laxmi kantham
-
మైనింగ్ అక్రమాలపై విచారణ మమ
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలోని క్వారీల ప్రాంతం... శనివారం ఉదయం 11 గంటల సమయం... అక్రమ మైనింగ్‌పై విచారణకు ప్రభత్వం ఏర్పాటు చేసి అధికారుల కమిటీ పర్యటన అప్పుడే ప్రారంభమైంది... క్వారీల్లో నిత్యం హోరెత్తించే పేలుళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అధికారుల బృందం క్వారీలను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటలకు వెనుతిరిగింది. వారి వాహనాలు ఆ ప్రాంతం నుంచి కిలోమీటర్ కూడా వెళ్లకముందే.. క్వారీల్లో పేలుళ్లు మళ్లీ మొదలయ్యాయి. భారీ శబ్దాలతో క్వారీలు దద్దరిల్లిపోయాయి. కీలక మంత్రి ఇలాకాలో మైనింగ్ పర్మిట్లు నెల క్రితమే రద్దయినా యథాతథంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.పరిటాల శివారులోని దొనబండలో అక్రమ మైనింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సృందించింది. మైనింగ్ అక్రమాలపై నివేదిక ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిది. కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులతో విచారణ కమిటీని నియమించారు. అధికారుల బృందం శనివారం పరిటాల కొండ పోరంబోకు భూముల్లో నిర్వహిస్తున్న మైనింగ్ క్వారీలను తూతూమంత్రంగా పరిశీలించి చేతులు దులుపుకుంది. అటవీ భూముల్లో అక్రమంగా సాగుతున్న తవ్వకాలపై కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఒకవైపు సరిహద్దును మాత్రమే పరిశీలించి అంతా సక్రమంగానే ఉందనే నిర్ధారణకు వచ్చారు. ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారుల బృందం ఆటువైపు వెళ్లలేదు. క్వారీల హద్దులపై మరోసారి తనిఖీలు చేస్తామని అన్నారు. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ జరుగుతోందని చెప్పగా... ఆ విషయం మైనింగ్ సేఫ్టీ అధికారులు చూసుకుంటారని బదులిచ్చారు. తమపై రాజకీయ ఒత్తిడి ఉందని, ఇంకేమీ ప్రశ్నించవద్దని మైనింగ్ అధికారులు చెప్పడం గమనార్హం. మొత్తం 94 క్వారీలకుగాను, 20 క్వారీలను నిబంధనలు పాటించకపోవడంతో నిలిపివేశామని మైనింగ్ ఏడీ వైఎస్ బాబు తెలిపారు. ఆ 20 క్వారీలు యథాతథంగా పనిచేస్తున్నాయని, తమతో వస్తే చూపిస్తామని స్థానికులు చెప్పడంతో.. అలా జరగదంటూ దాటవేశారు. మైనింగ్ యథాతథం పరిటాల సమీపంలోని క్వారీల్లో సాగుతున్న అక్రమాలపై విచారణ కోసం అధికారుల బృందం వస్తోందని ముందుగానే సమాచారం అందుకున్న నిర్వహకులు మైనింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు తిరిగి వెళ్లిపోయిన వెంటనే క్వారీల్లో తవ్వకాలను ప్రారంభించారు. నెల క్రితమే పర్మిట్లు రద్దయినప్పటికీ క్వారీలు బ్లాస్టింగ్లతో హోరెత్తిపోయాయి. కంకర లోడ్లతో వాహనాలు తరలివెళ్లాయి. అక్రమాలు ఎక్కడా లేవట! అధికార పార్టీ నేతలే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. నిబంధనల ప్రకారమే మైనింగ్ జరుగుతోందని, ఎక్కడా అక్రమాలు లేవని నివేదిక ఇవ్వాలంటూ అధికారులపై ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అక్రమంగా కొనసాగుతున్న క్వారీల జోలికి వెళ్లొద్దని, అంతా సక్రమంగానే ఉన్నట్లు మీడియాకు చెప్పాలంటూ తమకు ఆదేశాలు అందాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
జేసీ బదిలీ
నెల్లూరు (కలెక్టరేట్) : జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీ అయ్యారు. ఆయనను ఆదిలాబాద్ జేసీగా బదిలీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 2011లో ఏజేసీగా జిల్లాకు వచ్చిన ఆయన ఇక్కడే జూన్ 2012లో ఐఏఎస్ క్యాడర్‌కు ఎంపికై జేసీగా ఉద్యోగోన్నతి పొందారు. జిల్లాలో రెవెన్యూ వ్యవస్థపై నిఘా ఉంచి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. -
పకడ్బందీగా వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో గ్రామరెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పరీక్షలను ఆదివారం పకడ్బందీగా నిర్వహించాలని జేసీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో పరీక్షల నిర్వహణపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో 48 వీఆర్ఓ పోస్టులకు 35,608 మంది, 145 వీఆర్ఏ పోస్టులకు 2,352 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరికి జిల్లా వ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థుల నుంచి తప్పనిసరిగా వేలి ముద్రలను తీసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణపై వీడియో తీయాలన్నారు. మొత్తం 36 రూట్లలో 36 మంది ఆఫీసర్లను నియమించామని చెప్పారు. కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా డీఆర్ఓ రామిరెడ్డి, అసిస్టెంట్ కో ఆర్డినేటర్లగా ఆర్డీఓలు వ్యవహరిస్తారన్నారు. అలాగే 26 మంది అబ్జర్వర్లు, 94 మంది లైజనింగ్, చీఫ్ లైజనింగ్ అధికారులను నియమించినట్టు జేసీ తెలిపారు. ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉంటారన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్ఓ, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రామిరెడ్డి, ఏపీపీఎస్‌ఈ సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
రుణాల మంజూరులో అలసత్వం తగదు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కౌలురైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్ల అలసత్వం తగదని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం సాయంత్రం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి కౌలురైతులు రుణాల కోసం కలెక్టరేట్‌కు వచ్చారన్నారు. అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యంవల్లే కౌలురైతులకు రుణాలు మంజూరుకావడంలేదని మండిపడ్డారు. జిల్లాలో ఇప్పటి వరకు 3261 మంది కౌలురైతులకు రూ.12.93కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండురోజుల్లోగా తహశీల్దార్లు అన్ని బ్యాంక్‌ల శాఖలకు వెళ్లి బ్యాంకర్లతో సంప్రదించి రుణ లక్ష్యాలను అధిగమించాలన్నారు. నెలాఖరులోగా రూ.50కోట్లు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో త్వరలో ఏడో విడత భూ పంపిణీ జరగనుందన్నారు. అన్నినియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులతో సమావేశమై లబ్ధిదారుల జాబితాను వెల్లడించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వభూమిని గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వభూమి ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ గౌతమి, ఆర్డీవోలు సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, రమణ, మధుసూదన్‌రావు, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.