ముంచెత్తిన వరదలు : 84 మంది మృతి
ఖట్మాండ్: భారీ వర్షాలు, వరదలతో నేపాల్ అతలాకుతలం అవుతుంది. దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 84 మంది మృతి చెందారని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లక్మీ ప్రసాద్ దక్కల్ ఆదివారం నేపాల్లో వెల్లడించారు. 156 మంది గల్లంతు అయ్యారని తెలిపారు. మృతుల్లో 56 మంది మృతదేహాలను కనుగొన్నామని చెప్పారు.
వరదలు, కొండ చరియలు విరిగిపడి దేశంలోని పశ్చిమ ప్రాంతం పూర్తిగా దెబ్బతిందని వివరించారు. ఇళ్లు, పోలాలు... అన్ని వరద నీటికి కొట్టుకుపోయాయని... అలాగే కొండ చరియల విరిగి పడటంతో ఆస్తులు, పలువరు ప్రాణాలు శిథిలాల కింద చిక్కుకుని పోయారని తెలిపారు. దాదాపు 15 వందల మంది నిరాశ్రయులైయ్యారని చెప్పారు. వారందరికి సురక్షిత ప్రాంతాలకు తరలించి... ఆశ్రయం కల్పించామన్నారు.
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని... వరదలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని... దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని వివరించారు. అయితే హెలికాప్టర్ల కోసం వేచి ఉన్నామని చెప్పారు.