా చేశాడు. అంత పెద్దపనీ పూర్తిచేశాక ధీర గంభీరంగా అడుగులు వేస్తూ తన ఉచితాసనానికి చేరుకున్నాడు. చిన్నపాటి విజయాన్ని సాధిస్తేనే మురిసి మెరిసిపోయే మనం, ఆ సందర్భాన రాముడి వర్తన నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో. చిన్న కష్టానికే కన్నీరొలికించడం. అల్పమైన సుఖాలకే అతిగా స్పందించడం.. లాంటి లక్షణాలను మరెంత సునాయాసంగా తొలగించుకోవచ్చో! వినయ విధేయతలు తొందరపాటు...తొట్రుపాటు అనేవి రాముడి నిఘంటువులోనే లేదు. శివధనువును విరవగానే సీతను రాముడికిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చెప్పిన మాట విని ఎగిరి గంతేయలేదు. వెంటనే సీత మెడలో మూడు ముళ్లూ వేసేయలేదు. జనకుని ప్రతిపాదనను తన కన్నవారికి తెలియజేయాలని, అందుకు వారి అనుమతి అవసరమనీ వినమ్రంగా చెప్పాడు. ఎవరి పట్ల ఏవేళ ఎలా ఆదరం చూపాలో రామునికి బాగా తెలుసుననడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. అలా ఆ పెద్దలందరి సమక్షంలోనూ మైథిలి చేయి అందుకున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగి ఎంతోసేపు అవనే అవదు. పరశురాముడు వేంచేశాడు. పెళ్లివేదిక వద్దకు వస్తూనే ఆ మహాశయుడు వీరావేశాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలో రాముడంటే పరశురాముడేనని, మరో రాముడికి లోకాన చోటు లేనేలేదని వీరవిహారం చేశాడు. అటు జనకుడు, ఇటు దశరథుడు పరశురాముని క్రౌర్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే రాముడు ఏమాత్రం తొందరపడలేదు. పరశురాముడు ఎంతగా పేట్రేగిపోతుంటే రాముడు అంత ప్రశాంతంగా ఉన్నాడు. పరశురాముడు అందించిన విష్ణుధనువును సునాయాసంగా పైకెత్తాడు. తను శ్రీహరి ప్రతిరూపమని చెప్పకనే చెప్పాడు. దీంతో పరశురాముడికి కమ్మిన పొరలు తొలగిపోయాయి. తారుమారైనా... మర్నాడు పొద్దున్నే పట్టాభిషేకం జరగాల్సి ఉంది. రాత్రికి రాత్రే కథ మారిపోయింది. కైకమ్మ స్వయంగా పిలిచి, తన మాటల్ని దశరథుని ఆదేశాలుగా వినిపించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పద్నాలుగేళ్లపాటు అరణ్యవాసం చేయాలని ఆజ్ఞాపించింది. మారు తల్లి మాటలను మన్నించాడు. అడవుల్లోకి పోయేందుకు సిద్ధమేనంటూ అందుకు రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. మంగళస్నానాలు చేసి రాజదండాన్ని చేపట్టాల్సిన వేళ పత్నినీ, సోదరునీ వెంటబెట్టుకుని గుహుని పడవమీద నది దాటుకుంటూ పోయాడు. అడవుల్లోనూ ఆ రామునికి ప్రశాంతత లేనే లేదు. కష్టాలూ కన్నీళ్లే! సీతమ్మను రావణుడు అపహరించుకుపోయాక మానసికంగా నలిగిపోయాడు. చివరికి లంకలో అమ్మవారు ఉన్నారన్న సంగతి తెలిసి కొంత స్థిమితపడ్డాడు. తన ప్రియపత్నిని తన వద్దకు తెచ్చుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విభీషణునితో చెలిమిచేశాడు. ఓరిమితో వ్యవహరించాడు. తగిన సమయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. సముద్రం మీద సేతువును నిర్మించాడు. అందుబాటులో ఉన్న వానర సేన సహకారంతోనే అమిత బలవంతుడైన శత్రువుతో యుద్ధం చేశాడు. విజేత తానే అయ్యాడు. స్థితప్రజ్ఞావంతుడు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది. వనవాస క్లేశాలు ముదిరిపోయాయి. సరసరాజాన్నభోజనాల స్థానంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది. ఒకవైపు భార్యావియోగం. మరోవైపు రాక్షసబాధ. వయసేమంత పెద్దది కాదు. అయినా చలించలేదు. స్థిరంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞతతో వ్యవహరించాడు. మరి ఇప్పటికాలాన మనం ఎలా ఉన్నాం..? బస్సు దొరక్కపోతే ఆందోళన. సినిమా టికెట్టు అందకపోతే అశాంతి. పరీక్షలో మార్కులు తక్కువయితే ఆవేదన. అన్నింటికీ తొందరే. ప్రేమ తొందర. పెళ్లి తొందర. ఇలా అయితే ఎలా. రాముని వంటి వారినే కష్టాలు కాల్చుకు తిన్నాయి. అన్నింటినీ ఆయన ఓపిగ్గా ఎదుర్కొన్నాడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతటి వారం? ఆయన పడ్డ కష్టాలతో పోల్చి చూసుకుంటే మన కష్టాలు ఏపాటివి?ఎప్పటి త్రేతాయుగం? రాముడు పుట్టి రెండు యుగాలయింది. మనమిప్పుడు కలికాలంలో ఉన్నాం. అయినా ఆ ఆదర్శనీయుణ్ణి నేటికీ మరువలేకపోతున్నాం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే మానవుడిగా పుట్టినా, రాముడు మనకు దేవుడయ్యాడు. ఆయన నడిచిన బాట అయిన రామాయణం పఠనీయ కావ్యం అయింది. అందుకే రామాయణాన్ని పారాయణం చేయాలి. అందులోని మంచిని ఒంటబట్టించుకోవాలి. కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది చేసిన సహాయాన్ని ఎన్నటికీ మరువని సద్గుణ సంపన్నత రామునిది. అందుకే సీతమ్మ జాడతెలుసుకున్న ఆంజనేయస్వామిని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. తన ప్రేమను పంచాడు. సుగ్రీవుడికి పట్టం కట్టాడు. విభీషణునికి లంకేశునిగా మకుటం తొడిగాడు. ..జననీ జన్మభూమిశ్చ.. రావణ సంహారం జరిగాక ఆ రాక్షస రాజు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించాడు. విషయాన్ని అన్నతో చెప్పాడు. యావత్ లంకానగరమే మణిమయ నిర్మితమైనది. అందులోని రాజ సౌధం సామాన్యమైంది కాదు. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ఆయన ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే చెందుతుందని స్పష్టం చేస్తాడు. అంటే పరాయి ప్రదేశం ఎంతటి గొప్పదైనా, సుందరమైనదైనా దానిని చూసి మనసు పారేసుకోలేదు. మాతృభూమిని మరువలేదు. పుట్టిన గడ్డపై ప్రేమను పోగొట్టుకోలేదు. రామ నైవేద్యం పానకం కావలసినవి: బెల్లం పొడి– పావు కేజీ; నీళ్లు– లీటరు; యాలకుల పొడి– టీ స్పూన్; మిరియాల పొడి– టీ స్పూన్; శొంఠిపొడి– చిటికెడు తయారీ: బెల్లం పొడిలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఈ బెల్లం నీటిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠిపొడి కలిపితే పానకం రెడీ. వడపప్పు కావలసినవి: పెసరపప్పు – పావు కేజీ; పచ్చిమిర్చి ముక్కలు – టీ స్పూన్; పచ్చి కొబ్బరి తురుము– టేబుల్ స్పూన్; మామిడి కాయ తురుము– టేబుల్ స్పూన్ తయారీ: పెసరపప్పు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి. గింజ మెత్తబడిన తర్వాత నీటిని వంపేసి అందులో పైన తీసుకున్న దినుసులన్నీ కలిపితే వడపప్పు రెడీ. వడపప్పు, పానకం ఆరోగ్యకరమైనవి. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. వేసవి మొదలైన ఈ సమయంలో ఆరోగ్యం ఒడిదొడుకులను పానకం నివారిస్తుంది. యాలకుల పొడి అతిదాహాన్ని తగ్గిస్తుంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఆదిపురుష్: లక్ష్మణుడు దొరికేశాడు!
ఏకకాలంలో మూడు, నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు డార్లింగ్ హీరో ప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్ పూర్తి చేయగా ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రీకరణలో భాగమయ్యాడు. తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్‌లో ప్రభాస్ తొలిసారిగా రాముడిగా దర్శనమివ్వనున్నాడు. ఇతడితో ఢీ కొట్టేందుకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా రెడీ అవుతున్నాడు. ఇక సీత ఎవరన్నదానిపై పలువురి పేర్లు వినిపించగా చివరికి కృతి సనన్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే తాజాగా లక్ష్మణుడి పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోను పట్టుకొస్తున్నట్లు సమాచారం. విక్కీ కౌశల్ ప్రభాస్ పాత్రకు తమ్ముడిగా నటిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు అతడి పేరునే ఖాయం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా "ఉరి: ద సర్జికల్ స్ట్రైక్" సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన విక్కీ కౌశల్ ప్రస్తుతం "అశ్వత్థామ" చేస్తున్నాడు. మహాభారతంలో మరణమనేదే లేని వరాన్ని పొందిన అశ్వత్థామ కథను ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఆదిపురుష్‌లో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి హేమ మాలిని నటించనుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటిపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. చదవండి: ఇలాంటి అభిమాని ఉంటే ఇంకేం కావాలి: హీరో -
లండన్ నుంచి తిరిగొస్తున్న రాములోరు
లండన్ : 15వ శతాబ్ధం నాటి సీతారాముల వారి విగ్రహాలను లండన్ నుంచి తిరిగి తెప్పించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1978లో తమిళనాడులోని విజయనగర కాలంలో నిర్మించిన ఆలయం నాటి విగ్రహాలు అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఇవి ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2019 ఆగస్టులో లండన్‌లోని భారత హైకమిషన్ ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అంతేకాకుండా దొంగతనానికి గురైన రామలక్షణులు, సీత, హనుమంతుని విగ్రహాలకు సంబంధించిన ఫోటో ఆర్కైవ్లను నిపుణుల మందుంచారు. ఇవి ప్రస్తుతం లండన్‌లో ఉన్నవేనని దృవీకరిస్తూ సమగ్ర నివేదికను పంపారు. (ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాం: రాజ్‌నాథ్) భారత సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా ఉన్న ఈ విగ్రహాలను భారత్‌కు తిరిగి పంపాల్సిందిగా కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన యూకే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ విగ్రహాలను కొన్నవ్యక్తి ప్రస్తుతం జీవించిలేరు. అంతేకాకుండా వీటికి చట్టబద్దమైన ఆధారాలు ఏమీ లేనందున ఈ విగ్రహాలను తిరిగి భారత్‌కు అందించడానికి హైకమిషన్ సముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే వీటిని తమిళనాడుకు బదిలీచేయనున్నారు. గతంలోనూ రాణి-కి వావ్, బుద్ధుడి కాంస్య విగ్రహం, 17వ శతాబ్ధపు కృష్ణుడి విగ్రహం సహా పలు భారత సంపదను తిరిగి స్వదేశానికి చేర్చడంలో హెచ్‌సిఐ ముఖ్యపాత్ర పోషించింది. రాబోయే రోజుల్లో, ఎఎస్ఐ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, స్వతంత్ర దర్యప్తు సంస్థల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని హెచ్‌సిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. (చైనాపై దూకుడు కూడా సానుకూలాంశమే) -
ప్రజాకోర్టులో పౌరసత్వ చట్టం
నూతన పౌరసత్వ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పౌరులు సవాలు చేస్తుండటంతో తూర్పు, ఈశాన్య భారతం తగలబడుతోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసనలు చెలరేగుతుండటంతో దేశం అట్టుడికిపోతోంది. అసోంలో ఎన్నార్సీ, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ మందిరంపై తీర్పు తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకురావడం ఏమంత ఆశ్చర్యం కలిగించదు. ఒక ప్రత్యేక మతానికి చెందిన విదేశీయులకు భారతీయ పౌరసత్వాన్ని ఈ సవరణ బిల్లు సమర్థవంతంగా నిరోధిస్తున్నందున భారత్‌ని హిందూ దేశంగా మల్చాలనే బీజేపీ, ఆరెస్సెస్ ఎజండాను మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకుపోతున్నట్లుగానే కనిపిస్తోంది. పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చర్చ సాగుతుండగానే అసోం, ఈశాన్య భారత్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ చట్టం తమ ప్రాంత జనాభా కూర్పులో గణనీయ మార్పును తీసుకురావడమే కాక తమ సంస్కృతిపై కూడా దాడికి దిగుతుందని ప్రజలు భయాందోళనలకు గురికావడమే ఈ నిరసనలకు కారణం. పైగా ప్రజా నిరసనలు పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ వంటి మరెన్నో ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా నిరసనలను పోలీసులు, భద్రతా బలగాలు తీవ్రంగా అణచివేయడంతో ప్రపంచం మెల్లమెల్లగా ఈ నిరసనలను పరిగణనలోకి తీసుకోవడం మొదలైంది. బంగ్లాదేశ్ మంత్రి భారత పర్యటన రద్దు కావడం, జపాన్ ప్రధాని గౌహతి సందర్శన వాయిదా పడటంతో భారత్‌కు దౌత్యపరంగా తొలి దెబ్బలు తగిలాయి. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి విభాగం యుఎన్హెచ్సిఆర్ భారత ప్రభుత్వం తలపెట్టిన పౌరసత్వ చట్టం ‘ప్రాథమికంగానే వివక్షాపూరితం’గా ఉందని తన అసమ్మతిని వ్యక్తం చేయడమే కాకుండా, భారత్ కట్టుబడిన అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు జాగ్రత్తగా వ్యవహరిస్తుందని ఐరాస విభాగం ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా పాలనాయంత్రాంగం కూడా భారత్‌లో పరిణామాలను నిశి తంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. ఇక దేశీయంగా చూస్తే మోదీ ప్రభుత్వ హిందుత్వ అనుకూల చర్యకు ప్రతిపక్షాలు పాలి స్తున్న కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, చత్తీస్గర్ వంటి రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని తాము అమలుపర్చబోమని ఈ రాష్ట్రాల పాలకులు స్పష్టం చేశారు. దాంతో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయనుంది. అయితే అటు బీజేపీ, ఇటు కేంద్రప్రభుత్వం ఈ వ్యవహారంలో రాష్ట్రాలకు పెద్దగా పాత్ర ఏమీలేదని, కొత్త పౌరసత్వ నిబంధనల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా పాత్ర లేదని చెబుతూ వస్తున్నాయి. పైగా పౌరసత్వ చట్టం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఏమేరకు అడ్డుకుంటాయన్నది చూడాల్సిందే మరి. రాజకీయ పరంగా చూస్తే, పౌరసత్వ చట్టం రూపంలో మతపరంగా ప్రజలను విభజించడం ద్వారా దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలను పాకిస్తాన్ అనుకూల, మైనారిటీల అనుకూల సంస్థలుగా ముద్రించడం ద్వారా బీజేపీ మరింతగా మందుగుండు దట్టించింది. కాగా, ఈ ఘర్షణలకు సంబంధించిన తొలి పరీక్ష పశ్చిమబెంగాల్లోనే జరగనుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం లోకి మరింతగా చొచ్చుకుపోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే సంవత్సరం ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పౌరసత్వ చట్టం అంశాన్ని ఇప్పటికే ప్రచారంలోకి తీసుకొచ్చేసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పౌరసత్వ చట్టంపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పథక రచన చేస్తుండగా, బీజేపీ మాత్రం ఇప్పటికే పశ్చిమబెంగాల్లో విజయోత్సవ ర్యాలీలను మొదలుపెట్టేసింది. పైగా, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి తమతో కలిసి నడవాలంటూ రాష్ట్రంలోని శరణార్థులకు పిలుపునిచ్చేసింది కూడా. కాగా, ఢిల్లీలో జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల అమానుష దాడులు దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలకు దారితీయడం గమనార్హం. లక్ష్మణ వెంకట్ కూచి వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు -
ఇంకా నా యందు సందేహమేనా...
మలుపు తిప్పిన సన్నివేశం లవకుశ లవకుశలో ప్రతి సన్నివేశం కీలకమైనదే. కాని సీత మీద అనుమానంతో రాముడు ఆమెను అడవులకు పంపే సన్నివేశం మాత్రం విలక్షణమైనది. కథకు వెన్నెముక వంటిది. ఏం జరగబోతోందో రాముడికీ లక్ష్మణునికీ తెలుసు. కాని ఏమి అనుభవించబోతోందో సీతకు తెలియదు. మాతృసమానురాలైన సీతను అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టడం లక్ష్మణునికి ఇష్టం లేదు. అలాగని అన్న ఆజ్ఞను ధిక్కరించలేడు. గుండె రాయి చేసుకొని సీత ఉన్న రథాన్ని కారడవులలోకి మళ్లించాడు. అప్పుడు సీతకు, లక్ష్మణునికి మధ్య సాగిన సన్నివేశం తరతరాలకు నిలిచిపోతుంది. సీతాదేవి: నాయనా... లక్ష్మణా! ఇదేమిటి దారి తప్పలేదు కదా? లక్ష్మణుడు: నట్టడవి పోయేవారికి దారి తెన్నూ ఏమిటి తల్లి! సీతాదేవి: అదేమిటి లక్ష్మణా! నీ మొహం కళా విహీన మై చిన్నబోయింది? ఈ పుణ్యాశ్రమ దర్శనం నీకు ఆనందదాయకం కాదా? లేక మీ అన్నగారి ఇష్టంలేని అరణ్యసందర్శన కోరినందుకు కోపమా? లక్ష్మణుడు: ఎంత మాట తల్లీ! పరమ పావని... మాతృసమానురాలివైన నీ మీద నాకు కోపమా తల్లి...! కుసుమ కోమలివైన నీ కష్టాలు తలుచుకుంటే నా మనసులో పొంగే పరితాపం సీత: నాకే కష్టం లేదు లక్ష్మణా! ఈ అరణ్యవాసం నాకు అలవాటైందే కదా! ఈ ప్రకృతి సౌందర్యం ఈ మనోహరారణ్యం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొకప్పుడు నా జీవితకాలమంతా ఇక్కడే గడిపేయాలన్న బుద్ధి పుడుతూ ఉంటుంది. లక్ష్మణుడు (ఏడుస్తూ): అమ్మా! సీతాదేవి: (లక్ష్మణుడిని చూస్తూ) ఆ... అదేంటి లక్ష్మణా! అకారణంగా దుఃఖిస్తున్నావు! లక్ష్మణుడు: నా పాపిష్టి జన్మకు దుఃఖం కాక సంతోషం ఎలా వస్తుందమ్మా? సీతాదేవి: నా మనసు భయాందోళితమవుతోంది! ఎవరికి ఏ ఆపద వచ్చిందో చెప్పు నాయనా! లక్ష్మణుడు: ఆపద కాదు తల్లీ... అపవాదు.. సీతాదేవి: అపవాదమా! నా పైనా? లక్ష్మణా నీవు పొరపాటుగా వినలేదు కదా! లక్ష్మణుడు: లేదు తల్లీ.. సత్యమే చెబుతున్నా! రామాజ్ఞ దాటలేని దుర్బలుడిని అగుట చేత నీ వంటి మహాసాధ్విని అడవుల పాలు జేసిన మహాపాపానికి ఒడిగట్టుకున్నాను తల్లీ! సీతాదేవి: రామాజ్ఞ! రామాజ్ఞా (ఏడుస్తూ) ... తండ్రి రామచంద్రా! ఎంతటి నిర్దయుడివి అయ్యావు, మనసు ఎలా రాయిచేసుకున్నావు, ఇంకా నాయందు సందేహమేనా! లక్ష్మణుడు: తల్లీ! రామచంద్రునకు నీ యందు సంశయము గానీ సందేహము గానీ లేదు. తాను రాజుగా ఉండి రఘువంశ కీర్తికి కళంకం రానీయకూడదని ఇలా చేయవలసి వచ్చిందమ్మా. సీతాదేవి: లక్ష్మణా! అర్ధాంగిని, గర్భవతిని నన్ను అడవి పాలు చేస్తే రఘువంశ కీర్తి ఇనుమడిస్తుందా? అదీ గాక శ్రీరామచంద్రుడు రాజైతే నేను రాణిని కానా? నాకా బాధ్యత లేదా? నేను మాత్రం ఆయనకి అపకీర్తి రానిస్తానా లక్ష్మణా?(ఏడుస్తూ) లక్ష్మణుడు: అమ్మా! సాక్షాత్ ధర్మస్వరూపిణివి అయిన నీకు ఏం చెప్పగలను తల్లీ! సీతాదేవి: ధర్మస్వరూపులు మీ అన్నగారు, మీ తాతముత్తాతలు గానీ నా వంటి నిర్భాగ్యురాలికి ధర్మం ఎక్కడ ఉంది నాయనా? నేనెంత పాపినైనా నన్ను చేర పిలిచి, జరిగిన సంగతి చెప్పి, నన్ను ఆజ్ఞాపిస్తే అడవులకే కాదు, అగ్నిలో దూకమన్నా నేను వెనుదీస్తానా! ఇందుకేనా నన్ను అగ్నిపరీక్ష చేశారు? ఇందుకేనా అయోధ్యకు తీసుకువచ్చారు? అయ్యో ఇంకెందుకీ పాడు జన్మ! ఆ గంగలో పడి హతమారితే తీరిపోతుంది. లక్ష్మణుడు: అమ్మా నా మీద ఆన! సీతాదేవి: లక్ష్మణా! లక్ష్మణుడు: అంత సాహసం చేయకు తల్లీ, సాహసం చేయకు. సీతాదేవి: నా రామచంద్రుడిని చూసే భాగ్యం లేక పోయిన తరువాత నాకెందుకు లక్ష్మణా ఈ బ్రతుకు? లక్ష్మణుడు: నీ గర్భస్థమైన రవి వంశ వర్ధనుని కోసం తల్లి! సీతాదేవి: నేను వెలి అయితే నా శిశువు అర్హుడవుతాడా! అదీ గాక లోకులకు నా మొహం ఎలా చూపించను! నిన్నెందుకు శ్రీరాముడు త్యజించాడంటే ఏమని చెప్పుకోను! ఇంకెలా జీవించను? లక్ష్మణుడు: అమ్మా రామచంద్రుడు తన హృదయం తనే త్రుంచి వేసినట్టు అర్ధాంగివి గనుక నిన్ను దూరం చేసుకుని ఘోర బాధ అనుభవిస్తున్నాడు. తాను మాత్రం నిన్ను విడిచి ఓర్వగలడా తల్లి. సీతాదేవి: అవును లక్ష్మణా.. అవును వడలు తెలియని దుఃఖంలో ఉండబట్టలేక శ్రీరామచంద్రుడిని అనరాని మాటలన్నా. రామపాదారవింద సేవకు దూరమవడటం నా పురాకృత ప్రారబ్ధం. నేను కష్టాలకే పుట్టాను. నాకు సుఖపడే రాత ఎలా వస్తుంది? లక్ష్మణుడు: అమ్మా నీవంటి లోకోత్తర చరితను నట్టడవిలో ఎట్లా దిగవిడిచి పోగలను! కఠోరమైన రామాజ్ఞను ఎట్లా దాటగలను. నన్ను మన్నించు తల్లీ! మన్నించు. లక్ష్మణుడు: ప్రతి దినమేను కొలుగొంత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన జీవనలందిచరింతు తదీయ భావ్యమే గతి యెడబాయె ఇంకెప్పుడు గాంతు పదపద్మముల్ నమశ్శతములు చేయునమ్మా కడసారి గ్రహింపుము జానకి సతి... జానకీసతి తల్లీ సెలవు (అంటూ ఆమెను విడిచి వెళ్లిపోతాడు) - శశాంక్