మొబైల్ ఫోన్ అనుకుని తెరిస్తే...
దొరవారిసత్రం(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): మీ ఫోన్ నంబర్‌కు హెచ్‌టీసీ మొబైల్ ఆఫర్ ఉంది.. రూ.16,500 విలువ కలిగిన ఫోన్ కేవలం రూ.3,300కి ఇస్తాం..’ అని చెప్పిన మోసగాళ్లు లక్ష్మీయంత్రం అంటగట్టారు. ఈ సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలోని కుప్పారెడ్డిపాళెం ఎస్సీ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడు కిరణ్ కథనం ప్రకారం.. ఇరవై రోజుల కిందట ఢిల్లీలోని హెచ్ టీసీ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు.
‘మీ నంబర్‌కు ఆఫర్ వచ్చింది. రూ.16,500 విలువ కలిగిన హెచ్‌టీసీ ఫోన్‌ను రూ.3,300 కే ఇస్తాం. ఆన్లైన్లో బుక్ చేసుకోమంటూ..’ సూచించాడు. వెంటనే బాధితుడు ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత పోస్టు ద్వారా వీపీపీ పార్శిల్ రావడంతో ఎంతో ఆత్రుతగా రూ.3,300 నగదు చెల్లించాడు. దానిని ఓపెన్ చేసి చూడగా లక్ష్మి, తాబేలు బొమ్మలతో పాటు ఓ యంత్రం కనిపించాయి. దీంతో బాధితుడు అవాక్కయ్యాడు.