మాజీ సీఎం అల్లుడు అరెస్ట్
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అల్లుడు సయిద్ మహ్మద్ ఇమ్రాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గృహహింస కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. షీలా కుమార్తె లతిక దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేశారు.
బెంగళూరులోని అల్సూర్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు నవంబర్ 7న ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఇటీవలే బారాఖాంబా పోలీసుస్టేషన్ లతిక ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్, లతిక పది నెలల నుంచి విడిగా ఉంటున్నారు.