laldarawaj bonalu
-
Bonalu Festival 2021: లాల్‌దర్వాజ బోనాలు: పాతబస్తీలో సందడి
-
పాతబస్తీ పరవశం
లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం వరకు కొనసాగింది. పాతబస్తీ జాతరను తలపించింది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంట గంటకు క్యూలైన్ పెరిగిపోవడంతో దర్శనం కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.రాష్ట్ర మంత్రులు సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పలువురు రాజయకీయ ప్రముఖులు సైతం మొక్కులుచెల్లించుకున్నారు. ఉదయం 10 గంటల అనంతరం వర్షం మొదలైనా సరే లైన్లోనే ఉండి బోనాలు సమర్పించారు. ఆద్యంతం యువకులు పోతురాజు వేషధారణలో అలరించారు. శివసత్తుల చిందులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జోగినులు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజామున మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం భక్తులను దర్శనం కోసం అనుమతించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎంపీ విజయశాంతి, పీవీ సింధు బంగారు బోనం సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినీ నటుడు సుమన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహాడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతారావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ కార్యదర్శి నర్సయ్య గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బండారు శ్రీకాంత్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు తిరుపతి శ్రీనివాసారావు, బీసీ కమిషన్ చైర్మన్¯ బి.ఎస్.రాములు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ ఆర్డీఓ డి.శ్రీనివాస్ రెడ్డి, బండ్లగూడ తహసీల్దార్ షేక్ ఫర్హీన్, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయ కమిటీ ఈఓ మహేందర్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులందుకున్నారు. ఉత్సవాల సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపు కమిషనరన్లు అనిల్ కుమార్, శిఖా గోయెల్, దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా, ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్, ఛత్రినాక, శాలిబండల ఇన్స్పెక్టర్లు ఆర్.విద్యాసాగర్ రెడ్డి, పి.శ్రీనివాస్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. భక్తుల ఏర్పాట్లలో ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్‌రావు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నీటి కొరత పోవాలని.. దేశ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నా. ప్రస్తుతం మన దేశంలో నీటి కొరత కలవరానికి గురి చేస్తోంది. కేవలం 25 శాతం చెరువుల్లోనే నీరుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చెరువులు, నదులు, ప్రాజెక్ట్‌ల్లోకి నీరు వచ్చేలా వర్షాలు కురవాలని వేడుకున్నా. – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి సీఎం ప్రత్యేక చొరవతోనే.. బోనాల పండుగ కేవలం తెలంగాణకే ప్రత్యేకం. సీఎం కేసీఆర్ ఈ వేడుకకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలయాల వద్ద అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించడం సంతోషకరం. బోనాల ఉత్సవాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి చూసుకున్నారు. – మహమూద్ అలీ, హోంమంత్రి మన పండుగ విశ్వవ్యాప్తం మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బోనాలు. ఇప్పుడిప్పుడే విశ్వవ్యాప్తమవుతోంది. రాష్ట్రం సస్యశ్యామలం కావాలి. భక్తుల కోసం హెల్త్ క్యాంప్‌లు, మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశాం. సోమవారం ఊరేగింపు సాయంత్రం 4 గంటలకే ప్రారంభించాలి. – తలసాని శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర మంత్రి బంగారు తెలంగాణ సాకారం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కావాలని అమ్మవారిని కోరుకున్నా. బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తూ అన్ని సదుపాయాలు కల్పించాం. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నా.– ఇంద్ర కరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి దాడులు జరగరాదని.. అమ్మవారు మాంగల్యాన్ని కాపాడుతుంది. మహిళలపై దాడులు జరగరాదని, తెలంగాణలో బలవన్మరణాలు చోటుకోరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మను కోరుకున్నా. ప్రతి ఒక్కరు దేశ భక్తి, దైవ భక్తిని అలవర్చుకోవాలి. అప్పుడే పురాతన సంప్రదాయాలను కాపాడినవారమవుతాం.– బండారు దత్తాత్రేయ,మాజీ కేంద్ర మంత్రి నేడు భవిష్యవాణి చాంద్రాయణగుట్ట: బోనాల జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రంగం (భవిష్యవాణి) లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం తరఫున సోమవారం అనురాధ వినిపించనున్నారు. గత 35 ఏళ్లుగా భవిష్యవాణి వినిపించిన సుశీల భర్త మృతి చెందిన నేపథ్యంలో 2015 నుంచి ఆమె కుమార్తె అనురాధ భవిష్యవాణి వినిపిస్తోంది. జగద్గిరిగుట్టలో నివాసం ఉండే అనురాధను కూడా చిన్నతనం నుంచే అమ్మవారు ఆవహిస్తారు. తన తల్లి ఆదేశానుసారం ఆమె భవిష్యవాణి వినిపిస్తున్నారు. -
లాల్‌దర్వాజా బోనాలు నేడే
సాక్షి, చాంద్రాయణగుట్ట : బోనాల జాతరకు లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. ఆదివారం ఉదయం అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. ఇందుకోసం శనివారం ఉదయం నుంచే ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఆలయ పరిసరాల్లో మోహరించారు. బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేయించారు. అమ్మవారికి ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 6 గంటలకు మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా దేవి మహాభిషేకం చేస్తారు. అనంతరం బోనాల సమర్పణ ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగరావు తెలిపారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం చేయనున్నట్టు చెప్పారు. లక్ష మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల్లో మంత్రులు మహమూద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మాజీ ఎంపీలు కవిత, విజయశాంతి, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కాగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం పాతబస్తీకి ఆర్టీసీ ‘లాల్‌దర్వాజా బోనాలు’ పేరుతో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. -
బోన వైభవం
చార్మినార్: లాల్‌దర్వాజ బోనాలకు రంగం సిద్ధమవుతోంది. సింహవాహిని అమ్మవారిఆశీస్సుల కోసం భక్తజనులు ఎదురుచూస్తున్నారు. ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా జరిగే బోనాల జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 19న కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమై 29న పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ముగుస్తాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల ఉత్సవాలకు ప్రస్తుతం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 4 వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ఢిల్లీలో లాల్‌దర్వాజ బోనాలు నిర్వహిస్తున్నారు. 2015లో మొదలైన ఈ జాతర ఏటా ఢిల్లీలో కనుల పండువగా జరుగుతాయి. ఈసారి మరింత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ♦ ఢిల్లీ ఉత్సవాల్లో భాగంగా జూలై 2న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు ♦ జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటాల ఊరేగింపు ♦ 4న ఉదయం 11 గంటలకు అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాల సమర్పణ, పోతరాజుల స్వాగతం. సాయంత్రం 5.30 గంటలకు అంబేడ్కర్ ఆడిటోరియంలో తెలంగాణ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు 1908లో వరదల నేపథ్యంలో.. మూసీ నదికి 1908లో వరదలు సంభవించి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వరకు వరదనీరు పోటెత్తింది. ఆ ప్రళయాన్ని చూసి నిజాం నవాబులు కంగారు పడ్డారు. వరదలో అప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి రాజా కిషన్ పర్షాద్.. లాల్‌దర్వాజ అమ్మవారి మహిమలను అప్పటి నిజాం నవాబుకు వివరించి ఆ తల్లికి పూజలు చేస్తే వరదలు తగ్గుముఖం పడతాయని సలహా ఇచ్చారు. దీంతో అమ్మవారికి నిజాం నవాబు బంగారు చాటలో కుంకుమ, పసుపు, ముత్యాలు తీసుకువచ్చి దేవాలయంలో పూజలు చేశారు. పూజల అనంతరం బంగారు చాట, కుంకుమ, పసుపు, ముత్యాలను చార్మినార్ వద్దకు వచ్చిన వరద నీటికి పూజలు చేసి విడిచిపెట్టారు. అలా చేసిన కొద్దిసేపటికే నగరంలో వరదనీరు తగ్గసాగింది. నాటి నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 1909 ఆషాఢ మాసంలో తొలిసారిగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. అప్పటి నుంచి ప్రతియేటా లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సుమారు 200 మంది కళాకారులతో ఢిల్లీకి... లాల్‌దర్వాజ బోనాల జాతరను 2015 నుంచి ఢిల్లీలో కూడా నిర్వహిస్తున్నాం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను దేశ వ్యాప్తంగా చాటిచెబుతున్నాం. ఇందులో భాగంగా జూలై 1న పాతబస్తీ నుంచి ఢిల్లీకి బయలుదేరుతాం. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో దాదాపు 200 మంది కళాకారులతో ఢిల్లీ వీధుల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నాం. – తిరుపతి నర్సింగ్‌రావు, లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయ కమిటీ చైర్మన్ -
బోనమెత్తనున్న భాగ్యనగరం
-
బోనమెత్తనున్న భాగ్యనగరం
* వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు * హాజరుకానున్న సీఎం అమ్మవారికి స్వర్ణ కిరీటం * అక్కన్న, మాదన్న దేవాలయంలో ఘనంగా వేడుకలు సాక్షి,హైదరాబాద్: బోనాల వేడుకలతో హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వాతావ రణం నెలకొంది. ఆదివారం జరగనున్న ఉత్సవాలకు నగరంలోని అమ్మవార్ల ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. రంగు రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే పాతబస్తీ ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రతి ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. లాల్‌దర్వాజ సింహవాహిని కాళికాదేవి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దా రు. ఈ ఏడాది 72 తులాలతో రూపొందించిన బంగారు కిరీటాన్ని కాళికాదేవికి భక్తులు సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ లాల్‌దర్వాజ బోనాలకు హాజరుకానున్నారు. దేవాదాయ శాఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనుంది. నిజాం కాలం నుంచి ఈ దేవాలయంలో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కన్న , మాదన్న ఆలయానికి కొత్త భవనం ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయంగా పేరు ప్రఖ్యాతలున్న హరిబౌలి శ్రీ అక్కన్న, మాదన్న దేవాలయం కాంతులీనుతోంది. ఆలయానికి ఆనుకొని ఈ ఏడాది అతి పెద్ద సమావేశ మందిరాన్ని నిర్మించారు. ఈ సారి ఈ నూతన భవనం ప్రత్యేక ఆకర్షణ కానుంది. గోల్కొండ రాజు తానీషా మంత్రివర్గంలో కమాండర్ ఇన్ చీఫ్‌గా కొనసాగిన అక్కన్న, ప్రధాన మంత్రిగా పని చేసిన ఆయన సోదరుడు మాదన్న విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ గోల్కొండ కోటకు వెళ్లే ముందు హరిబౌలిలోని అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. వారి మరణానంతరం 1948లో ఆర్యసమాజ్ నాయకులు ఈ ఆలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చారు. ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించడం ప్రారంభించారు. పాతబస్తీలోని అన్ని ఆలయాలతో పాటు నగరమంతటా అమ్మవార్ల ఆలయాలు ఆదివారం నాటి వేడుకలకు అందంగా ముస్తాబయ్యాయి. నేడు నగరంలో జరగనున్న బోనాల వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.