Lakshmikant Rao
-
ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్‌మోహన్‌రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్మోహన్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలనూ కేస్ స్టడీస్‌గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇవి చదవండి: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’! -
పెద్దల సభకు కెప్టెన్, డీఎస్
రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్‌ల పేర్లు ప్రకటన ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్ రాజ్యసభ ఎన్నికల పర్యవేక్షకులుగా ఈటల, నాయిని సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పార్టీ నాయకత్వం ఇద్దరు అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో బుధ, గురువారాల్లో సంప్రదింపులు జరిపాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభ్యర్థులను నిర్ణయించారు. రాజ్యసభ సభ్యులుగా కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పోటీ చేస్తారని ప్రకటించారు. అలాగే మిగతా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఎండి ఫరీదుద్దీన్‌ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికలకు పర్యవేక్షకులుగా మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని టీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించింది. ఉత్కంఠకు తెర రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచే టీఆర్ఎస్ ఆశావహుల్లో సందడి మొదలైంది. పార్టీ చేతిలో ఏకంగా 88 మంది ఎమ్మెల్యేలు ఉండటం, విపక్షాలు పోటీ చేసే అవకాశం దాదాపు లేకపోవడం వల్ల అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్లోని పలువురు సీనియర్లు అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌లతోపాటు పార్టీ కోశాధికారిగా పనిచేసిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త సీఎల్ రాజం వంటి వారు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 31 చివరి తేదీ కావడంతో అధినేత ఎవరి పేర్లను ప్రకటిస్తారోననే సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకొని కున్నాక సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు పలువురు సీనియర్ల అభిప్రాయం తీసుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. అలాగే ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపైనా మరో చర్చకు అవకాశం లేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరును ప్రకటించి ఈ వ్యవహారానికి తెరదించారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు: కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ టికెట్ రావడం సంతృప్తి కలిగిస్తోంది. నాకు అవకాశం ఇచ్చినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా. బంగారు తెలంగాణ సాధన కోసం పనిచేస్తా. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: డీఎస్ రాజ్యసభ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక డీఎస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని, ఢిల్లీకి వెళ్లి సేవ చేసే అవకాశాన్ని కేసీఆర్ తనకు ఇచ్చారన్నారు. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతానన్నారు. పార్టీ మారినప్పుడు చాలా మంది తనకు భవిష్యత్తు సరిగా ఉండదన్నారని గుర్తుచేసిన డీఎస్...పార్టీలో పనిచేసే నేతలకు పదవులు వస్తాయన్నారు.