Lakshmi srija
-
గంటలో రాజ్యాంగ పఠనం
సాక్షి, హైదరాబాద్: అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని ఒక గంట సమయంలో మౌఖికంగా చెప్పి రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించిన లక్ష్మీశ్రీజ(10) తెలంగాణ అద్భుత బాలిక అని వక్తలు కొనియాడారు. బుధవారం శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని లక్ష్మీశ్రీజ, ఆమె తల్లిదండ్రులు, న్యూ ఎరా స్కూల్ యజమాని రమణారావు కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ చాంబర్లో లక్ష్మీశ్రీజ భారత రాజ్యాంగాన్ని సునాయాసంగా పఠనం చేయడాన్ని చూసి అక్కడికి వచ్చిన అతిథులు శ్రీజ జ్ఞాపకశక్తిని ప్రశంసించారు. శ్రీజ లాగా రాజ్యాంగాన్ని అలవోకగా చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదని స్పీకర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ నారదాసు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ మెంబర్ జూలూరి గౌరీ శంకర్ ఆమెను అభినందించారు. -
ప్లీనరీలో వండర్కిడ్ లక్ష్మీ శ్రీజ పలుకులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరానికి చెందిన వండర్కిడ్ లక్ష్మి శ్రీజను, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీకి పరిచయం చేశారు. లక్ష్మీ అద్భుతమైన ప్రతిభ గల బాలిక అని, ఆమె ఐఏఎస్ కావాలని కోరుకుంటోందని, ఆ బాలిక ఆశయం నెరవేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ప్లీనరీ వేదికపైకి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా లక్ష్మీని ఆహ్వానించి మాట్లాడించారు. కేసీఆర్ టీడీపీలో ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఏయే పదవుల్లో ఉన్నారు, తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు..? ఉద్యమంలో ఆయన పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ప్రభుత్వ ఏర్పాటు తదితర అంశాలపై లక్ష్మీ శ్రీజఐదు నిమిషాల పాటు ప్రసంగించింది. శ్రీజ అద్భుతమైన తెలివితేటలకు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా చప్పట్ల వర్షం కురిపించారు.