లాడ్జీలో వ్యక్తి మృతదేహం
పామిడి : పామిడిలోని మంజూ టాకీస్ రోడ్డు వీధిలో గల స్వాగత్ లాడ్జీలో గుంతకల్లు రూరల్ మండలం కదిరిపల్లికి చెందిన లక్ష్మానాయక్(55) మృతదేహాన్ని లాడ్జీ నిర్వాహకులు గురువారం కనుగొన్నారు. అతను స్థానిక పోలీస్స్టేషన్ వద్ద గంపలో కూరగాయలు విక్రయించేవాడు. బుధవారం అనంతపురం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడు. పామిడికి చేరుకొనే సరికి రాత్రి కావడంతో బస్సు సౌకర్యం లేక లాడ్జీలో దిగినట్లు తెలిపారు.
అయితే ఉదయానికల్లా అతను పరుపుపై మృతి చెంది ఉన్నాడు. గమనించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాయక్ సహజ మరణం పొందాడంటూ తెలిపి మృతదేహాన్ని కదరిపల్లికి కుటుంబ సభ్యులు తరలించారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, షేతూ నాయక్, వరలక్ష్మీ పిల్లలు ఉన్నారు.