ఒంగోలులో సినీనటి ప్రణీత
ఒంగోలు: ప్రముఖ సినీ నటి ప్రణీత ఒంగోలులో సందడి చేశారు. ఒంగోలులో కాంచిపురం తొలి షోరూంను ప్రారంభించారు. వైవిధ్యానికి, విలక్షణ సోయగానికి పేరొందిన కాంచిపురం వస్త్రాల కోసం కాంచిపురం వెళ్లకుండా ఒంగోలులోనే లభ్యమవుతాయని ప్రణీత ఈ సందర్భంగా అన్నారు. వివిధ కాంచిపురం పట్టు చీరలు ధరించి ప్రణీత ప్రదర్శించారు. శనివారం ఒంగోలు వచ్చిన ప్రణీతను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.
అనంతరం మేనేజ్మెంట్ తుమ్మేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒంగోలు కళానికేతన్ షోరూంలో ఏర్పాటు చేసిన కాంచిపురం వీఆర్కే సిల్క్స్లో వస్త్రాలు వీవర్ల ధరలకు లభిస్తాయని, చిన్న తరహా రిటైల్ షాపులకు, ఇంటి వద్ద చీరలు విక్రయించే వారికి కాంచిపురం చీరలు వరాల వంటివని అభివర్ణించారు. మరో మేనేజర్ చలసాని విజయ్ మాట్లాడుతూ హత్తుకునే చక్కటి అమరిక, డిజైన్లు, విస్తృత శ్రేణి వర్ణాలతో కూడిన వస్త్రాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కొనుగోలుదారులకు అవసరాలను బట్టి బడ్జెట్‌కు అనుగుణంగా రూ.695 నుంచి ప్రారంభమై రూ.2 లక్షల వరకు వివిధ శ్రేణుల్లో అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు.