‘భూ’చోళ్లకు అండ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ప్రభుత్వం పంపిణీ చేసిన భూ ములకే దిక్కు లేకుండా పోయింది. సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు గిరిజనులకు పంపిణీ చేసిన భూములు తమవేనంటూ ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు బడాబాబులకు వ త్తాసు పలుకుతున్నారు. వివరాలు ఇలా.. మెదక్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన హఫీజా బేగంకు అదే గ్రామంలో ఒకటి నుంచి 51 సర్వే నంబర్లలో 920 ఎకరాల భూమి ఉండే ది. దీన్ని 1960లో నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సూర్యారావు, తో పాటు మరో 5 మంది కొనుగోలు చేసి పట్టా చేయిం చుకున్నారు. అయితే సాగు చేయలేదు.
సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇంత భూమి ఉండరాదు. దీంతో ప్రభుత్వం కొంత భూమిని స్వా ధీనం చేసుకుంది. కొంత కాలం తరువా త ఈ భూమిని పేద గిరి జనులకు పంపిణీ చేసింది. 63 మంది గిరిజనులకు 71.02 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. పట్టాలు కూడా ఇచ్చింది. 13 బీ కింద మరి కొందరిని హక్కుదారులను చేసిం ది. తరతారాలుగా ఇదే భూమినే నమ్ముకొని గిరిజనులు బతుకుతున్నా రు. ఇంత వరకు బాగున్నా సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోన వారి కుటుంబ సభ్యులు ఇప్పడు అనంతసాగర్‌కు వచ్చి పేదల భూములు తమవే నంటూ లాక్కోవ డం మొదలు పెట్టారు.
బాధితులకు అండగా నిలబడాల్సిన రెవెన్యూ అధికారులు పెద్దల పంచన చేరారు. ఎప్పుడో భూము లు విడిచి వెళ్లిపోయిన మాజీ ఎమ్మె ల్యే నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, బషీరుద్దీన్ వారసులు అధికారుల అండదండలతో పేదల భూమిని ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంతేకాకుండా విక్రయాలు కూడా జరిపారు. ప్రభుత్వ ఇచ్చిన పట్టాలను గిరిజనులు పోగొట్టుకోవడంతోనే సమస్య మొదలైంది. వారి వద్ద పట్టాలు లేవన్న విషయం తెలుసుకొనే సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోయిన వారు పాత రికార్డులను చూపి స్థలాలను ఆక్రమించుకుంటున్నట్లు తెలిసింది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 27లో దాదాపు 370 ఎకరాల భూమి, సర్వే నంబర్ 36,51లో 350 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిలోని కొంత భాగాన్ని గిరి జనులు సాగు చేసుకుంటున్నారు. దాదాపు 71.02 ఎకరాల భూమిని అధికారికంగా హక్కులు పొంది సాగు చేసుకుంటున్నారు. 13/బీ కింద అప్పటిప్రభుత్వం ఒక్కొక్కరికి 1.10 గుంటల చొప్పున భూమి కేటాయించి పట్టాలు ఇచ్చింది. పాసు పుస్తకాలను మెదక్ ఏడీబీలో తనఖా పెట్టి రైతులు రుణాలు కూడా పొందారు.
చట్టంలో ఇలా...
భూ సీలింగ్ చట్టం 1973 ప్రకారం అనంతసాగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 24లో 6.46 ఎకరాలు ప్రొసిడింగ్ నెంబర్ సీఆర్/6497/1978లో ఐదు మందికి, 1985వ సంవత్సరంలో 2394/ఎస్‌జీడీ/75 ప్రొసిడింగ్ సీసీ నెంబర్‌తో సర్వేనంబర్ 27లో 42.36 ఎకరాల భూమిని 41 మంది గిరిజనులకు, 1991లో సర్వే నంబర్ 27లో ప్రొసిడింగ్ నెంబర్ డీ/5676/91 ఉత్తర్వుతో 22.25 ఎకరాల భూమిని 17 మంది లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి.
ఈ లెక్కన చూస్తే నిజమైన పట్టాదారులు గిరిజనులే. మొత్తం 71.02 ఎకరాల్లో తిమ్మాయిపల్లి, శేరిశంకర్ తండా, అప్పటి అనంతసాగర్ గ్రామాలకు చెందిన దాదాపు 63 మంది దళిత, గిరిజనులకు పట్టాలు చేశారు. గతంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన డాక్టర్ శరత్ గిరిజనుల భూముల్లో వారిని కూర్చోబెట్టి, హక్కు పత్రాలు సిద్ధం చేసి ఇవ్వాలని తహశీల్దారు విజయలక్ష్మిని ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఆదేశాలు అమలు కాకపోవటం గమనార్హం.
ఏ ఒక్క హక్కు పత్రం ఉన్నా చాలు
భూములకు సంబంధించిన ఏ ఒక్క హక్కు పత్రం ఉన్నా సరే తిమ్మాయిపల్లి దళిత, గిరిజనులు తనను సంప్రదించవచ్చు. వాటి ఆధారంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి పట్టా చేయిస్తాం. రెవెన్యూ రికార్డుల్లో ఆధారాలు ఉంటే గిరిజనుల భూ హక్కులకు ఎలాంటి ఢోకా ఉండదు. పరిశీలించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది.
ఆర్డీవో మెంచు నగేష్