Land Ceiling Act
-
బడుగుల భూముల్లో రాబంధువులు
దశాబ్దాల క్రితం ఆ భూములు నిరుపేద ఎస్సీ, బీసీలకు దాఖలు పడ్డాయి. సర్కారు డీ పట్టాలు ఇచ్చింది. కానీ వారెవరూ వాటిని అనుభవించ లేకపోతున్నారు. కారణం అవి ఎప్పుడో పెత్తందార్లు కబంధ హస్తాల్లో చిక్కుకోవడమే. వారికి టీడీపీ కీలక నేత అండ ఉండటం, అడిగితే అంతు చూస్తారన్న భయంతో బడుగుల వాటి పై ఆశలు వదులుకున్నారు. 2022లో సమాచార హక్కు చట్టం ద్వారా ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దళిత సంఘాలు కోట్ల విలువ చేసే çసుమారు 20 ఎకరాల భూములను టీడీపీ పెత్తందారులు చెర నుంచి రక్షించేందుకు ఉద్యమిస్తున్నారు. అయితే కీలక టీడీపీ నేత సోదరుడు అధికారులపై ఒత్తిడి చేస్తూ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో మరో భూదందా వెలుగులోకి వచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు పక్కనే తులసిపేటలో దాదాపు 19.62ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి ఆక్రమణకు గురైంది. నిరుపేద ఎస్సీ, బీసీలకు ఇచ్చిన భూమిని అక్కడి పెత్తందార్లు ఆక్రమించుకోగా.. వీరికి టీడీపీ కీలక నేత అండగా నిలిచారు. ఇంకేముంది వారి కబంద హస్తాలనుంచి ఆక్రమిత భూమి బయటకి రావడం లేదు. గట్టిగా అడుగుదామంటే ఎక్కడ చంపేస్తారేమో అన్న.. భయంతో బాధితులు వణికిపోతున్నారు. 19.62 ఎకరాల మేర భూ ఆక్రమణ దివంగత కింజరాపు ఎర్రంనాయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ రాజకీయాల్లోకి రాకముందు అప్పటి ప్రభుత్వం నిమ్మాడకు పక్కనున్న తులసిపేటలోని నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ల్యాండ్ సీలింగ్ భూమిని డీ పట్టాల కింద ఇచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వ గ్రామం నిమ్మాడకు కిలోమీటరన్నర దూరంలో ఉ న్న చిట్టివలస రెవెన్యూ పరిధిలో తులసిపేట ఉంది. సర్వే నెంబర్.194/1, 194/7,195/2, 200/1, 203/3బి, 208/2ఎ, 208/2సీ, 217/2, 222/1లోగల 19.62ఎకరాల భూమిని 33 మంది నిరుపేద ఎస్సీలకు, 19 మంది నిరుపేద బీసీలకు డీ పట్టాల కింద ప్రభుత్వమిచ్చింది. అయితే, ప్రభుత్వం తమకిచ్చిన భూములను లబ్ధిదారులు వెంటనే సాగు చేయకపోవడంతో అక్కడనున్న టీడీపీ నేతల అండదండలున్న పెత్తందార్లు ఆక్రమించారు. అంతటితో ఆగకుండా సాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు కావడంతో భూములు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. టీడీపీ కీలక నేతలు అండదండలు ఉండటంతో ఆ భూమి మీదకి నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులు వెళ్లడానికి భయపడుతున్నారు. అసలే అక్కడ హత్యా రాజకీయాలు. నిమ్మాడ కేంద్రంగా టీడీపీ కీలక నేత ఫ్యామిలీకి నేర చరిత్ర కూడా ఉంది. వారిని కాదని అక్కడ ముందుకెళ్లడానికి సహజంగానే భయం. అలాంటి పరిస్థితులున్న పక్క గ్రామమే కావడంతో ప్రభుత్వం తమకిచ్చిన భూముల్లోకి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. ఆందోళనలు చేస్తున్నా.. నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ, మరికొన్ని సంఘాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గత కొన్నాళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా శాఖ అధ్యక్షుడు, టెక్కలి వాసి బోకర నారాయణరావు సమాచార హక్కు చట్టం కింద ఆ భూముల వివరాలు, పట్టాదారులెవరు, ప్రస్తుత అనుభవదారులు ఎవరన్న వివరాలను లిఖిత పూర్వకంగా అడిగారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమాచార హక్కు చట్టం కింద లిఖితపూర్వంగా 2022 మార్చిలో వివరాలు ఇచ్చింది. 19.62 ఎకరాలను 33 మంది ఎస్సీలకు, 19 మంది బీసీలకు ఇచ్చారని, ఇప్పుడా భూమి ఆక్రమణ జరిగిందని, ఫలానా వ్యక్తుల అనుభవంలో ఉందని నిర్ధారణ కూడా చేస్తూ వివరాల్లో పేర్కొంది. ఆక్రమణలో ఉన్న భూమిని అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతోంది. అధికారులపై ఒత్తిళ్లు ఆందోళనలు జరుగుతుండటం, ఆక్రమిత భూమి వ్యవహారం వెలుగు చూడటం, సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిప్లయ్‌లో ఆక్రమణలు ‘డీ–పట్టా భూములు అప్పగించాలి’ కోటబొమ్మాళి: మండలంలోని చిట్టివలస పంచాయతీ తులసిపేటలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన డీ–పట్టా భూములను గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి ఎడ్ల గోపి, అధ్యక్షుడు పాల పోలారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఈనెల 20లోగా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ జామి ఈశ్వరమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చిట్టి సింహాచలం, బలగ రామారావు, జామాన రామారావు, బమ్మిడి వేణు పాల్గొన్నారు. ఆక్రమణదారులకు అండగా పెద్దలు డీ పట్టా భూముల ఆక్రమణదారులకు రాజకీయ పెత్తనం, అధికారం చెలాయిస్తున్న ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి. ఆక్రమణ బాగోతమంతా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లోనే జరిగింది. పెద్దల అండదండలు ఉండటంతో నిరుపేదలు ఏం చేయలేకపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ వాదన వినిపిస్తున్నారు. ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక నిరుపేద లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ భూములు అసలైన లబ్ధిదారులకు అప్పగించి న్యాయం చేయాలి. – బోకర నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ అధ్యక్షుడు స్వాధీనం చేసుకుంటాం తులసిపేట ప్రభుత్వ భూమిలో ఎస్సీ, బీసీ పేద కుటుంబాలకు పట్టాలిచ్చారని, అవి ఆక్రమణకు గురయ్యాయని టెక్కలి సబ్ కలెక్టర్‌కు దళిత సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇటీవల గ్రామానికి మా సిబ్బందిని పంపించాం. కానీ, స్థానికంగా ఎవరూ సహకరించలేదు. బుధ వారం మరికొందరు బాధిత లబ్ధిదారులు ఫిర్యా దు చేయడంతో మళ్లీ గ్రామానికి వెళ్లి సమగ్ర విచారణ జరుపుతాం. అంతా నిర్ధారించుకున్నాక పోలీసుల బందోబస్తు మధ్య ఆ భూములను స్వాధీ నం చేసుకుని, అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తాం. – జామి ఈశ్వరమ్మ, తహశీల్దార్, కోటబొమ్మాళి జరిగాయని అధికారులు నిర్ధారించడం వంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో టీడీపీ కీలక నేత సోదరుడు రంగంలోకి దిగి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇప్పుడా భూముల జోలికి పోవద్దని, తాము అధికారంలోకి వస్తామని, అంతవరకు జాప్యం చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. తమ మాట వినకపోతే తాము అధికారంలోకి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు కూడా చేసినట్టు తెలియవచ్చింది. -
పట్టణ భూపరిమితి చట్టం.. ప్రవేశపెట్టిన వ్యక్తే రద్దు చేయమన్నారు!
ఇందిరాగాంధీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ మంత్రి హోదాలో ఇందర్ కుమార్ గుజ్రాల్ పట్టణ భారతంలో ఇళ్ల స్థలాల ధరలను తగ్గించి, భూముల లభ్యతను పెంచాలనే ఉదాత్త ఆశయంతో పట్టణ భూ పరిమితి, నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రధానమంత్రి హోదాలో అదే ఐ.కె. గుజ్రాల్ ఆ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు! అప్పుడు కూడా ఆయన ఆశయం పట్టణ భారతంలో ఇళ్ల స్థలాలను తగ్గించి, భూముల లభ్యతను పెంచడమే! ఏ లక్ష్యంతోనైతే పార్లమెంటు ఒక చట్టం చేసిందో సరిగ్గా అదే లక్ష్యాన్ని నెరవేర్చడానికి తిరిగి అదే చట్టాన్ని రద్దు చేయడం అనేది అరుదుగా జరిగే ఘటన. పార్లమెంటు చట్టం విఫలం కావడమే దీనికి కారణం. అన్ని సోషలిస్టు స్వప్నాల్లానే పట్టణ భూమి సామాజికీకరణ కల కూడా భగ్నం అయింది. పట్టణ భూ పరిమితి చట్టం అమలైన 64 నగరాలలో ప్రైవేటు యజమానుల నుంచి 2,20,000 హెక్టార్ల మిగులు పట్టణ భూములను ప్రభుత్వం సేకరించవలసి ఉంది. ఆ భూమిలో అత్యధిక భాగాన్ని పేదలకు ఇళ్లు కట్టడానికి వినియోగించవలసి ఉంది. కానీ వాస్తవంలో 19,000 హెక్టార్ల పట్టణ భూములను మాత్రమే సేకరించారు. అయితే, పట్టణ భూ పరిమితి చట్టం, అద్దె నియంత్రణ చట్టం, అధిక స్టాంప్ సుంకాల వల్ల కృత్రిమ భూ కొరత ఏర్పడి ముంబైలో భూముల ధరలు న్యూయార్క్, లండన్ ధరలను మించిపోయాయి. చాలా రాష్ట్రాల్లో పట్టణ భూపరిమితి చట్టాన్ని రద్దు చేశారు. దాంతో కనీసం ఒక తరం పట్టణ భారతీయులకు సొంత ఇల్లు అనేది కలగానే మిగిలింది. -
'ఉత్తమ్ గాంధీభవన్ వదిలి జనంలోకి వెళ్లు'
హైదరాబాద్: తెలంగాణలో చట్టబద్ధ పాలన సాగడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని కేసీఆర్ సర్కారు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిల్ వేయాలని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ ను వదిలి జనంలోకి వెళ్లి ప్రజాసమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలు పెంచుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. అవినీతి సొమ్ముతోనే ఇతర పార్టీల నేతలను కొంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్ కేసీఆర్ కుబుంబ సొమ్ము కాదు, ప్రజల సొమ్మున్నారు. గాంధీభవన్ లో మున్సిపల్ ప్రతినిధుల శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ శిక్షణా కార్యక్రమాన్ని రెండేళ్ల కిందటే నిర్వహించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పార్టీ పెద్దలు భరోసా కల్పించనందు వల్లే మున్సిపల్ చైర్మన్లు పార్టీ మారారని అన్నారు. -
‘భూ’చోళ్లకు అండ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ప్రభుత్వం పంపిణీ చేసిన భూ ములకే దిక్కు లేకుండా పోయింది. సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు గిరిజనులకు పంపిణీ చేసిన భూములు తమవేనంటూ ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు బడాబాబులకు వ త్తాసు పలుకుతున్నారు. వివరాలు ఇలా.. మెదక్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన హఫీజా బేగంకు అదే గ్రామంలో ఒకటి నుంచి 51 సర్వే నంబర్లలో 920 ఎకరాల భూమి ఉండే ది. దీన్ని 1960లో నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సూర్యారావు, తో పాటు మరో 5 మంది కొనుగోలు చేసి పట్టా చేయిం చుకున్నారు. అయితే సాగు చేయలేదు. సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇంత భూమి ఉండరాదు. దీంతో ప్రభుత్వం కొంత భూమిని స్వా ధీనం చేసుకుంది. కొంత కాలం తరువా త ఈ భూమిని పేద గిరి జనులకు పంపిణీ చేసింది. 63 మంది గిరిజనులకు 71.02 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. పట్టాలు కూడా ఇచ్చింది. 13 బీ కింద మరి కొందరిని హక్కుదారులను చేసిం ది. తరతారాలుగా ఇదే భూమినే నమ్ముకొని గిరిజనులు బతుకుతున్నా రు. ఇంత వరకు బాగున్నా సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోన వారి కుటుంబ సభ్యులు ఇప్పడు అనంతసాగర్‌కు వచ్చి పేదల భూములు తమవే నంటూ లాక్కోవ డం మొదలు పెట్టారు. బాధితులకు అండగా నిలబడాల్సిన రెవెన్యూ అధికారులు పెద్దల పంచన చేరారు. ఎప్పుడో భూము లు విడిచి వెళ్లిపోయిన మాజీ ఎమ్మె ల్యే నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, బషీరుద్దీన్ వారసులు అధికారుల అండదండలతో పేదల భూమిని ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంతేకాకుండా విక్రయాలు కూడా జరిపారు. ప్రభుత్వ ఇచ్చిన పట్టాలను గిరిజనులు పోగొట్టుకోవడంతోనే సమస్య మొదలైంది. వారి వద్ద పట్టాలు లేవన్న విషయం తెలుసుకొనే సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోయిన వారు పాత రికార్డులను చూపి స్థలాలను ఆక్రమించుకుంటున్నట్లు తెలిసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 27లో దాదాపు 370 ఎకరాల భూమి, సర్వే నంబర్ 36,51లో 350 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిలోని కొంత భాగాన్ని గిరి జనులు సాగు చేసుకుంటున్నారు. దాదాపు 71.02 ఎకరాల భూమిని అధికారికంగా హక్కులు పొంది సాగు చేసుకుంటున్నారు. 13/బీ కింద అప్పటిప్రభుత్వం ఒక్కొక్కరికి 1.10 గుంటల చొప్పున భూమి కేటాయించి పట్టాలు ఇచ్చింది. పాసు పుస్తకాలను మెదక్ ఏడీబీలో తనఖా పెట్టి రైతులు రుణాలు కూడా పొందారు. చట్టంలో ఇలా... భూ సీలింగ్ చట్టం 1973 ప్రకారం అనంతసాగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 24లో 6.46 ఎకరాలు ప్రొసిడింగ్ నెంబర్ సీఆర్/6497/1978లో ఐదు మందికి, 1985వ సంవత్సరంలో 2394/ఎస్జీడీ/75 ప్రొసిడింగ్ సీసీ నెంబర్‌తో సర్వేనంబర్ 27లో 42.36 ఎకరాల భూమిని 41 మంది గిరిజనులకు, 1991లో సర్వే నంబర్ 27లో ప్రొసిడింగ్ నెంబర్ డీ/5676/91 ఉత్తర్వుతో 22.25 ఎకరాల భూమిని 17 మంది లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే నిజమైన పట్టాదారులు గిరిజనులే. మొత్తం 71.02 ఎకరాల్లో తిమ్మాయిపల్లి, శేరిశంకర్ తండా, అప్పటి అనంతసాగర్ గ్రామాలకు చెందిన దాదాపు 63 మంది దళిత, గిరిజనులకు పట్టాలు చేశారు. గతంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన డాక్టర్ శరత్ గిరిజనుల భూముల్లో వారిని కూర్చోబెట్టి, హక్కు పత్రాలు సిద్ధం చేసి ఇవ్వాలని తహశీల్దారు విజయలక్ష్మిని ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఆదేశాలు అమలు కాకపోవటం గమనార్హం. ఏ ఒక్క హక్కు పత్రం ఉన్నా చాలు భూములకు సంబంధించిన ఏ ఒక్క హక్కు పత్రం ఉన్నా సరే తిమ్మాయిపల్లి దళిత, గిరిజనులు తనను సంప్రదించవచ్చు. వాటి ఆధారంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి పట్టా చేయిస్తాం. రెవెన్యూ రికార్డుల్లో ఆధారాలు ఉంటే గిరిజనుల భూ హక్కులకు ఎలాంటి ఢోకా ఉండదు. పరిశీలించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది. ఆర్డీవో మెంచు నగేష్