Laxmi Bai
-
మాజీ కేంద్ర మంత్రి శివ శంకర్ భార్య లక్ష్మీ బాయి కన్నుమూత
మాజీ కేంద్రమంత్రి, మాజీ గవర్నర్ పి శివ శంకర్ భార్య లక్ష్మీ బాయి(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో భారంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు(గురువారం) తుది శ్వాస విడిచారు. ప్రముఖ వయోలినిస్ట్ ద్వారం వెంకటస్వామి నాయుడికి ఈమె మేనకోడలు.విశాఖపట్నం జిల్లా యలమంచలి ఈమె తండ్రి స్వస్థలం కాగా, అటు తర్వాత ఒడిశాలో సెటిల్ అయ్యారు. ఒడిశా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి మహిళగా లక్ష్మీ బాయి ఘనత సాధించారు. ఉత్కల్ యూనివర్శిటీ నుంచి బీఏ డిగ్రీ పూర్తి చేసిన లక్ష్మీబాయి.. ఆపై బెనారస్ యూనివర్శిటీ నుంచి పోస్టల్ కోర్సు ద్వారా ఎంఏ కూడా పూర్తి చేశారు.భర్త సాధించిన విజయాల్లో ఆమె కృషి వెలకట్టలేనిది. భర్త పి శివ శంకర్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, సిక్కిం గవర్నర్‌గా వ్యవహరించినప్పుడు ఆయనకు విశేష తోడ్పాటును అందించారు. దాంతో పెర్ఫెక్ట్ హోస్ట్ గుర్తింపును సైతం సొంతం చేసుకున్నారు. 80 ఏళ్ల వయసులో.. 80 నుంచి 90 ఏళ్ల మధ్యలో ఆమె రెండు పీహెచ్‌డీలు, ఒక డీ లిట్ సాధించారు! ఆమె 87 సంవత్సరాల వయస్సులో ఆమె చేసిన పిహెచ్‌డిలలో ఒకటి ఆమెకు బంగారు పతకాన్ని మాత్రమే కాకుండా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సాధించడంలో ఉపయోగపడింది.రెండు పిహెచ్‌డిలలో మొదటిది ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన థీసిస్ 'భగవద్గీత.. ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం'పై 5000 పేజీల ప్రవచనం, ఇది ఆమె 80 సంవత్సరాల వయస్సులో పూర్తిగా చేతితో వ్రాయడం విశేషం. -
అధిక దిగుబడినిచ్చే పెద్ద వంగ!
హెచ్జడ్కేబీ-1 అనే దేశవాళీ పెద్ద రకం వంగ విత్తనాలను ఒక రైతు కుటుంబం 50 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. గత 20 ఏళ్లుగా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తూ ఎకరానికి 40 టన్నుల దిగుబడి సాధిస్తోంది. వంగ తోటలో 10 రకాల అంతర పంటలు సాగు చేస్తూనే ఇంత దిగుబడి సాధిస్తుండడం విశేషం. కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లా హులియల్కు చెందిన లక్ష్మీబాయి జులపి (77) అనే చదువుకోని మహిళా రైతు ఈ వంగడాన్ని సంరక్షిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 20 ఎకరాల పొలం ఉంది. వంగ, గోధుమ, జొన్న, చెరకు తదితర పంటలు పండిస్తుంది. 50 ఏళ్ల క్రితం ఆమె మామ ఈ వంగ విత్తనాలను భాగల్‌కోట్ అడవుల్లో నుంచి తెచ్చాడు. అప్పటి నుంచీ సాగు చేస్తున్నారు. మామ తదనంతరం లక్ష్మీబాయి ఆ వంగ విత్తనాలను ఏటా సాగు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె పెద్ద కుమారుడు రుద్రప్ప (099016 15773) సేద్యపు పనులు చూస్తున్నాడు. వంగ మొక్కలను వరుసల మధ్య 4 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల దూరంలో నాటతారు. పశువుల ఎరువునే వేస్తారు. వంకాయలు 150-200 గ్రాముల బరువు పెరిగిన వెంటనే కోసి అమ్ముతారు. నిగనిగలాడుతూ, రుచిగా ఉంటాయి. విత్తనాల కాయలు 2-3 కిలోల బరువు వరకు పెరుగుతాయి. అడిగిన వారికి 5-10 గ్రాముల చొప్ను విత్తనాలు ఉచితంగానే ఇస్తున్నామని రుద్రప్ప తెలిపారు. ఒక మంచి దేశవాళీ వంగడాన్ని అనువంశికంగా పరిరక్షిస్తూ, అధికాదాయం కూడా పొందుతున్న లక్ష్మీబాయిని ఎన్ఐఎఫ్ పురస్కారంతో సత్కరించింది. ఇన్నోవేషన్ ఫెస్టివల్లో ఈ పెద్ద వంకాయలు సందర్శకులను ఆకర్షించాయి.