పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 8వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. 2018–2020 బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా పరీక్షలకు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంటలో ఇస్తారని డైరెక్టర్ తెలిపారు.
ఎల్పీటీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: 2018–19 బ్యాచ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ విద్యార్థులకు, అంతకు ముందు ఫెయిలైన వారికి జనవరిలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 95.31 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. తమ కార్యాలయ వెబ్‌సైట్లో ఫలితాలను పొందుపరిచినట్లు చెప్పారు. రీ కౌంటింగ్ కోసం జూన్ 15లోగా ఏపీసీఎఫ్‌ఎంఎస్‌లో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment