రీవాల్యుయేషన్ దరఖాస్తుకు 18న తుదిగడువు
ఎస్కేయూ : డిగ్రీ ఫైనలియర్ రెగ్యులర్ , మొదటి, రెండో సంవత్సరం సప్లమెంటరీ విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 18న తుది గడువుగా నిర్ణయించినట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు గురువారం తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ. 350 ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో పేపర్‌కు ప్రత్యేకంగా ఫీజు చెల్లించాలన్నారు. ఎస్కేయూ ఎస్బీఐలో తీసిన చలానాలు మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు.
10న ఇన్స్టంట్ పరీక్ష : డిగ్రీలో ఒకే దఫా ఉతీ్తర్ణులై ఒక సబ్జెక్టు ఫైనలియర్లో ఫెయిల్ అయిన విద్యార్థికి ఇన్స్టంట్ పరీక్ష ఈ నెల 10న నిర్వహించనున్నారు. ఫీజు రూ. 1500గా నిర్ణయించారు. తుది గడువు ఈ నెల 6 తో ముగియనుంది.