ఖమ్మం జేడీఏగా ఝాన్సీలక్ష్మీకుమారి
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం సంయుక్త వ్యవసాయ సంచాలకురాలి(జేడీఏ)గా అత్తోటి ఝాన్సీలక్ష్మీకుమారి రానున్నారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ ఉప సంచాలకురాలిగా పనిచేస్తున్నారు. 1991లో వ్యవసాయాధికారిగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మొదటి పోస్టింగ్ అందుకున్నారు. 2004లో వ్యవసాయ సహాయ సంచాలకురాలిగా ఉద్యోగోన్నతిపై హైదరాబాద్ రాజేంద్రనగర్లోని పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబ్లో నియమితులయ్యారు. వ్యవసాయ ఉప సంచాలకురాలిగా 2010లో ఉద్యోగోన్నతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో చేరారు. మరోసారి ఉద్యోగోన్నతిపై జేడీఏగా ఖమ్మం రానున్నారు.
ఏడు నెలల్లో నాలుగో జేడీఏ
ఏడు నెలల కాలంలో ఖమ్మం జిల్లాలో నలుగురు జేడీఏలు పనిచేశారు. పిబి.భాస్కర్రావు ఉద్యోగ విరమణ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న వెల్లంకి ఆశాకుమారిని ఖమ్మం జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. భాస్కర్రావు పనిచేసని కాలంలో జిల్లా వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిధుల దుర్వినియోగంపై విచారణ నేపథ్యంలో ఆశాకుమారిని ఆత్మ డీపీడీగా వెనక్కు పంపించింది.
ఆమె స్థానంలో, రైతు శిక్షణ కేంద్రంలో సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా పనిచేస్తున్న పి.మణిమాలను ఇ¯Œæచార్జ్ జేడీఏ నియమించింది. సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా ఉన్న ఎం.విజయనిర్మల.. ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. తాజాగా, ఉద్యోగోన్నతిపై ఇక్కడికి జేడీఏగా ఝాన్సీలక్షీ్మకుమారి రానున్నారు.