land use plan
-
టీఎస్ బీపాస్ ద్వారా ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్
సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో భూములను కొనుగోలు చేసిన వారికి ఉపయో గపడేలా ల్యాండ్ యూజ్ స్టేటస్‌ను తెలుసుకునే విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ అందుబాటు లోకి తెచ్చింది. భూ కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన భూమి మాస్టర్ ప్లాన్‌లోని ఏ కేటగిరీ పరిధిలో ఉందో టీఎస్–బీపాస్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించింది. ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ (భూమి వినియోగ పత్రం)ను టీఎస్–బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసు కొని, నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికెట్ పొందే వీలును మున్సిపల్, పట్టణ పరిపాలన శాఖ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ లాండ్ యూజ్ సర్టిఫి కెట్ పొందే తీరును ట్విట్టర్ వేదికగా తెలిపారు. తమకు అవస రమైన సేవలు కావాల్సిన వారు https://lui. tsbpass.telangana.gov.inతమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే నంబర్ నమోదు చేసి, తగిన రుసుము చెల్లిస్తే ఆ భూమికి సంబంధించిన ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ ఇస్తారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఈ సర్టిఫికెట్ పొందే సేవలు అందుబాటులో ఉన్నాయి. -
ఏపీ సర్కారుకు కేంద్ర అటవీ కమిటీ ఝలక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ సలహా కమిటీ నుంచి చుక్కెదురైంది. హరిత రాజధానిగా అమరావతిని నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించడానికి కమిటీ నిరాకరించింది. భూ వినియోగ ప్రణాళికతోపాటు అఫారెస్టేషన్ (తొలగించిన మేర అటవీ ప్రాంతాన్ని మరోచోట పునర్ నిర్మించే) పథకాన్ని సమర్పించే వరకు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపబోమని స్పష్టం చేసింది. నూతన రాజధాని నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీకి 13,267.12 ఎకరాల అటవీభూమిని మళ్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కోరింది. ఇందుకోసం ఏప్రిల్ 25న సవరించిన ప్రతిపాదనలను సమర్పించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే అటవీ సలహా కమిటీ (ఎఫ్ఏసీ) ఈ ప్రతిపాదనలను జూలై 12న పరిశీలించి.. తాజా సమావేశంలో సమగ్రంగా చర్చించింది. భూవినియోగ ప్రణాళికతోపాటు ఇతర నిబంధనల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ భేటీలో ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఇందుకు నిరాకరించిన ఎఫ్ఏసీ.. సమగ్ర భూవినియోగ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తమకు తప్పకుండా సమర్పించాల్సిందేనని స్పష్టంచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.