అలరించిన లక్ష్మీశృతి అరంగేట్రం
రాజమహేంద్రవరం కల్చరల్ :
ఎనిమిది వసంతాల శ్రీసాయి ముత్య లక్షీ్మశృతి కూచిపూడి అరంగేట్రం ఘనంగా జరిగింది. ధవళేశ్వరానికి చెందిన శ్రీరాధాకృష్ణ సంగీత, నృత్య కళాక్షేత్ర ఆధ్వర్యంలో ఆదివారం రివర్బే ఆహ్వానం ఫంక్ష¯ŒS హాల్లో అతిరథ మహారథుల సమక్షంలో ఆ చిన్నారి ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకులను అలరించాయి. ముందుగా లక్షీ్మశృతి తనగురువు, అంతర్జాతీయ ఉత్తమ నృత్య దర్శక అవార్డు గ్రహీత గోరుగంతు ఉమాజయశ్రీకి గురుపూజ చేసింది. వినాయక కౌతం, వలచివచ్చి అనే నవరాగమాలికావర్ణం, రామాయణ శబ్దం, తరంగం, అష్టలక్షీ్మస్తోత్రం, ఇతర కూచిపూడి అంశాలను ప్రదర్శించి ప్రముఖుల మెప్పును అందుకుంది. కళాక్షేత్ర వ్యవస్థాపకుడు జి.నారాయణ మాట్లాడుతూ చిన్నారులకు నాట్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా, సనాతన ధర్మాన్ని చాటిచెప్పడం తమ లక్ష్యమని వివరించారు. ‘యక్షగాన కంఠీరవ’ పసుమర్తి శేషుబాబు, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు పసుమర్తి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పెద్ద సంఖ్యలో కళాభిమానులు హాజరయ్యారు.