land conflicts
-
భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా..
కోహీర్(జహీరాబాద్): పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కాపుకాచి కత్తులతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోహీర్ మండలం మద్రి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. మద్రి గ్రామానికి చెందిన ఎండీ జహీర్ (45) ఆదివారం మధ్యాహ్నం తన అన్న సలీంతో కలిసి ఫార్చునర్ వాహనంలో గ్రామ శివారులోని పొలానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మధ్యలో ఆగి చెట్ల నీడలో సేదదీరుతున్నారు. ఇదే అదనుగా దుండగులు కత్తులతో దాడి చేసి తలపై నరికారు. తీవ్రంగా గాయపడిన జహీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సలీం గాయాలతో తప్పించుకున్నాడు. వీరి మధ్య ఉన్న భూతగాదాలు, పాత కక్షలే హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. హత్య చేసిన అనంతరం దుండగులు పారిపోతున్న వాహనం మద్రి–గురుజువాడ గ్రామాల మధ్య కారును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. వాహనంలో నుంచి ఎలాగోలా బయటపడిన దుండగులు పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీఐ రాజశేఖర్, కోహీర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్య కాపురానికి రావడం లేదని.. -
భూవివాదంలో తుపాకీతో రెచ్చిపోయిన జవాన్
-
భూ తగాదాలలో యువకుడు బలి
చాట్రాయి(కృష్ణా జిల్లా): భూమి విషయమై జరిగిన ఘర్షణలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన పావన వరప్రసాద్, పావన సత్యనారాయణల మధ్య కొంతకాలంగా భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం కూడా పొలంలో వారికి తగవు జరిగింది. తరువాత ఇరు కుటుంబాల సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అనంతరం సాయంత్రం సత్యనారాయణ భార్య సీతామహాలక్ష్మి, కొడుకు నాగకల్యాణ కుమార్ కలసి వరప్రసాద్ కుమారుడు పవన్‌కుమార్, వెంకటరమణలపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో పవన్‌కుమార్(17) అక్కడికక్కడే మృతి చెందగా వెంకట రమణకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను 108 వాహనం ద్వారా నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి జరుగుతున్న సమయంలో పవన్ తమ్ముడు సాయికుమార్‌ను ఇరుగుపొరుగు వారు దాచటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, నిందితులు పావన సత్యనారాయణ, సీతామహలక్ష్మి, నాగకల్యాణకుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.