law suits
-
డబ్బు కోసం అన్నపైనే లైంగిక ఆరోపణలు!?
సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించాడు. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈలోపు.. రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఆయన్ని కోర్టుకీడ్చింది. అయితే.. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని.. పైగా డబ్బు కోసమే ఈ చర్యకు దిగిందని ఆయన అంటన్నారు. ఈ మేరకు కుటుంబంతో సహా సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారాయన.దాదాపు దశాబ్ద కాలంగా తన సోదరుడు శామ్ (Sam Altman) తనపై లైంగిక వేధింపులకు పాల్పడాడంటూ ఆన్ ఆల్ట్‌మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటినుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఆమె ఈ తరహా ఆరోపలు చేయడం ఇదేం కొత్త కాదు. కాకుంటే ఈసారి దావా వేయడంతో శామ్ ఆల్టమన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామంపై ఆయన ఏమన్నారంటే..‘‘ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శామ్‌పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది... ఆమె గోప్యత దృష్ట్యా మేం దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె శామ్‌పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని.. సొంత కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెబుతోంది. ఇవన్నీ అవాస్తవం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబగోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆల్ట్‌మన్ కుటుంబం తమ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఆరోపణలు చేసిన అన్నే ఆల్ట్‌మన్(Annie Altman).. ఆ కుటుంబానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే తనపై జరిగిన లైంగిక దాడికి గానూ శ్యామ్‌ను విచారించాలని, అలాగే తనకు జరిగిన నష్టానికి గానూ 75వేల డాలర్ల పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టుకు కోరారు.‘‘మిస్సోరీలోని క్లేటన్లో గల మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడేళ్లు. శామ్కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో’’ అని శామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సీఈఓగా హారిస్ శామ్ ఆల్టమన్ ప్రపంచానికి సుపరిచితుడే. ఏఐ బూమ్‌లో ఈయనొక ప్రముఖుడు. తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్కాగా, తల్లి డెర్మటాలజిస్ట్. ఈ జంటకు నలుగురు పిల్లలు కాగా, శామ్ పెద్దోడు. తనను తాను గేగా ప్రకటించుకున్న శామ్.. కిందటి ఏడాది జనవరిలో తన బాయ్‌ఫ్రెండ్ అలీవర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మద్దతు క్యాంపెయిన్‌కు మద్దతుగా విరాళం కూడా ఇచ్చాడు.ఇక.. గత ఏడాది ఓపెన్ఏఐ ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. తాజాగా.. ఓపెన్ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద మృతి కేసు కూడా ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: అద్భుతాలు చేస్తాడనుకున్నాం కానీ,.. సుచీర్ బాలాజీ తల్లిదండ్రుల రోదన -
భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..
చాలా విచిత్రమైన కేసులు చూసుంటాం. ఇలాంటి విచిత్రమైన కేసు చూసే అవకాశం లేదు. అవకాశం దొరకాలే కానీ చిన్న కారణంతో అవతల వాళ్లని ఇబ్బంది పెట్టి డబ్బులు గుంజాలని చూస్తుంటారు కొందరూ. అలాంటి కోవకు చెందని వాడే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ వ్యక్తి. ఎంత విచిత్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కాడో వింటే ఆశ్చర్యపోతారు. కేసు నిలబడుతుందనుకున్నాడో, తన వాదన నెగ్గుతుందనో తెలియదు చాలా హాస్యస్పదమైన ఆరోపణలతో కేసు వేశాడు. చివరికీ ఏమైందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తి అనిల్ కొప్పుల అనే వ్యక్తి భార్యకు 2018లో రాయల్ ఉమెన్స్ హాస్పటల్స్ సీజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. అక్కడ ఆస్పత్రి నిబంధనల ప్రకారం భార్య ఆపరేషన్ టైంలో భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పేలా ప్రోత్సహిస్తారు. అతడు కూడా ఆపరేషన్ థియోటర్లో వైద్యుల తోపాటే ఉన్నాడు. అప్పటి నుంచి మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాను. మానసిక అనారోగ్యానకి గురయ్యాను. ఆ ఆపరేషన్‌లో నా భార్య అంతర్గత అవయవాలు, బ్లీడింగ్ చూడటం కారణంగా తన వైవాహిక జీవితం కూడా సరిగా లేదని ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కాడు అనిల్ కొప్పుల. తన మానసికా ఆరోగ్యం, వైవాహిక జీవితం దెబ్బతినడానికి కారణమైన సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడమే గాక అందుకు ప్రతిగా రూ. 5వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసు పెట్టాడు. సోమవారం విక్టోరియాలోని సుప్రీం కోర్టు వాదోపవాదనలు విన్నాక తల్లి బిడ్డల సంరక్షణ విషయమై వైద్యులు సీజేరియన్ ఆప్షన్ ఎంచుకుంటారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం భర్తను థియెటర్లోని అనుమతించడం అనేది కూడా సర్వసాధారణ విషయం. దీని వల్ల అతను ఎలాంటి ఆర్థిక నష్టాన్ని చవిచూడలేదు. పైగా అతను ఆరోపిస్తున్న మానసికి అనారోగ్యం అనేది తీవ్రమైన గాయం కింద పరిగణించేది కాదని తేల్చి చెప్పింది. అందువల్ల అతనికి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ..కోర్టు అతడి కేసుని తోసిపుచ్చింది. (చదవండి: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..? తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..) -
ఎలన్ మస్క్‌కు చుక్కలు చూపిస్తున్నారు!
శాన్ఫ్రాన్సిస్కో: టెస్లా, ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ట్విటర్ సంస్థ నుంచి ఉద్యోగాల తొలగింపు నేపథ్యంలో ఆయన్ని కోర్టుకు లాగాలని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలన్ మస్క్ ట్విటర్ బాధ్యతలు చేపట్టాక.. సగం మంది ఉద్యోగులను(సుమారు 7,500 మందిని) సంస్థ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాపార దిగ్గజాన్ని కోర్టుకు ఇచ్చేందుకు వాళ్లంతా యత్నిస్తున్నారు. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో వందల సంఖ్యలో దావాలు దాఖలు అయ్యాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా. అంతేగాక.. ఆఫీస్‌లోనే పడుకోవాలంటూ బెడ్రూమ్లను ఏర్పాటు చేస్తుండడంపైనా కోర్టుకు ప్రైవేట్ ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ధనికుడైన ఎలన్ మస్క్.. ఉద్యోగుల హక్కుల్ని కాలరాసేయడంతో పాటు చట్టాన్ని అనుసరించకపోవడం దారుణమని లాయర్ షాన్నోన్ లిస్ రియోర్డన్ పేర్కొంటున్నారు. ట్విటర్ నుంచి ఉద్వాసన తర్వాత.. వాళ్లకు అందాల్సిన ప్రతిఫలాలు అందకపోవడంతో.. షాన్నోన్ ద్వారా దావా వేయించారు కొందరు మాజీ ఉద్యోగులు. చట్టమైన పోరాటం ఎలన్ మస్క్‌కు కొత్తేం కాదు. కానీ, ఇలా వందల సంఖ్యలో దావాలు దాఖలు అవుతుండడంపై కాస్త ఉత్కంఠ నెలకొంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫేస్‌బుక్‌కు గట్టి షాక్
-
ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇంక్‌పై యూఎస్‌లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూఎస్ ప్రభుత్వంతోపాటు.. 48 రాష్ట్రాలు ఫేస్‌బుక్‌పై లాసూట్స్ను దాఖలు చేశాయి. మార్కెట్ శక్తిగా ఎదిగిన ఫేస్బుక్ పోటీని తప్పించుకునేందుకు పలు మార్గాలలో ప్రయత్రిస్తున్నట్లు ఆరోపిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. పోటీ సంస్థల విషయంలో కొనేయ్ లేదా భూస్థాపితం చెయ్ (బయ్ ఆర్ బ్యరీ) వ్యూహాలను ఫేస్బుక్ అనుసరిస్తున్నట్లు లాసూట్లో పేర్కొన్నాయి. తద్వారా చిన్న కంపెనీలను అణచివేస్తున్నట్లు ఆరోపించాయి. యాంటీట్రస్ట్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఫేస్‌బుక్‌పై బుధవారం ఫెడరల్ ట్రేడ్ కమిషన్ సైతం ఫిర్యాదు చేయడం గమనార్హం. రెండో కంపెనీ అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన గూగుల్ సైతం మార్కెట్లో ప్రత్యర్ధులను అణచివేస్తున్నట్లు ఇటీవల మాతృ సంస్థ అల్ఫాబెట్పైనా యూఎస్ న్యాయ శాఖలో ఫిర్యాదులు దాఖలైనట్లు టెక్నాలజీ రంగ నిపుణులు పేర్కొన్నారు. వెరసి యూఎస్ ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఫిర్యాదులను ఎదుర్కొంటున్న రెండో టెక్ దిగ్గజంగా పేస్బుక్ వార్తలలోనికి వచ్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. దశాబ్దకాలంగా ఫేస్బుక్ చిన్న ప్రత్యర్థి సంస్థలను అణచివేస్తున్నట్లు 46 రాష్ట్రాల తరఫున న్యూయార్క్ అటార్నీ జనరల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా వినియోగదారులు నష్టపోతున్నప్పటికీ పోటీ నుంచి తప్పించుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీకి పోటీగా ఎదిగేలోపు ప్రత్యర్ధులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఉదాహరణగా 2012లో ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను 100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడాన్ని ప్రస్తావించారు. ఇదేవిధంగా 2014లోనూ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను సైతం 19 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నట్లు వివరించారు. వెరసి ఫేస్‌బుక్‌ను మూడు కంపెనీలుగా విడదీయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నట్లు టెక్నాలజీ నిపుణులు పేర్కొన్నారు. (టెస్లా కార్లూ, షేర్లూ- మనకు భలే ఆసక్తి) వినియోగదారులకు మేలే ఫేస్బుక్ జనరల్ కౌన్సిల్ జెన్నిఫర్ న్యూస్టెడ్ కంపెనీపై వెల్లువెత్తిన ఫిర్యాదులను తోసిపుచ్చారు. విజయవంతమైన కంపెనీలను శిక్షించేందుకు యాంటీట్రస్ట్ నిబంధనలు అనుమతించవంటూ తెలియజేశారు. వినియోగదారులకు నష్టం వాటిల్లుతున్నట్లు ఫేస్‌బుక్‌పై చేసిన ఆరోపణలు సరికాదని జెన్నిఫర్ ఈ సందర్భంగా వాదిస్తున్నారు. వాట్సాప్‌ను ఉచితంగా అందించడం ద్వారా యూజర్లకు లబ్దిని చేకూరుస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. ఈ వార్తల నేపథ్యంలో బుధవారం ఫేస్బుక్ షేరు 2 శాతం క్షీణించి 278 డాలర్ల వద్ద ముగిసింది. (రికార్డ్స్‌కు బ్రేక్- మార్కెట్లు పతనం) -
పిల్స్ వేసుకున్నా 100మందికి గర్భం వచ్చిందని..
న్యూయార్క్: గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నా తాము గర్భం దాల్చడంపట్ల ఆ మాత్రలు తయారుచేసిన ఫార్మాసూటికల్స్ కంపెనీలపై కొందరు మహిళలు కేసులు వేశారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహిళలు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియాలోని కొందరు మహిళలు తమకు గర్భం దాల్చడం ఇష్టం లేక గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నారు. అయినా, అవి పనిచేయకపోవడంతో వారు గర్భం దాల్చాల్సి వచ్చింది. ఇలా దాదాపు 100మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా త్వరలో తల్లులుకాబోతున్నారు. అయితే, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా తయారుచేసిన మందుల కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఫిలడెల్ఫియాలోని మొత్తం నాలుగు కంపెనీలపై కేసులు పెట్టారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని, తమ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఆయా రూపాల్లో (విద్య, వైద్యం, పెరుగుదల, నిర్వహణ) అయ్యే ఖర్చును భరించాలని పేర్కొంటూ కోర్టు ద్వారా నోటీసులు పంపించారు.