lal darwaja simhavahini mohakhali temple
-
ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు
-
Bonalu: అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజ సింహవాహిని బోనాలు
హైదరాబాద్‌లో అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడమాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. కాగా, నేడు(ఆదివారం) బోనాల్లో భాగంగా అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. ఇక, తెలుగు కెరటం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బోనమెత్తి అమ్మవారికి బోనం సమర్పించుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధును ఆలయ కమిటీ సత్కరించింది. మరోవైపు.. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూ లైనులో వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మవారి బోనాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. ఇది కూడా చదవండి: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై -
అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్న భక్తులు
-
లాల్‌దర్వాజ బోనాలు: పాతబస్తీలో సందడి
-
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల సందడి ప్రారంభమైంది. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాడం బోనాల ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనార్థం రెండు లైన్ల ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనలు ఘనంగా జరుగుతున్నాయని, నేడు లాల్ దర్వాజ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం రంగం కార్యక్రమంతో పాటు, ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల పండగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందని పేర్కొన్నారు. ప్రభుత్వమే బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించామని, కరోనను పారద్రోలి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈసారి కురిసిన మంచి వర్షాలకు కృష్ణ, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనము చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బీజేపీ నేత విజయశాంతి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బంగారు బోనం ఎత్తుకుంటానన్న మొక్కును బోనం సమర్పించి తీర్చుకున్నట్లు తెలిపారు. కరోన తగ్గాలని, అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మంచి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే బంగారు బోనం సమర్పిస్తా అని మొక్కుకున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శించుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని విజయశాంతి మొక్కుకున్నారని చెప్పారు. అమ్మవారు చాలా శక్తి వంతమైనవారని ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తోందని పేర్కొన్నారు.కరోనా మహమ్మరిని నుంచి దేశ ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లాల్ దర్వాజ బోనాలకు విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తను హైదరాబాద్‌లోనే డాక్టర్‌గా పని చేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి మనమంతా బయటపడాలని అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించినట్లు పేర్కొన్నారు. -
పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. తెలంగాణలో నిర్వహించే ఈ బోనాల్లో.. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 13 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటరికి తోడుగా 43 ప్లటూన్ల సాయుధ బలగాలు కూడా భద్రత విధుల్లో పాటు పంచుకోనుంది. -
ఘనంగా బోనాలు.. క్యూ కట్టిన ప్రముఖులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బోనాల సందడి వెల్లివిరుస్తోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తజనం బారులు తీరారు. అమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. రేపు ఊరేగింపు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. క్యూ కట్టిన ప్రముఖులు.. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించి.. మొక్కులు చెల్లించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని నాయిని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని అమ్మను వేడుకున్నట్టు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిర్వహించే బోనాల పండుగల్లో. లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్‌దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని చెబుతారు. అప్పటినుంచి లాల్‌దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. బోనం ఎత్తుకుని..అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. -
అమ్మవారికి ప్రీతిపాత్రుడు పోతరాజే..
జాతరలో చెర్నాకోలుతో విన్యాసాలు గుమ్మడికాయతో బలిదానం లాల్‌దర్వాజా ఆలయంలో ‘పోసాని’ కుటుంబం రికార్డు అమ్మవారి సేవలో తరిస్తున్న మూడు తరాలు వందేళ్లుగా కొనసాగుతోన్న ఆనవాయితీ ఈసారి కొత్తగా గజ్జె కట్టనున్న పోసాని హేమానంద్ చాంద్రాయణగుట్ట: జాతర అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది పోతరాజు విన్యాసాలు. ఒంటి నిండాపసుపు, కుంకుమ రుద్దుకొని... చేతిలో చెర్నాకోలు... కళ్లకు కాటుక... నోట్లో నిమ్మకాయలతో నృత్యం చేస్తూ వేలాది మంది భక్తజన సందోహం నడుమ పోతరాజు చేసే సందడి అంతా ఇంతా కాదు. గజ్జెకట్టి పోతరాజు వేసే ఒక్కో అడుగుకు ఎంతో ప్రాధాన్యముంటుంది. అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో అతను చేసే నృత్యాలు, హావభావాలు, కొరడా ఝుళిపించడం తదితర విన్యాసాలు అందరిని అలరిస్తాయి. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయ జాతరలో ఇలాంటి ప్రధానమైన తంతును లాల్‌దర్వాజా మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నిర్వహిస్తోంది. దాదాపు వందేళ్లుగా జాతర సమయంలో అమ్మవారికి సేవలందిస్తున్నారు. పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర.. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆలయం తరఫున నిజాం కాలం నుంచి పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబం వందేళ్ల చరిత్రను సొంతం చేసుకుంది. 1908వ సంవత్సరంలో ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కాలంలో ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణలో సేవలందించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన మూడో తరానికి చెందిన వారు ఆ ఆనవాయితీని కొనసాగించడం విశేషం. పోసాని బాబయ్య ఎలియాస్ సింగారం బాబయ్యతో పోతరాజు వేషధారణ ప్రారంభమైంది. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబూరావు, బాబూరావు సోదరుడు సుధాకర్ ఇలా ఇప్పటివరకు ఆరుగురు ఒకే వంశం నుంచి సేవలందించారు. ఈ సారి బోనాల ఉత్సవాల సందర్భంగా బాబూరావు తమ్ముడు పోసాని హేమానంద్ తొలిసారిగా పోతరాజు సేవలందించేందుకు ముందుకు వస్తున్నారు. దున్నపోతు నుంచి గుమ్మడికాయ వరకు.. అప్పట్లో మేకల బండనుంచి దున్నపోతుపై ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చేవారు. ఆ దున్నపోతును పన్నుతో అదిమి పట్టి అమ్మవారికి బలిచ్చేవారు. తరువాత రోజుల్లో మేకను బలిచ్చారు. జంతు బలిని నిషేధించడంతో గుమ్మడికాయతో పోతరాజు శాంతిస్తున్నాడు. పోతరాజంటే.. పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమెర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటారు. డప్పుచప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటారు. ఏడుగురు అక్కాచెల్లెల్లైన అమ్మవార్లకు ఈ పోతరాజంటే అమితానందం. ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమెర దాటుతారు. దీక్షతో... పోతరాజు వేషధారణ అంటే నియమంతో కూ డుకున్నది. ఘటాలను దేవాలయంలో ప్రతిష్ఠిం చిన నాటి నుంచి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పోతరాజుగా నృత్యం చేసేవారు ముందురోజు నుంచే ఉపవాస దీక్షలో ఉం టారు. శాంతి అయ్యే వరకు మత్తు పదార్థాలను, ఆహారాన్ని తీసుకునేందుకు వీలు లేదు. కేవలం అమ్మవారి ధ్యానంలోనే గడుపుతారు. కొరడా దెబ్బల కోసం... పోతరాజు కొరడా దెబ్బల కోసం భక్తులు పోటీపడతారు. కొరడా దెబ్బలను తింటే దుష్ట శక్తులు ఆవహించవని ప్రతీతి. దీంతో భక్తులు కొరడా దెబ్బలు తినేందుకు పోటీ పడుతుంటారు. అమ్మ ఆశీర్వాదంతోనే 30 ఏళ్లపాటు.. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను 30 ఏళ్లపాటు పోతరాజుగా అలరించాను. ఘట స్థాపన నుంచి ఊరేగింపు వరకు ఎంతో నిష్టతో ఉండేవాడిని. ముఖ్యంగా వేషధారణ చేసే సోమవారం రోజున ఉపవాస దీక్ష పాటిస్తాం. అమ్మ దయతోనే ఇప్పటివరకు నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. దశాబ్దాలుగా పోతరాజుగా వ్యవహరించడంతో నా ఇంటిపేరు పోతరాజుగా మారింది. - పోతరాజు (పోసాని) బాబూరావు అదృష్టంగా భావిస్తున్నా.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో వారిని పోతరాజు వేషధారణలో చూస్తున్నా. ఈ సారి నేను తొలిసారిగా పోతరాజుగా వేషం కట్టనున్నాను. మొదటిసారి అయినప్పటికీ నాకెలాంటి భయం లేదు. ఘట స్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో నిమగ్నమయ్యా. అమ్మవారి కరుణతోనే ఈ సారి పోతరాజు విన్యాసాలు చేసే అవకాశం రానుంది. - పోసాని హేమానంద్