late fee
-
49th GST Council Meeting: జీఎస్టీ ఫైలింగ్ ఆలస్య రుసుము తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్ ఆలస్య రుసుమును హేతుబద్ధీకరిస్తూ జీఎస్టీ మండలి 49వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను నమోదిత వ్యక్తులు ఫామ్ జీఎస్టీఆర్–9కు సంబంధించి రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉంటే ఆలస్య రుసుము రోజుకు రూ.50, రూ.5–20 కోట్ల టర్నోవర్ ఉంటే రోజుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుము రూ.200 ఉంది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఫామ్ జీఎస్టీఆర్–4, ఫామ్ జీఎస్టీఆర్–9, ఫామ్ జీఎస్టీఆర్–10లో పెండింగ్‌లో ఉన్న రిటర్నులకు సంబంధించి షరతులతో కూడిన మినహాయింపు లేదా ఆలస్య రుసుము తగ్గించడం ద్వారా క్షమాభిక్ష పథకాలను జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహార బకాయిలు.. 2022 జూన్‌కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలు రూ.16,982 కోట్లు, అలాగే ఆరు రాష్ట్రాలకు మరో రూ.16,524 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. కేంద్రం తన సొంత వనరుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకుందని, భవిష్యత్తులో పరిహార రుసుము వసూళ్ల నుంచి ఈ మొత్తాన్ని తిరిగి పొందుతామని ఆమె చెప్పారు. దీంతో జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఐదేళ్ల కాలానికి తాత్కాలికంగా అనుమతించదగిన మొత్తం పరిహార బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాలు వారి అకౌంటెంట్ జనరల్ నుంచి సర్టిఫికేట్లను ఇచ్చినప్పుడు పెండింగ్‌లో ఉన్న ఏవైనా పరిహార రుసుము మొత్తాలను వెంటనే క్లియర్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిహార బకాయి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు సమకూరనున్నాయి. బెల్లం పానకంపై తగ్గింపు.. ఇక విడిగా విక్రయించే బెల్లం పానకంపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ప్యాక్, లేబులింగ్ చేసి బెల్లం పానకం విక్రయిస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెన్సిల్ షార్ప్నర్స్కు 18 శాతం నుంచి జీఎస్టీని 12 శాతానికి చేర్చారు. పన్ను ఎగవేతలను ఆరికట్టడంతోపాటు పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు వంటి వస్తువుల నుండి ఆదాయ సేకరణను మెరుగుపరచడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సులను జీఎస్టీ మండలి ఆమోదించింది. -
చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంది. గడువు దాటి దాఖలు చేసే రిటర్నులపై రుసుము, వడ్డీ భారాన్ని తగ్గించింది. రూ.5 కోట్ల వరకు వార్షిక ఆదాయం కలిగిన సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే, వడ్డీ రేటును సగానికి (18 శాతం నుంచి 9 శాతానికి) తగ్గిస్తూ శుక్రవారం జరిగిన భేటీలో నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దాఖలు చేసే రిటర్నులకు ఈ తగ్గింపు అమలవుతుంది. ఇక ఈ ఏడాది మే, జూన్, జూలై నెలలకు సంబంధించిన రిటర్నులను ఎటువంటి వడ్డీ భారం లేకుండానే సెప్టెంబర్ వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం వెల్లడించారు. లాక్డౌన్ అమలైన ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీఎస్టీ ఆదాయం ఏ మేరకు ఉండొచ్చన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. 45 శాతం వరకు ఉండొచ్చన్నారు. టెక్స్టైల్స్, ఫుట్‌వేర్, ఫెర్టిలైజర్స్‌కు సంబంధించి జీఎస్టీ హేతుబద్ధీకరణపై నిర్ణయాన్ని కౌన్సిల్ వాయిదా వేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో.. పన్ను చెల్లించాల్సిఉండి, జీఎస్టీఆర్–3బీ రిటర్నులను 2017 జూలై 1 నుంచి 2020 జనవరి కాలానికి ఆలస్యంగా దాఖలు చేసినట్టయితే అప్పుడు గరిష్ట ఆలస్యపు రుసుము రూ.500గానే ఉంటుంది. ప్రతి నెలా రిటర్నుపై రూ.500 చొప్పున అమలవుతుంది. ఇప్పుడున్న రూ.10,000 రుసుముతో పోలిస్తే భారీ గా తగ్గింది. అదేవిధంగా ఇదే కాలానికి పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని సంస్థలు రిటర్నులు ఆలస్యం గా దాఖలు చేసినా ఆలస్యపు రుసుము ఉండదు. కాంపెన్సేషన్ సెస్సుపై జూలైలో నిర్ణయం రాష్ట్రాలకు పరిహారంగా చెల్లించే ‘కాంపెన్సేషన్ సెస్సు’పై ప్రత్యేకంగా చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో మరోసారి భేటీ కానుంది. కేంద్రం గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి కాలానికి రాష్ట్రాలకు పరిహారంగా రూ.36,400 కోట్లను విడుదల చేసినప్పటికీ.. వాస్తవ అంచనాలతో పోలిస్తే ఇంకా లోటు నెలకొంది. మార్చి నెల కు సంబంధించి రూ.12,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. దీంతో మార్కెట్ నుంచి రుణాలు తీసుకుని అయినా తమకు చెల్లించాలని రాష్ట్రాలు కోరాయి. పరోటాలపై జీఎస్టీ 18% న్యూఢిల్లీ: తినడానికి సిద్ధంగా ఉండే (రెడీ టు ఈట్) పరోటాలను మానవ వినియోగానికి వీలుగా మరింత ప్రాసెస్ (సిద్ధం చేసుకోవడం) చేసుకోవాల్సి ఉంటుందని.. కనుక వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ స్పష్టం చేసింది. హోల్ వీట్ పరోటా, మలబార్ పరోటాలను జీఎస్టీలోని చాప్టర్ 1905కింద గుర్తించి 5 శాతం జీఎస్టీ అమలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ సంస్థ ఏఏఆర్ను ఆశ్రయించగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. చాప్టర్ 1905 లేదా 2106లో పేర్కొన్న షరతులను నెరవేర్చిన ఉత్పత్తులకే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందంటూ, అవి ఖాఖ్రా, సాధారణ చపాతీ లేదా రోటి అయి ఉండాలని ఏఏఆర్ స్పష్టం చేసింది. -
నిఘా నీడలో తెలంగాణ ఎంసెట్
14న ఎంసెట్‌కు భారీ ఏర్పాట్లు హైటెక్ కాపీయింగ్ నిరోధానికి పక్కా చర్యలు పరీక్ష కేంద్రాల్లోకి వాచ్‌లను కూడా అనుమతించరు పదేపదే ఎంసెట్ రాసేవారిపై ప్రత్యేక దృష్టి ‘సాక్షి’తో ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్-2015కు పెద్ద ఎత్తున నిఘా, భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. గతంలో కంటే అత్యధికంగా దరఖాస్తులు రావడంతో పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాచీల్లో స్కానర్లు వస్తున్నందున ఈసారి వాటిని కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించ మని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పదే పదే రాసే అనుమానితులపై పోలీసు నిఘా పెట్టామన్నారు. ఎంసెట్ నిర్వహణ ఏర్పాట్లపై కన్వీనర్ రమణరావు ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. రికార్డు స్థాయిలో దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతంలో తెలంగాణ జిల్లాల నుంచి 1.80 లక్షల దరఖాస్తులు మాత్రమే రాగా, ఈసారి 2.31,956 దరఖాస్తులు వచ్చాయి. ఇంజనీరింగ్ కోసం 1,39,605 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,351 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 41 వేల మంది ఉండగా, ఇతర రాష్ట్రాల వారు మరో 9 వేల మంది ఉన్నారు. మెడిసిన్ రాసే వారిపై ప్రత్యేక దృష్టి పదే పదే ఎంసెట్ రాస్తున్న వారిపై, రూ. 5 వేల ఆలస్య రుసుము, రూ. 10 ఆలస్య రుసుముతో ఎంసెట్‌కు దరఖాస్తు చేస్తున్న వారిపై ప్రత్యేకంగా పోలీసుల నిఘా ఉంటుంది. ఆ వివరాలను ఇప్పటికే రెవెన్యూ, ఇంటెలిజెన్స్, పోలీసు ఉన్నతాధికారులకు అందజేశాం. గతంలో ఎంసెట్ రాసి, మంచి ర్యాంకు సాధించినా మళ్లీ ఇపుడు ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసిన వారి వివరాలను అందజేశాం. గతంలోనే మంచి ర్యాంకు వచ్చినా ఇపుడు మళ్లీ ఎందుకు రాస్తున్నారన్న కోణంలో పరిశీలన ఉంటుంది. 20 ఏళ్ల కిందట ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఇపుడు ఎందుకు ఎంసెట్ దరఖాస్తు చేశారు. ఏ ఉద్దేశంతో రాస్తున్నారు? ఎవరి కోసమైనా రాస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతారు. అంతేకాదు ప్రతి విద్యార్థి చేతి వేళ్ల ముద్రలు పూర్తిగా తీసుకుంటాం. ముఖ్యంగా ఈసారి మెడిసిన్ పరీక్షకు హాజరయ్యే వారిపై ప్రత్యేక దృష్టి సారించాం.