రాజకీయ పార్టీలకు స్థలాల కేటాయింపు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయిస్తూ గురువారం జీవో జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు పార్టీలకు స్థలాల కేటాయింపు పాలసీని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శాసనసభలో 50 శాతం కంటే సీట్లు ఎక్కువగా ఉన్న పార్టీలకు సీఆర్డీఏ పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 25 నుంచి 50 శాతం మధ్య సీట్లు ఉంటే అర ఎకరం మాత్రమే కేటాయింపులు జరిగాయి.
కనీసం ఒక్క సభ్యుడైనా ఉంటే వెయ్యి గజాలు, జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలకు స్థలాలు, 50 శాతం కంటే ఎక్కువ సీట్లున్న పార్టీకి రెండెకరాలు,25 నుంచి 50 శాతం మధ్య సీట్లున్న పార్టీలకు వెయ్యి గజాలు, 25 శాతం లోపు, కనీసం ఒక సభ్యుడుంటే 300 గజాల కేటాయింపు కేటాయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు స్థలాలు దక్కనట్లే. కాగా శాసనసభలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంకు ఒక్క సభ్యుడి ప్రాతినిధ్యం కూడా లేని విషయం తెలిసిందే. మరోవైపు భారతీయ జనతా పార్టీకి కేవలం వెయ్యి గజాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది.