న్యూఢిల్లీ: భారత్‌లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అధికంగా కేన్సర్ బారిన పడుతున్నారని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. సమాజంలో లింగ వివక్షే దీనికి కారణమై ఉండవచ్చునని అభిప్రాయపడింది.
దేశంలో జనవరి 1, 2005 నుంచి డిసెంబర్ 31, 2019 మధ్య మూడు కేన్సర్ ఆస్పత్రులతో పాటు ఢిల్లీలోని పాపులేషన్ బేస్డ్ కేన్సర్ రిజిస్ట్రీ (పీబీసీఆర్), మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రరీల నుంచి రికార్డుల్ని సేకరించి ఈ నివేదిక రూపొందించారు. పీబీసీఆర్‌లో 11 వేలు, ఇతర ఆస్పత్రిల్లోని 22 వేల క్యాన్సర్ రోగుల్లో అబ్బాయిల సంఖ్యే అధికంగా ఉందని ఎయిమ్స్ ప్రొఫెసర్ సమీర్ బక్షీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment