the lancet medical journal
-
2050 నాటికి 130 కోట్ల మందికి మధుమేహం
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోనుంది. ప్రస్తుతం 50 కోట్లుగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల సంఖ్య 2050 కల్లా రెట్టింపు కంటే ఎక్కువగా 130 కోట్లకు చేరనుంది ఈ విషయాలను లాన్సెట్ పత్రిక వెల్లడించింది. ‘డయాబెటిస్ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలన్నిటికీ ఇది సవాలు వంటిదే. ఈ వ్యాధి కారణంగా ముఖ్యంగా గుండెజబ్బుల కూడా పెరుగుతాయి’అని ఈ పరిశోధనలకు సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన లియానె ఒంగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 96 శాతం టైప్ 2 డయాబెటిస్వేనని తెలిపారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్–2021 సర్వే ఆధారంగా 1990– 2021 సంవత్సరాల మధ్య వయస్సు, లింగం ఆధారంగా 204 దేశాలు, భూభాగాల్లో మధుమేహం విస్తృతి, అనారోగ్యం, మరణాలను బట్టి 2050 వరకు మధుమేహం వ్యాప్తి ఎలా ఉంటోందో వీరు అంచనా వేశారు. వీరి అధ్యయనం ప్రకారం.. మధుమేహం వ్యాప్తి రేటు 6.1%గా ఉంది. మరణాలు, వైకల్యానికి ప్రధాన కారణాలుగా నిలిచే టాప్–10 వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఉండటం గమనార్హం. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలలో అత్యధికంగా 9.3% మంది ఈ వ్యాధికి గురికాగా 2050 నాటికి ఇది 16.8%కి చేరుకోనుంది. అదే లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో అప్పటికల్లా దీని విస్తృతి 11.3% గా ఉంటుందని ఈ సర్వే తెలిపింది. అంతేకాకుండా, 65 ఏళ్లు, ఆపైన వారే ఎక్కువగా డయాబెటిస్ బారినపడుతున్నారని, అన్నిదేశాల్లోనూ ఇదే ఒరవడిని గుర్తించామని లియానె ఒంగ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వయస్సు వారిలో 39.4 శాతం మంది ఈ జబ్బు బారినపడినట్లు గుర్తించామన్నారు. అత్యల్పంగా మధ్య ఆసియా, మధ్య యూరప్, తూర్పు యూరప్ దేశాల్లో 19.8% మందిలోనే ఉంది. టైప్2 డయాబెటిస్‌కు ప్రధానమైన 16 కారణాల్లో బీఎంఐ ప్రాథమిక కారణమని, టైప్ 2 డయాబెటిస్తో సంభవించే మరణాలు, వైకల్యాలకు ఇదే కీలకమని సర్వే తెలిపింది. ఆల్కహాల్, పొగాకు వినియోగంతోపాటు, ఆహార, వృత్తిపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలతోపాటు తక్కువ శారీరక శ్రమ ఇందుకు ప్రధానమైన అంశాలని పేర్కొంది. తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో జన్యుసంబంధ, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ఈ వ్యాధి బారినపడేందుకు కారణాలుగా ఉన్నాయి. -
భారత్‌లో అబ్బాయిలకే కేన్సర్ వ్యాధి ఎక్కువ
న్యూఢిల్లీ: భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది. దేశంలో జనవరి 1, 2005 నుంచి డిసెంబర్ 31, 2019 మధ్య మూడు కేన్సర్ ఆస్పత్రులతో పాటు ఢిల్లీలోని పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్), మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రరీల నుంచి రికార్డుల్ని సేకరించి ఈ నివేదిక రూపొందించారు. పీబీసీఆర్‌లో 11 వేలు, ఇతర ఆస్పత్రిల్లోని 22 వేల క్యాన్సర్ రోగుల్లో అబ్బాయిల సంఖ్యే అధికంగా ఉందని ఎయిమ్స్ ప్రొఫెసర్ సమీర్ బక్షీ చెప్పారు. -
అస్సలు శారీరక శ్రమ చేయడం లేదా? అయితే లాన్సెట్ స్టడీ తెలుసుకోండి!
ప్రతిఒక్కరూ రోజులో కనీస శారీరక శ్రమ ఎంతసేపు చేయాలో తెలుసా.. అసలు శారీరక శ్రమ చేయకపోతే ఏమవుతుందో తెలుసా.. ఈ విషయాల గురించి పరిశోధన చేసిన అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. మారుతున్న జీవన విధానంలో ప్రతి నలుగురిలో ఒకరు కనీస శారీరక శ్రమ చేయడంలేదని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రధానంగా యువత రోజూ కనీసంగా రెండు గంటలపాటు ఆన్‌స్క్రీన్‌పై ఉంటుండగా, అందులో పావువంతు సమయాన్ని కూడా వ్యాయామానికి కేటాయించడం లేదు. దీని వల్ల తలెత్తే దుష్ప్రభావం వారి తదుపరి జీవనంతోపాటు రాబోయే తరంపైనా పడనుందని పేర్కొంది. ఆరోగ్యంపై శారీరక శ్రమ, క్రీడల ప్రభావం అనే అంశంపై ప్రతి నాలుగేళ్లకోసారి లాన్సెట్ పరిశోధన చేస్తోంది. 2012 నుంచి ప్రతిసారి ఒలింపిక్స్ సమయంలో చేసే ఈ పరిశోధన తాలూకూ నివేదికను జర్నల్‌లో ప్రచురిస్తోంది. తాజాగా మూడో పరిశోధన సిరీస్‌ను విడుదల చేసింది. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి. శారీరక శ్రమకు పావువంతు మంది దూరం ప్రస్తుత జనాభాలో పావువంతు (25 శాతం) మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వ్యాయామంపై అవగాహన పెరుగుతున్న క్రమంలోనే కోవిడ్ అడ్డంకిగా మారింది. శారీరక శ్రమ చేయనివ్యక్తి త్వరగా జీవనశైలి వ్యాధులకు గురయ్యే అవకాశాలెక్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాయామాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయిస్తూ ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్న 25 శాతాన్ని 15 శాతానికి కుదించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకదానికొకటి అనుసంధానం నడక, సైక్లింగ్ లాంటి వాటితో వాహనాల వినియోగం తగ్గిస్తే వాతావరణ కాలుష్య మూ తగ్గుతుంది. గాడ్జెట్లు, ఇతర సాంకేతిక పరికరాల వినియోగాన్ని కాస్త తగ్గించడంతో గ్లోబల్ వార్మింగ్‌పై ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నీ వాతావరణ పరిస్థితులను మారుస్తాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పుకొచి్చంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ విస్తృతం చేయాలి. ప్రతి బడి, కళాశాలలో వ్యాయా మం ఒక సబ్జెక్టుగా నిర్దేశించి క్లాస్‌వర్క్, హోమ్‌వర్క్ ఇవ్వాలి. యాక్టివ్ ట్రావెల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. పరిశోధనలో వెలుగు చూసిన మరికొన్ని అంశాలు ♦ శారీరక శ్రమకు దూరంగా ఉన్న 25 శాతంలో 80 శాతం మంది మధ్య ఆదాయ, దిగువ ఆదాయాలున్న దేశాలకు చెందినవాళ్లే. ♦ ప్రపంచ జనాభాలో 20 శాతం మంది వ్యాయామం సరిగ్గా చేయకపోవడంతో జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. ♦ రోజుకు సగటున 20-30 నిమిషాలు, వారానికి కనీసం 150 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే బీపీ, మధుమేహం, గుండె, కండరాల సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ♦ దివ్యాంగుల్లో 62 శాతం మంది అవసరమైన దానికన్నా తక్కువగా శారీరక శ్రమ ఉన్నట్లు పరిశోధన చెబుతోంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 10-24 సంవత్సరాల మధ్య వయసువాళ్లు 24 శాతం ఉన్నారు. వీరిలో 80 శాతం ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉన్నారు. ♦ 2008 నుంచి గూగుల్‌లో క్రీడలు, వ్యాయామం పదాల సెర్చింగ్ పెరుగుతూ వస్తోంది. చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి 2020 ప్రొజెక్టెడ్ సెన్సెస్ ప్రకారం చైల్డ్‌హుడ్ ఒబిసిటీ 19.3 శాతంగా ఉంది. దీంతో పిల్లల్లో బీపీ, కొలెస్ట్రాల్, గ్రోత్, ప్రీ డయాబెటిక్ సమస్యలు అత్యధికంగా వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే చిన్నప్పటి నుంచే శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. -డాక్టర్ కిషోర్ ఈగ, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కోవిడ్‌తో మారిన జీవనశైలి ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వాళ్లలో సగం మందికి ఆర్థో సమస్యలుంటున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ తరగతులు తదితరాలతో ఎక్కువ సమయం ఒకే చోట, ఒకే విధంగా గడుపుతున్నారు. ఎక్కువ సమయం ఒకేవిధంగా కూర్చోకుండా అటుఇటు తిరగడం లాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ సురేశ్ చీకట్ల, స్పైన్ సర్జన్, కిమ్స్ ముందస్తు వ్యూహం అవసరం వ్యాయామం చేయకుంటే తలెత్తే అనర్థాలను ముందస్తు వ్యూహాలతో అరికట్టాలి. వైద్య చికిత్సలపై ప్రభుత్వాలు భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. అనారోగ్యం బారిన పడకుండా సరైన అవగాహన కల్పించడం, తప్పనిసరి చర్యల కింద వ్యాయామాన్ని ఎంపిక చేయడం వంటివాటిపై కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేయాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల -
తన చెల్లికి వచ్చిన దుస్థితి మరోకరికి రాకూడదని..
అసలే పేదరికం, దానికి తోడు పదహారేళ్ల చెల్లికి మానసిక ఆరోగ్యం అంతంత మాత్రం. డాక్టర్ల సలహామేరకు ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ సభ్యుల ఆదరణ అంతగా లేకపోవడంతో చెల్లి నిరాశా నిస్పృహలకు లోనై రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ పరిణామాలన్నింటిని దగ్గర నుంచి గమనించిన 31 సంవత్సరాల అక్క సుమిత్ర గాగ్రై మనసు చలించి పోయింది. వైద్యం చేయించినప్పటికీ అవగాహన లేమి, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా చెల్లి ప్రాణాలు కోల్పోవడంతో మానసిక ఆరోగ్యంపై ఎలాగైనా అందరిలో చైతన్యం తీసుకురావాలనుకుంది. మారుమూల గ్రామాల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలను దూరం చేసి వారిలో అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని పల్లెటూళ్లు, గ్రామాలు, గిరిజన తండాలను సందర్శించి వీధినాటకాలు, కథలు, చెప్పడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ద్వారా మూఢనమ్మకాలు, మానసిక ఆరోగ్యంపై అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తోంది. ‘హో’తెగకు చెందిన సుమిత్ర స్థానిక ఎజెక్ట్ ఎన్జీవో కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ...సెల్ఫ్‌హె ల్ప్ గ్రూపులకు, మహిళలకు మధ్య వారధిగా పనిచేస్తూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె కూడా గిరిజన మహిళ కావడంతో ఆయా గ్రామాల్లోని మహిళలతో సులభంగా కలిసిపోయి వారికి అర్థమయ్యేలా చెప్పేవారు. గత పన్నెండేళ్లుగా 24 మారుమూల గ్రామాలను సందర్శించి 36 వేల మందికిపైగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. మానసిక ఆరోగ్యంతోపాటు, మహిళలు పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం, శిశు మరణాల రేటు తగ్గించడానికి కృషి చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రసవం అయిన తరువాత బొడ్డు తాడు కత్తిరించడం నుంచి శిశువును పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలన్న అవగాహన లేమితో చాలామంది పురిటి శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో శిశు మరణాల రేటు అధికంగా ఉంటుంది. సుమిత్ర, తన ఎన్జీవో సభ్యులతో కలిసి అవగాహన కల్పించి మరణాల రేటును 45 శాతం తగ్గించారు. మానసిక ఆరోగ్యంపై సుమిత్ర చేసిన సేవను గుర్తించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతేడాది ‘ఉమన్ ఎగ్జంప్లర్’ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ‘దలాన్సెట్’ మెడికల్ జర్నల్‌లో సుమిత్రా సేవా కార్యక్రమాలను ప్రస్తావించడం విశేషం. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, నీతి ఆయోగ్ ప్రకారం జార్ఖండ్ రాష్ట్రంలో మూఢనమ్మకాలు దయ్యం పిశాచి వంటి కారణాలతో మహిళలపై అనేక దారుణాలు అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. సుమిత్ర వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పించడం ద్వారా ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు, పోషకాహారంపై మంచి అవగాహన కల్పించడంతో ఇప్పుడు వారంతా మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నారు. -
భారత్‌లో కరోనా మరణాలు 34–49 లక్షలు?
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ఎందరో చిన్నారుల్ని అమ్మనాన్నలకు దూరం చేసింది. కరోనా బట్టబయలైన మొదటి 14 నెలల్లో 21 దేశాల్లో 15 లక్షల మందికి పైగా పిల్లలు అమ్మ నాన్నలు లేదంటే సంరక్షకుల్ని కోల్పోయినట్టుగా ది లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. భారత్‌లో 1,19,000 వేల మంది తల్లిదండ్రుల్లో ఒకరికి దూరమై దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ చేసిన ఈ అధ్యయనానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ డ్రగ్ అబ్యూజ్ (ఎన్ఐడీఏ) నిధుల్ని సాయం చేసింది. ‘ కరోనా ఆడవారికంటే మగవారిపైనే ఎక్కువ ప్రభావం చూపింది. తండ్రులు, తాతయ్యలను కోల్పోయిన పిల్లలే అధికంగా ఉన్నారు’ అని ఎన్ఐడీఏ డైరెక్టర్ నోరా డీ వోల్కావ్ చెప్పారు, అధ్యయనం వివరాలు ఇవీ ► 21 దేశాల్లో 11,34,000 మంది చిన్నారులు తల్లిదండ్రుల్లో ఒకరిని, లేదంటే వారి సంరక్షకులైన బామ్మ, తాతయ్యలని కోల్పోయారు. వీరిలో 10,42,000 మంది తల్లిదండ్రుల్లో ఒకరినీ, లేదంటే ఇద్దరినీ కోల్పోయారు. మొత్తమ్మీద 15,62,000 మంది చిన్నారులు పెద్దల అండని కోల్పోయారు. ► భారత్‌లో 1,19,000 మంది చిన్నారుల తల్లిదండ్రులు, లేదంటే సంరక్షకుల్ని పోగొట్టుకుంటే వారిలో 25,500 మంది చిన్నారుల తల్లుల్ని కరోనా మింగేసింది,. 90,751 మంది చిన్నారుల తండ్రుల్ని కోవిడ్ బలి తీసుకుంది. ► దక్షిణాఫ్రికా, పెరూ, అమెరికా, భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో అధికంగా చిన్నారులు అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నారు. ► ప్రతీ వెయ్యి మంది పిల్లల్లో తల్లి లేదంటే తండ్రిని కోల్పోయిన పిల్లలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర దేశాల కంటే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రతీ వెయ్యి మంది పిల్లలకు తల్లిదండ్రుల్లో సంరక్షకుల్ని కోల్పోయిన వారి రేటు 0.5 ఉంటే దక్షిణాఫ్రికాలో 6.4, పెరూ (14.1), బ్రెజిల్ (3.5), కొలంబియా (3.4), మెక్సికో (5.1), రష్యా (2.0), అమెరికా (1.8)గా ఉంది. భారత్‌లో కరోనా మరణాలు 34–49 లక్షలు? భారత్‌లో కరోనాతో మృతి చెంది అధికారిక లెక్కల్లోకి రాని వారు 34 నుంచి 49 లక్షల మంది ఉంటారని తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌కు చెందిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, /అమెరికాలో స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్కి చెందిన జస్టిన్ సాండ్ఫర్, హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన అభిషేక్ ఆనంద్‌లు కలసికట్టుగా ఈ నివేదికను రూపొందించారు. కరోనా మరణాలపై గణాంకాలతో పాటుగా తము కొంత అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించారు. దేశంలో జనవరి 2020, జూన్ 2021 మధ్య 34 లక్షల నుంచి 49 లక్షల మంది వరకు కోవిడ్ బారిన పడి మరణించినట్టుగా వారు వెల్లడించారు. భారత్ చెబుతున్న అధికారిక లెక్కల కంటే ఈ సంఖ్య చాలా చాలా ఎక్కువ. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారం నాటికి 4,18,480 ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలో కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత స్థానం భారత్‌దే. -
వాతావరణమే.. విలన్
పారిస్: వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా పసిమొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. శిలాజ ఇంధన ఉద్గారాలను కట్టడి చేయకపోతే భారత్ ఒకతరం ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తేల్చింది. భారత్‌లో దీని ప్రభావం అత్యధికంగా కనబడుతోందని వెల్లడించింది. గత 50 ఏళ్లుగా చిన్నారుల ఆరోగ్యానికి భారత్ ఎంతో కృషి చేసిందని, కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటివరకు చేసినదంతా వృథా కానుందని అంచనా వేసింది. ఇవాళ పుట్టిన ప్రతీ బిడ్డ భవిష్యత్‌ను వాతావరణంలో మార్పులే నిర్దేశిస్తాయని నివేదిక సహ రచయిత్రి పూర్ణిమ చెప్పారు. లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్, క్లైమేట్ ఛేంజ్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సహా మరో 35 సంస్థలకు చెందిన 120 మంది పర్యావరణ నిపుణులు అధ్యయనం చేశారు. వాతావరణంలో మార్పులు, ప్రభావానికి సంబంధించి 41 అంశాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాలు ► కరువు పరిస్థితులు ► అంటు వ్యాధులు ► వరదలు ► వడగాడ్పులు ► కార్చిచ్చులు ఏయే వ్యాధులు వచ్చే అవకాశం ► నీటి కాలుష్యంతో డయేరియా ► వాయు కాలుష్యంతో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు ► చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు ► డెంగీ వ్యాధి విజృంభణ ► గుండెపోటు ఏయే దేశాలపై ప్రభావం ► అత్యధిక జనాభా కలిగిన దేశాలు, వైద్య ఖర్చులు పెనుభారంగా మారిన దేశాలు, అసమానతలు, పేదరికం, పౌష్టికాహార లోపాలు కలిగిన భారత్ వంటి దేశాలపై వాతావరణంలో వస్తున్న మార్పులు పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి. ► భారత్‌లో 2.1 కోట్ల మందిపై వాతావరణ మార్పుల ప్రభావం ► చైనాలో 1.7 కోట్ల మందికి ఆరోగ్య సమస్యలు ► 196 దేశాలకు గాను 152 దేశాలపై వాతావరణంలో మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి. ► 2015లో భారత్‌లో వీచిన వడగాడ్పులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఇకపై సర్వసాధారణం కానున్నాయి. పరిష్కార మార్గాలేంటి ? ► ప్రతీ ఏడాది ప్రపంచ దేశాలు సగటున 7.4 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తే 2050 నాటికి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలరు ► భారత్ థర్మల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయేతర ఇంధనంపైనే ఆధారపడాలి. ► ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి ► చెత్త, పంట వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. -
2050 నాటికిమలేరియాకు చెక్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మరో 30 సంవత్సరాలు పడుతుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సగం దేశాలు మలేరియా నుంచి విముక్తి పొందాయని మిగిలిన దేశాల్లో 2050 నాటికి ఈ వ్యాధిని అరికట్టవచ్చునని ఆ నివేదిక తెలిపింది. 2017లో మలేరియా కేసుల్లో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్‌కు చెందినవే కావడం ఆందోళన పుట్టిస్తోంది. నివేదిక ఎలా ? ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి నిర్మూలనకు పరిశోధనలు చేస్తున్న నిపుణులు, బయోమెడికల్ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, ఆరోగ్య నిపుణులు మొత్తం 40 మంది అభిప్రాయాలను తీసుకున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలనకు అమలు చేస్తున్న వ్యూహాలు, కేటాయిస్తున్న నిధులు వంటివి క్రోడీకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ఏం చెప్పిందంటే ► 2017లో ప్రపంచంలో 21.9 కోట్ల మలేరియా కేసులు వెలుగులోకి వస్తే, అందులో కోటి కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అందులోనూ 71 శాతం తమిళనాడులో నమోదయ్యాయి. ► భారత్‌కు చెందిన పట్టణాల్లో మలేరియా వ్యాధికారక దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ► భారత్‌లో పట్టణీకరణ కారణంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, చెరువులు, కాల్వలు వంటి చోట్ల దోమలు బాగా వృద్ధి చెంది మలేరియా వ్యాపిస్తోంది. ► భారత్‌లో ఆరోగ్యానికి ప్రజలు తమ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కూడా మొండి వ్యాధులు దూరం కావడం లేదు. ► 2000 సంవత్సరం తర్వాత మలేరియా వ్యాధి మరణాలు 60 నుంచి 36 శాతానికి తగ్గిపోయాయి. ► నిధుల కొరత కారణంగ్లా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాకు చెందిన 55 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. ► ఇప్పటికీ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ► 2017లో మొత్తం మరణాల్లో 85శాతం 25 దేశాల్లోనే నమోదయ్యాయి. ► పేదరికం కారణంగా మలేరియా నిర్మూలనకు నిధులు కేటాయించలేక ఆఫ్రికా దేశాల్లో ఇంకా మరణాలు సంభవిస్తున్నాయి. ► ప్రాంతాలవారీగా, దేశాల వారీగా, అంతర్జాతీయంగా పటిష్టమైన చర్యల్ని తీసుకుంటేనే ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించగలం ► ప్రపంచ దేశాలన్నీ ప్రతీ ఏడాది 200 కోట్ల అమెరికా డాలర్ల నిధులు కేటాయిస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమవుతుంది. ► ప్రస్తుత ఆవిష్కరణలను బట్టి 2050 నాటికి ఈ వ్యాధి ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనిపించదు. -
వారానికి ఐదు సార్లు తాగినా..
లండన్ : నిత్యం మితంగా మద్యం లేదా వైన్ సేవిస్తే పదికాలాల పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పలు అథ్యయనాలు వెల్లడైనా తాజా అథ్యయనం మద్యం ప్రియులకు షాక్ ఇస్తోంది. వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్, 9 గ్లాస్‌ల బీర్‌ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ స్పష్టం చేసింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు ముచ్చట్లను పరిశీలించిన మీదట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు స్ర్టోక్, గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు అధికంగా ఉందని ఈ పత్రిక తేల్చింది. ఇక వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాములు అంటే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునేవారు సగటు జీవిత కాలంలో రెండేళ్లకు ముందే మృత్యువాతన పడతారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించడంపై ఉన్న అధికారిక గైడ్‌లైన్స్‌ను సవరించాల్సిన అవసరం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన అథ్యయనం తెలిపింది. ఇక ప్రతివారం ఆరు గ్లాస్‌ల వైన్, అదే మోతాదులో బీర్‌ను తీసుకోవాలని, అంతకు మించి మద్యం సేవించడం ఆరోగ్యానికి చేటని బ్రిటన్ ఇటీవల తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు మహిళలు తగిన మోతాదులో రోజుకు ఒక డ్రింక్, పురుషులు రోజుకు రెండు సార్లు మితంగా మద్యం తీసుకోవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గైడ్‌లైన్స్ పేర్కొంటున్నాయి. -
ప్రపంచంలో పిల్లల మరణాలు తగ్గాయి
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా గడచిన కొన్ని దశాబ్దాలుగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయి. 2000 సంవత్సరంలో సంభవించిన పిల్లల మరణాలతో పోలిస్తే 2015 సంవత్సరంలో సంభవించిన పిల్లల మరణాలు 40 లక్షలు తక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలిందని ‘ది లాన్సెట్’ వైద్య పత్రిక వెల్లడించింది. 1990 నాటి నుంచి 2015 నాటి వరకు పరిశీలిస్తే ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు 53 శాతం తగ్గాయి. ఇంతమాత్రానికే సంతోష పడాల్సిన అవసరం లేదని, 2000 సంవత్సరం నాటికి మూడింతలు తగ్గించాలనే ప్రపంచ లక్ష్యం నెరవేరనే లేదని వైద్య పత్రిక వ్యాఖ్యానించింది. అయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఈ పిల్లల మరణాలు తగ్గడం ఆనందదాయకమని పేర్కొంది. డయేరియా, మలేరియా, మీజిల్స్తోనే కాకుండా ప్రసవం సందర్భంగా కూడా పిల్లలు ఎక్కువగా మరణించేవారు. ఈ పిల్లల మరణాల్లో దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని కూడా నివేదిక పేర్కొంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది పిల్లలు మరణించారు. వారిలో 27లక్షల మంది పురిట్లోనే చనిపోయారు. మొత్తం పిల్లల మరణాల్లో 60 శాతం మరణాలు ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా, చైనా, అంగోలా, ఇండోనేసియా, బంగ్లాదేశ్, టాంజానియా దేశాల్లో సంభవించాయి. వీటిలో కొన్ని దేశాల్లో పిల్లల జననాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆయా దేశాల్లో మతులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రతి వెయ్యి మంది పిల్లల్లో వంద మందికి పైగా పిల్లలు అంగోలా, చాద్, మాలి, నైజీరియా, సియెర్రా లియోన్, సోమాలియా దేశాల్లో ఎక్కువగా మరణిస్తున్నారు.