Lalit Narayan Mishra
-
వైరల్ వీడియో: ఒక్కటైన ఆ గుంపును ‘టౌటే’ కదిలించలేకపోయింది!
-
ఒక్కటైన ఆ గుంపును ‘టౌటే’ కదిలించలేకపోయింది!
గాంధీనగర్: ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు...ఆ బలానికి ఉండే శక్తి ఎలాంటిదంటే పెను తుపానునైనా ఎదిరించి నిలవగలదు. టౌటే తుపాను సాక్షిగా మరోసారి ఈ సత్యం సాక్షాత్కరించింది. మే 18న గంటకు 140 కిలోమీటర్ల వేగంతో టౌటే తుపాను గుజరాత్లో తీరం దాటింది. ఆ సమయంలో భారీ సైజు నిర్మాణాలే చిగురుటాకుల వణికి పోయాయి. అరేబియా సముద్రంలో నౌకలు కొట్టుకుపోయాయి. కానీ గుజరాత్‌లోన గదదలో ఇంటి బీమ్‌కి వేలాడుతున్నతేనేటీగలు ఆ తుపాను ఎదిరించాయి. పరిమాణంలో చిన్నవైన తేనేటీగలు ఒకదాన్నొకటి గట్టిగా పట్టుకుని ప్రచండ గాలులును కాచుకున్నాయి. ఐకమత్యం స్ఫూర్తిని నిలిపాయి. -
‘మిశ్రా’ దోషులకు యావజ్జీవం
న్యూఢిల్లీ: రైల్వే శాఖ మాజీ మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. నలభై ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో గురువారం కోర్టు తుది తీర్పు వెలువరించింది. 1975 జనవరి 2న అప్పటి రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా పర్యటన సందర్భంగా బిహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన పేలుడులో మిశ్రాతో పాటు మరో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆనందమార్గ ఆధ్యాత్మిక కేంద్రానికి చెందిన సంతోషానంద(75), సుదేవానంద(79), గోపాల్జీ(73), న్యాయవాది రంజన్ ద్వివేదీ(66)లను డిసెంబర్ 8న కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి గురువారం విచారణ సందర్భంగా జిల్లా కోర్టు న్యాయమూర్తి వినోద్ గోయల్ నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే సంతోషానంద, సుదేవానందలకు రూ.25 వేల చొప్పున జరిమానా, గోపాల్జీ, ద్వివేదీలకు రూ. 20 వేల చొప్పున జరిమానా విధించారు. పేలుడులో మరణించిన మరో ఇద్దరి చట్టపరమైన వారసులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. నాటి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురి కుటుంబ సభ్యులకు రూ. 1.5 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన 20 మందికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో డిసెంబర్ 8నే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రైల్వే మాజీ మంత్రి హత్యకేసులో నలుగురు దోషులుగా నిర్ధారణ
న్యూఢిల్లీ: నలభై ఏళ్ల క్రితం.. నాటి రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రాను హత్యచేసిన కేసులో ఢిల్లీకోర్టు నలుగురిని దోషులుగా నిర్ధారించింది. దోషుల్లో ఆనంద మార్గ ఆధ్యాత్మిక కేంద్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సంతోషానంద అవధూత(75), సువేదానంద అవధూత (79), గోపాల్జీ (73)లతోపాటు న్యాయవాది రంజన్ ద్వివేది (66) ఉన్నారు. బెయిల్‌పై ఉన్న ద్వివేది ఢిల్లీల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పలు సెక్షన్ల కింద వీరిని దోషులుగా నిర్ధారిస్తూ జిల్లా జడ్జి వినోద్ గోయల్ సోమవారం తీర్పు ఇచ్చారు. శిక్షలను ఈనెల 15న ఖరారు చేయనున్నట్లు చెప్పారు. 1975 జనవరి 2న బిహార్‌లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడిలో నాటి రైల్వే మంత్రి మిశ్రాకు తీవ్ర గాయాలయ్యాయి. మరుసటి రోజు ఆస్పత్రిలో మరణించారు.