Language Pundits
-
ఆగస్టు 3 నుంచి డీఈడీ ఫస్టియర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 8వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. 2018–2020 బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా పరీక్షలకు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంటలో ఇస్తారని డైరెక్టర్ తెలిపారు. ఎల్పీటీ పరీక్ష ఫలితాలు విడుదల సాక్షి, అమరావతి: 2018–19 బ్యాచ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ విద్యార్థులకు, అంతకు ముందు ఫెయిలైన వారికి జనవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 95.31 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. తమ కార్యాలయ వెబ్సైట్లో ఫలితాలను పొందుపరిచినట్లు చెప్పారు. రీ కౌంటింగ్ కోసం జూన్ 15లోగా ఏపీసీఎఫ్‌ఎంఎస్‌లో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. -
భాషా పండితులు అప్ గ్రేడ్‌కు ఓకే చెప్పిన కేసీఆర్
సాక్షి, హైదరాబాదు : రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పీఈటీల పోస్టులను.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు భాషా పండితుల పోస్టులను అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్ 2 పండిట్ల పోస్టులుండవన్నారు అధికారులు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది భాషా పండితులకు మేలు జరుగుతుందని తెలిపారు. భాషా పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వమిచ్చిన ఉత్తర్వుల పట్ల టీచర్ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్థన్ రెడ్డి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ప్రగతి భవన్లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. భాషా పండితుల చిరకాల కోరికను కేసీఆర్ నెరవేర్చారన్నారు. విద్యారంగ చరిత్రలో ఇదొక అపూర్వ నిర్ణయంగా నిలిచిపోతుందని అభిప్రాయ పడ్డారు. సీఎం కేసీఆర్‌కు తెలుగు భాషపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు. -
ఎట్టకేలకు డీఎస్సీ !
సాక్షి, చిత్తూరు: ఎట్టకేలకు నాలుగు వాయిదాల అనంతరం ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు సన్నదమైంది. డీఎస్సీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేసింది మే 9,10,11 తేదీల్లో డీఎస్సీకి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమరుుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది బీఈడీ, డీఈడీతో పాటు లాంగ్వేజ్ పండిట్స్ తదితరులు డీఎస్సీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. తాజాగా గురువారం విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి తేదీలను ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠకు తెరపడింది. చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్‌కు సంబంధించి 221 పోస్టులు ఖాళీగా ఉండగా, సెకెండరీ గ్రేడ్‌కు సంబంధించి 1194 పోస్టులున్నాయి. ఇంకా లాంగ్వేజ్ పండిట్స్ 182 ఉండగా, పీఈటీలకు సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 1606 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 30 బీఈడీ కళాశాలలు, 48 డీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏడాదికి 15వేలకు పైచిలుకు విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. రెండు సంవత్సరాలుగా డీఎస్సీ జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 35 నుంచి 40వేల మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. మాట మార్చిన విద్యాశాఖ మంత్రి ఎన్నికల సమయంలో డీఎస్సీకి సంబంధించి బీఈడీ, డీఈడీ అన్న తేడా లేకుండా అందరికీ అర్హత కల్పిస్తామని బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని ప్రకటించిన మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఆ తరువాత మాట మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన మంత్రి ఐదు నెలలు దాటుతున్నా ఆ పని చేయలేదు. టెట్ లేకుండా చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పడెమో టెట్ కాకుండా తాజాగా ఉమ్మడి పరీక్షా విధానంతో డీఎస్సీ నిర్వహిస్తామని ఉపాధ్యాయులను ఎంపిక చేస్తామంటూ కొత్తగా ప్రకటిస్తున్నారు. చివరికి ఏమీ చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు.