Lay-Out
-
ఇంటిపై జీఎస్టీ భారం!
♦ నిర్మాణాలపై 12%, లే–అవుట్లపై 18% జీఎస్టీ ♦ ఇంటి అద్దెలపై జీఎస్టీ లేదు; వాణిజ్య, ఆఫీసు అద్దెలపై మాత్రం 18% ♦ అందుబాటు గృహాలకు జీఎస్టీ మినహాయింపల్లేవ్ ♦ డెవలపర్లకూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తింపు; కానీ, చివరి 12 నెలలకే ♦ కేసీఆర్ 2 బీహెచ్‌కే పథకంపై అదనపు భారం సాక్షి, హైదరాబాద్: పరోక్ష పన్ను విధానంలో స్థిరాస్తి రంగంలోని పన్నులను ఒకసారి పరిశీలిస్తే వేర్వేరు దశలో ఉంటాయి. మొదటి దశలో భూములను కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ. రెండో దశలో లే అవుట్ వేసేందుకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చినందుకు నాలా పన్ను, స్థానిక సంస్థలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ నుంచి అనుమతి కోసం రుసుములుంటాయి. మూడో దశలో నిర్మాణ సమయంలో నిర్మాణ సామగ్రిపైన ఎక్సైజ్ డ్యూటీ, ఫ్లాట్లను అమ్మినప్పుడు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్లుంటాయి. ఈ మూడు దశల్లోని పన్నులన్నింటినీ కలిపితే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 27–33 శాతం వరకు పన్నులుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే జీఎస్టీలో మాత్రం పై మూడు దశల్లో మొదటి రెండు దశలకు జీఎస్టీతో సంబంధం లేదు. కాబట్టి వాటిల్లో ఎలాంటి మార్పు ఉండదు. మూడో దశలో ఉన్న వ్యాట్, సేవా పన్ను, ఎక్సైజ్.. మూడింటి స్థానంలో ఒకే పన్ను అంటే జీఎస్టీ మాత్రమే ఉంటుంది. అయితే వాస్తవానికి స్థిరాస్తి రంగానికి 18 శాతం జీఎస్టీని ఖరారు చేశారు. కానీ, భూమి విలువలో 6 శాతం మినహాయింపు కారణంగా 12 శాతం చెల్లిస్తే సరిపోతుంది. కానీ, గతంలో వ్యాట్ (1.25 శాతం), సర్వీస్ ట్యాక్స్ (4.5 శాతం)గా రెండూ కలిపి 5.75 శాతం పన్నులుండేవి. అంటే జీఎస్టీతో స్థిరాస్తి రంగంలో పన్నులు 6.25 శాతం పెరిగాయన్నమాట. పైగా గతంలో, జీఎస్టీలోనూ రిజిస్ట్రేషన్ చార్జీలు 6.10 శాతం మాత్రం కొనుగోలుదారులు భరించాల్సిందే. కాకపోతే జీఎస్టీతో డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది. అయితే అది ఎంత? కొనుగోలుదారులకు ఎలా బదిలీ చేస్తారనేదే సందేహం. లే అవుట్లకు 18 శాతం జీఎస్టీ.. భూమి అమ్మకం (సేల్ ఆఫ్ ల్యాండ్) అనేది వస్తువు లేదా సేవల కిందికి రాదు కాబట్టి జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. కానీ, లే అవుట్లు చేసి విక్రయిస్తే మాత్రం సేవల కింద పరిగణించి 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సిందే. పర్మినెంట్ లే అవుట్ తీసుకొని అన్ని వెంచర్లకూ జీఎస్టీ వర్తిస్తుంది. లే అవుట్లో సబ్ కాంట్రాక్టర్ చేసే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకర్ వంటి మౌలిక వసతుల వ్యయంపై 18 శాతం జీఎస్టీ పన్నును కట్టాల్సి ఉంటుంది. వాణిజ్య, ఆఫీసు అద్దెలకూ 18 శాతమే.. నివాస సముదాయాల అద్దెలను జీఎస్టీ నుంచి మినహాయించారు. వాణిజ్య, కార్యాలయాల అద్దెలకు మాత్రం 18% జీఎస్టీని ఖరారు చేశారు. గతంలో వీటికి 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండేది. అంటే 3 శాతం పెరిగింది. మాదాపూర్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో చ.అ. అద్దె రూ.40 అనుకుందాం. 1,000 చ.అ. అద్దెకు రూ.40 వేలు అద్దె చెల్లింస్తుంటే దీని మీద గతంలో సర్వీస్ ట్యాక్స్ 15 శాతం అంటే నెలకు రూ.46 వేలు అద్దె ఉండేది. అదే అద్దె ఇప్పుడు 18 శాతం జీఎస్టీ కలిపితే రూ.47,200 చెల్లించాల్సి ఉంటుంది. అందుబాటు గృహాలపై స్పష్టత లేదు.. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఈవై) పథకం కింద 30, 60 చ.మీ.లోపు కట్టే ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ గృహాలకు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ మినహాయింపు ఉంది. అయితే జీఎస్టీలోనూ ఈ గృహాలకు మినహాయింపు ఉంటుందా? లేదా? అనేది కేంద్రం స్పష్టతివ్వలేదు. ఒకవేళ వీటికి కూడా 12 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటే గనక.. అందుబాటు గృహాలు కాస్తా ఖరీదవుతాయి. జీఎస్టీలో కేవలం బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలను మాత్రమే మినహాయింపునిచ్చారు. అంటే ఈ రకమైన గృహాల నిర్మాణ వ్యయంలో కొంత ప్రభుత్వం, కొంత లబ్ధిదారుడు భరిస్తాడమన్నమాట. ♦ జీఎస్టీతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లూ భారంగా మారనున్నాయి. వీటికి కూడా 12 శాతం పన్ను వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వం ఏటా 2 బీహెచ్‌కే నిర్మాణాలకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా.. జీఎస్టీతో అదనపు వ్యయం తప్పదన్నమాట. ఇప్పటికే చాలా మంది 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్న రేట్లు జీఎస్టీ అమలుతో లాభదాయకంగా లేదని, తమపై అదనపు భారం పడుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. ♦ ఒక్కో 2 బీహెచ్కేపై ప్రభుత్వ వ్యయమిది.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో గ్రౌండ్+ మూడంతస్తులకైతే రూ.7 లక్షలు, సెల్లార్+ స్టిల్ట్+ తొమ్మిదంతస్తులకైతే రూ.7.9 లక్షల ఖర్చు చేస్తుంది. నీటి సరఫరా, విద్యుత్, అప్రోచ్, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల ఏర్పాట్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేలు వ్యయ పరిమితి. ♦ అయితే జీఎస్టీలో చెల్లించే పన్నుల్లో సగం రాష్ట్రానికి ఎస్జీఎస్టీ రూపంలో అందుతాయి కాబట్టి.. రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే 6.10 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను పూర్తిగా మినహాయించాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ చార్జీలను కనీసం 3 శాతానికి తగ్గించాలి. – జే వెంకట్ రెడ్డి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ ఐటీసీ వర్తింపు; కానీ, చివరి 12 నెలలకే.. పరోక్ష పన్ను విధానంలో నిర్మాణ సామగ్రి సమయంలో చెల్లించే వివిధ రకాల పన్నులకు డెవలపర్లకు క్రెడిట్ లభించేది కాదు. కానీ, జీఎస్టీలో మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వర్తిస్తుంది. అయితే ఇది చివరి 12 నెలలకు మాత్రమే. ఈ నిబంధన ఇతర రంగాలకు సెట్ అవుతుందేమో గానీ నిర్మాణ రంగానికి కుదరదని నిపుణుల అభిప్రాయం. ఎలాగంటే.. స్థిరాస్తి ప్రాజెక్ట్ అనేది మూడునాలుగేళ్ల పాటు జరిగే తంతు. దశల వారీగా నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేసి ప్రాజెక్ట్ మొత్తాన్ని పూర్తి చేస్తారు. కానీ, జీఎస్టీలో కేవలం చివరి 12 నెలలకు మాత్రమే ఐటీసీ వర్తింపజేస్తే.. మిగిలిన పన్నుల భారం డెవలపర్ మీద పడుతుంది. ఈ భారాన్ని డెవలపర్ కొనుగోలుదారులకే చేరవేస్తాడు.. అంటే ఫ్లాట్ల ధరలను పెంచేస్తాడు. అందుకే ఐటీసీని ప్రాజెక్ట్ మొత్తానికి వర్తింపజేయాలి. అపార్ట్మెంట్లో భూమి విలువ మీద 1/3 వరకే ఐటీసీ వర్తింపజేస్తున్నారు. ఒకవేళ భూమి విలువ ఎక్కువుంటే మాత్రం పన్నుల భారం డెవలపర్ల మీదే పడుతుంది. ♦ నిర్మాణం పూర్తయిన లేదా సగం పూర్తయిన వాటికి కూడా క్రెడిట్ సదుపాయాన్ని వర్తింపజేశారు. ఉక్కు, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రిని ఇప్పటికే భవన నిర్మాణంలో వినియోగించారు కాబట్టి.. వాటిని పూర్తయిన ఫ్లాట్లుగా భావిస్తారా? లేక అసంపూర్తిగా గుర్తించి క్రెడిట్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. – సీ శేఖర్ రెడ్డి, భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు -
క్రమబద్ధీకరణలో అక్రమాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ పరిధిలో లే అవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. 2015 అక్టోబర్ 28 కటాఫ్ తేదీ తర్వాత అక్రమంగా నిర్మించిన భవనాలు, లే అవుట్ల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదేశంతో పురపాలక మంత్రి కె. తారక రామారావు... ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల అమల్లో అవినీతి, అక్రమాలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. అధికారులపై వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక బృందాలను రంగంలో దింపాలని సూచించారు. అక్రమార్కులపై నిఘా కోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని సైతం ప్రయోగించాలని యోచిస్తున్నారు. కటాఫ్ తేదీ తర్వాత వెలసిన భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం సైతం వేల సంఖ్యలో దరఖాస్తులొచ్చినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ దరఖాస్తుదారులకు నగర టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సహకారం అందిస్తున్నారని కేటీఆర్ దృష్టికి వచ్చింది. గత ప్రభుత్వం 2007-08లో ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ఆసరాగా చేసుకుని 2010లో నిర్మించిన అక్రమ భవనాలు, లే అవుట్లను కూడా పెద్ద ఎత్తున క్రమబద్ధీకరించినట్లు గతంలో వెలుగు చూసింది. అప్పట్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఈసారీ అక్రమాలకు తెరలేపేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ దృష్టికి సైతం వచ్చింది. దీనిపై గట్టి నిఘా ఉంచాలని సీఎం ఆదేశించడంతోనే మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. 2015 అక్టోబర్ 28న తీసిన జీపీఎస్‌తోపాటు శాటిలైట్ చిత్రాలతో పోల్చితే కటాఫ్ తేదీకి ముందు, ఆ తర్వాత నిర్మించిన భనవాలు, లే అవుట్ల సమాచారం స్పష్టంగా తెలిసిపోనుంది. -
కటాఫ్ డేట్.. జూన్ 2, 2014
అక్రమ కట్టడాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణ బీపీఎస్, ఎల్ఆర్ఎస్పై సర్కారు నిర్ణయం! పురపాలక శాఖ నుంచి {పతిపాదనలు కోరిన సీఎంవో గతంతో పోల్చితే క్రమబద్ధీకరణ చార్జీలూ రెట్టింపు హైదరాబాద్: మళ్లీ అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భవనాలు/లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాల(బీపీఎస్/ఎల్ఆర్ఎస్)ను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను తాజాగా సీఎం కార్యాలయం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2 తేదీని అక్రమాల క్రమబద్ధీకరణకు ‘కటాఫ్ డేట్’గా ప్రభుత్వం నిర్ణయించి నట్లు తెలుస్తోంది. అంటే, 2014 జూన్ 1 లోపు నిర్మాణం పూర్తై భవనాలు, లే ఔట్లనే క్రమబద్ధీకరించనున్నారు. ఆ తర్వాత పుట్టుకొచ్చిన అక్రమ కట్టడాలు, లే అవుట్లను కూల్చేయాలా? లేదా? అన్న అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కటాఫ్ డేట్‌కు ముందు నిర్మితమైన భవనాలు, లే అవుట్లను గుర్తించేందుకు ‘గూగుల్ మ్యాప్స్’ సహాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి క్రమబద్ధీకరణ చార్జీలు దాదాపు రెట్టింపు కానున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తే రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ఇప్పటికే జీహెచ్ఎంసీ తమ వార్షిక బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. నగరంలో దాదాపు 65 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థికంగా కుదేలైన మిగిలిన 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం అక్రమాల క్రమబద్ధీకరణ ద్వారా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే చివరిసారి..: అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని 2002లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని అధికారవర్గాలు గుర్తించాయి. ఆ ఆదేశాల తర్వాత కూడా.. ఇదే చివరి క్రమబద్ధీకరణలు అంటూ 2007-08లో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ను అమలు చేశారు. 2002లో సైతం ‘ఇదే చివరిసారి’ అంటూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గత ప్రభుత్వాల నిర్ణయాలు, హైకోర్టు ఆదేశాల ప్రభావం లేకుండా బీపీఎస్, ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు అనువుగా ఏపీ మునిసిపల్ చట్టం, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం, భవన నిర్మాణ నియమావళి, డీటీసీపీ చట్టాలను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. పెండింగ్ దరఖాస్తులు మళ్లీ పరిశీలన ఉమ్మడి రాష్ట్రంలో 2007-08లలో పెండింగ్‌లో వున్న 57,473 బీపీఎస్, 4,586 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీ ప్రణాళికల అమలుకు కావాల్సిన నిధుల కోసం క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. -
లే ఔట్
సామాజిక స్థలాలు మాయం పాత లే అవుట్ల పరిశీలన 684 లే అవుట్లకు అనుమతి 163 చోట్ల ఖాళీ స్థలాలు లభ్యం 200 ఎకరాలకు పైగా కనుమరుగు హన్మకొండ : సామాజిక అవసరాల కోసం లే అవుట్లలో కేటాయించాల్సిన ఖాళీ స్థలాలు కబ్జా అయ్యూరుు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు రెండు వందలకు పైగా స్థలాలు మాయమయ్యాయి. సుమారు 200 ఎకరాలు అన్యాక్రాంతమయ్యూరుు. నగరంలో కొత్తగా మార్కెట్లు, క్రీడాస్థలాలు నిర్మించేందుకు ఖాళీ స్థలాలను గుర్తించేందుకు చేపట్టిన కసరత్తులో ఈ నిజాలు వెలుగుచూశారుు. జనవరిలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా వరంగల్ నగరంలో ఖాళీగా ఉన్న స్థలాల వివరాలు అంగుళంతో సహా సేకరించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఇళ్ల నిర్మాణాలకు లే అవుట్ల అనుమతి పొందే ముందు ఇల్లు, రోడ్లు మినహాయించి పది శాతం స్థలాన్ని పార్కు, కమ్యూనిటీ హాలు, సామాజిక అవసరాలకు కేటాయించాలి. ఈ నిబంధనలు పాటిస్తూ రూపొందిం చిన లే అవుట్లలోనే నిర్మాణాలకు అనుమతిస్తారు. నగరంలో ఖాళీ ప్రదేశాల గుర్తింపు పనిలో భాగంగా 1940లో ఉన్న వరంగల్ మునిసిపాలిటీ లే అవుట్లు, ఆ తర్వాత ఏర్పడిన కాకతీయ ప్ట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు సంబంధించి 1982 నుంచి వచ్చిన లే అవుట్లతోపాటు డెరైక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్‌ల వద్ద ఉన్న రికార్డులను నెలరోజుల నుంచి పరిశీలిస్తున్నారు. ఈ మూడు రకాలైన రికార్డులను పరిశీలించగా... నగరంలో దాదాపు 684 లే అవుట్లకు అనుమతి ఇచ్చినట్లుగా తేలింది. సరిగా ఉన్నవి 163 మాత్రమే.. ప్రాథమిక అంచనాల ప్రకారం నగరంలో 684 లే అవుట్లలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లుగా తేలింది. కానీ... ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డులను జీపీఎస్ ద్వారా పరిశీలించగా కేవలం 163 లే అవుట్లలోనే సామాజిక అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన లే అవుట్లలో కొత్తగా నిర్మాణాలు వెలిశాయి. మొదటగా లే అవుట్లో పది శాతం ఖాళీ స్థలాలు చూపించి నిర్మాణాలకు అనుమతులు పొందిన వెంచర్ డెవలపర్లు, బిల్డర్లు.. ఆ తర్వాత కాలంలో నిబంధనలు తుంగలో తొక్కారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టి జేబులు నింపుకున్నారు. ఇవన్నీ కార్పొరేషన్ అధికారుల కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 684 లే అవుట్లలో కేవలం 163 లేఅవుట్లలోనే ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నట్లుగా తేలింది. కనుమరుగైన స్థలం దాదాపు 200 ఎకరాలకు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. సర్ఫరాజ్ ఏం చేస్తారో? కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి, పారిశుద్ధ్యం వంటి కీలక విభాగాల్లో కొంత కాలంగా స్తబ్ధత వాతావరణం నెలకొంది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. నగరంలో కొత్తగా అత్యుత్తమ ప్రమాణాలతో కూరగాయలు, పూలు, పండ్ల మార్కెట్లు నిర్మించాలన్నా, క్రీడాస్థలాలను అందుబాటులోకి తేవాలన్నా ఖాళీ స్థలాల గుర్తింపు ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో కొత్తగా వెలిసిన నిర్మాణాల విషయంలో కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
భూ.. మంత్రం!
అందమైన కమాన్.. చుట్టూ ప్రహారీ.. మధ్య మధ్యలో పచ్చని చెట్లు.. అంతర్గత రోడ్లతో చూడగానే కొనాలనిపించే అందమైన లే-అవుట్! అయితే ఇదంతా ఓ మేడిపండే. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ వాలిపోయి అనుమతుల్లేకుండా గ్రామ పంచాయతీ లే-అవుట్లని, హెచ్ఎండీఏ నామ్స్ అని కల్లబొల్లి మాటలతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు వ్యాపారులు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకూ గండికొడుతున్నారు కూడా. హైదరాబాద్: మెట్రో రైలు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఔటర్ రింగ్ రోడ్, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్లతో హైదరాబాద్ నలువైపులా అభివృద్ధికి బాటలు పరుచుకుంది. ముంబై హైవేలో.. పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ వరకు, నాగ్‌పూర్ హైవేలో.. మేడ్చల్, తుప్రాన్, చేగుంట, రామాయంపేట్ వరకు, వరంగల్ హైవేలో.. బీబీనగర్, భువనగిరి, ఆలేరు, యాదాద్రి వరకు, విజయవాడ రోడ్లో.. చౌటుప్పల్, చిట్యాల్, సూర్యాపేట వరకు, బెంగళూరు హైవేలో.. కొత్తూరు, ఫరూక్నగర్, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల వరకూ లెక్కలేనన్ని లే-అవుట్లు, వెంచర్లు వెలిశాయి. రెవెన్యూ అధికారిక లెక్కల ప్రకారం సుమారు 40 వేల ఎకరాలకు పైగానే ఉంటాయని సమాచారం. వందల సంఖ్యల్లో లే-అవుట్‌కు అనుమతి రావాలంటే.. మొత్తం స్థలంలో 30 శాతం రోడ్లు, ్రైడె నేజీ కోసం, 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కోసం కేటాయించాలి. ఆ స్థలం మున్సిపల్ పరిధిలో ఉంటే రెండున్నర ఎకరాల లోపు వరకైతే ఆర్జేడీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెండున్నర ఎకరాలు దాటితే డీటీసీపీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇలాంటి నిబంధనలేవీ పాటించకుండా శ్రీమిత్రా ఎస్టేట్స్, విదర్భ టౌన్షిప్, సవేరా ఇన్ఫ్రా, వీవీఆర్ హౌజింగ్, సిటీస్క్వేర్, జన్మభూమి హోమ్, అరుణోదయ ఎన్క్లేవ్, మధుపాలా, సిరి ఎన్క్లేవ్.. ఇలా ఒక్కటేమిటీ వందల సంఖ్యల్లో స్థిరాస్తి సంస్థలు అక్రమంగా లే-అవుట్లను వేస్తున్నాయి. తక్కువ ధరకు విక్రయిస్తూ ఒకవైపు కొనుగోలుదారులను మోసం చేస్తుంటే.. రిజిస్ట్రేషన్ చార్జీలు, సెస్, హెచ్ఎండీఏ అనుమతుల ఫీజులు, జీపీ, హౌజింగ్ ఫీజులు, అమ్మకపు పన్నులు.. ఇలా వివిధ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారని సుచిరిండియా సీఈఓ కిరణ్ చెప్పారు. అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీ, గ్రామ స్థాయి అధికారుల అండదండలతోనే అసంఘటిత వ్యాపారులు అక్రమంగా లే-అవుట్లు వేస్తూ.. సంఘటిత స్థిరాస్తి మార్కెట్‌ను దెబ్బతీస్తున్నారన్నారని పేర్కొన్నారు. సైట్లో డిస్ప్లే చేయాల్సిందే అనుమతి కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకోగానే దానికి లే-అవుట్ పర్మిషన్ నంబర్‌ను కేటాయిస్తారు. అయితే ఆ నంబర్ మాత్రమే ఉంటే సరిపోదు.. లే-అవుట్ రిలీజ్ అయ్యిందా లేదా అనేదే ముఖ్యమైందంటున్నారు ఏవీ కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్‌రెడ్డి. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రతి లే-అవుట్ వివరాలు హెచ్ఎండీఏ వెబ్సైట్లో ఉంటాయి. అంతేకాదు అనుమతి పొందిన లే-అవుట్ పా ్లన్ను ప్రతి బిల్డర్ తన సైట్లో డిస్ప్లే చేయాలి. లేకపోతే ఆ లే-అవుట్‌పై డౌట్ పడాల్సిందే. హెచ్ఎండీఏ అనుమతి పొందిన ప్రతి లే- అవుట్ వివరాలను అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులకూ పంపించాలి. అలాగే రిజి స్ట్రేషన్ సమయంలో ఎల్ఆర్ఎస్, డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతి పత్రం వీటిలో ఏదైనా కాపీని జత చేస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడే డబుల్ రిజిస్ట్రేషన్లు, టైటిల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. -
సొంతగూడు కల.. చెదురుతోందిలా..
శివారు ప్రాంతాల్లో స్థల విక్రయాల్లో వెలుగు చూస్తున్న మోసాల పరంపర ఆస్కారమిస్తున్న నిబంధనల లొసుగులు భూబకాసురులకు వంతపాడుతున్న అధికారులు పెరుగుతున్న బాధితుల చిట్టా స్థలం కొనే ముందు అవగాహన అవసరం గోపాలరావు అనే చిరుద్యోగి ఆనందపురం మండలంలోని ఒక గ్రామంలో లే అవుట్లో ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. పలుచోట్ల అప్పులు చేసి రిజిేస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. ఐదేళ్లు తర్వాత విక్రయించి కుమార్తె వివాహం చేద్దామనుకున్నాడు. మధ్యలో ఒక సారి తన స్థలాన్ని చూడడానికి వెళ్లగా ప్రభుత్వ స్థలమని బోర్డు దర్శనమిచ్చింది. గోపాలరావు ఆరా తీయగా, గతంలో అది ఎస్సీలకు కేటాయించిన సీలింగ్ భూమి అని తేలింది. ఆనందపురం జంక్షన్లో తోపుడు బండి వ్యాపారి, రామారావు ఇక్కడకు సమీపంలో 60 గజాలు స్థలాన్ని కొనుగోలు చేశాడు. అప్పు చేసి ఆరేళ్ల క్రితం చిన్న ఇల్లు నిర్మించాడు. ఆర్ధిక పరిస్థితి బాగోలేక, విక్రయించేశాడు. తీరా రిజిేస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఆ సర్వే నెంబరు నిషేధిత జాబితాలో ఉందని అధికారులు తెలపడంతో నిశ్చేష్టుడయ్యాడు. అక్కయ్యపాలెంకు చెందిన వెంటకరావు పోర్టులో పనిచేసి రిటైరయ్యారు. ఉన్నదంతా కూడబెట్టి 100 గజాల స్థలం కొంటే పక్కనున్న వ్యక్తి ఇది తాను ఇదివరకే కొనుక్కున్నానంటూ కాగితాలు చూపిస్తున్నాడు. వెంకటరావుకు ఏం చేయాలో పాలుపోలేదు. మోసపోయానని అర్థమైంది. ఈ ముగ్గురే చాలామందికి నగర శివారులో ఎదురవుతున్న సమస్య ఇది.. శివారు ప్రాంతాలలో నివాస స్థలాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడి,ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇదే అదునుగా కొంత మంది ‘రియల్’ మోసాలకు పాల్పడుతున్నారు. కొంత మంది చిన్న, మధ్య తరగతి కుటుంభాలను టార్గెట్‌గా చేసుకొని చౌకగా స్థలాలు అంటూ విక్రయించిన స్థలాలనే మరలా విక్రయించడం, తప్పుడు రికార్డులను సృష్టించడం, ప్రభుత్వ భూములను లే అవుట్లుగా అభివృద్ధి పరిచి విక్రయిండంతో తెలియని కొంత మంది వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. రియల్ మోసాలు వలన పెద్దల మాట ఎలా ఉన్నా మధ్య తరగతి వారి సొంత ఇంటి ఆశలు పేక మేడల్లా కూలి పోతున్నాయి. వ్యాపారులతో పాటు, బడాబాబులు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుండడంతో మధ్య తరగతి కుటుంబీకులు వారితో వేగ లేక కోర్టులు చుట్టూ తిరగలేక మిన్నకుండి పోతున్నారు. నగరంతో పాటు భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూసినా అధికారులు మాత్రం తీసుకున్న చర్యలు కానరావడంలేదు. పోలీసు, రెవిన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సమన్వయంతో పని చేయకపోవడం వలన, మోసగాళ్లు పని మరింత సులభమవుతోంది. నగరం నడిబొడ్డున ఇటీవల ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు స్థలాన్ని తప్పుడు రికార్డులతో స్వాధీనం చేసుకోవడానికి కొంత మంది యత్నించగా, పలుకుబడితో అడ్డుకోగలిగారు. ఒక ఎంపీ పరిస్థితే అలా ఉంటే సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో మధురవాడలో ఇళ్ల స్థలాలు కొనుగోలు వ్యవహారంలో సినీ నటి అనుష్క, నాగార్జున వంటి వారినే బురిడి కొట్టించారు. తప్పుడు డాక్యుమెంట్లుతో వారికి స్థలాలు విక్రయించడంతో వారు కోర్డు కేసులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు కొకొల్లలు. మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసులని కొట్టిపారేయడం, రెవెన్యూ అధికారులు సరైన సమాచారం అందించక పోవడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. రియల్ మోసాలు రోజు రోజుకు పెరుగు పోతుండడంతో అందరినీ విస్మయపరుస్తోంది. రెవెన్యూ అధికారులు రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంతో, వీరితో పాటు, రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది కూడా రియల్ ఇస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో మోసాలకు ఆస్కారం ఏర్పడుతోంది. - ఆనందపురం మోసాలకు ఆస్కారం ఇలా... వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులలోను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను సమాచారం లభిస్తుంది. అదే నివాస ప్రాంతాలుగా మార్పు చేస్తే ఆ సమాచారం లభ్యం కాదు. దీంతో ఒకే డాక్యుమెంట్‌తో పలువురికి రిజిస్ట్రేషన్లు చేయగలుగుతున్నారు. వ్యవసాయ భూముల విక్రయాలు విషయంలో పట్టాదారు పాసుపుస్తకాలలో రిజిస్ట్రార్లు విక్రయ సమాచారం పొందుపరుస్తారు. స్థలాలు విక్రయాల విషయంలో హక్కు పత్రాలపై ఎలాంటి నమోదులు ఉండవు. మీ సేవ కేంద్రాలలో ఈసీ (ఎన్కంబెర్స్మెంట్ సర్టిఫికేట్)లు 1985 నుంచి జరిగే లావాదేవీలకు మాత్రమే ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. అంతకు ముందు జరిగే లావాదేవీల కోసం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిశీలన కోసం ధరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అందిస్తున్నారు. దీన్ని కొంత మంది మేనేజ్ చేయడం వలన ఒక్కో సారి నిల్ అని వస్తోంది. దీంతో ఒకే డాక్యుమెంట్‌తో పలుమార్లు రిజిస్టేషన్లు జరిగిపోతున్నాయి. పలు మీ సేవా కేంద్రాలలో కొందరికి అనుకూలంగా ఆస్థిలకు సంబందించిన వాస్తవ సమాచారాన్ని తొక్కిపెట్టి జారీ చేస్తున్నారు. దీని వలన క్రయవిక్రయాలు బయటపడక రెండో సారి విక్రయాలకు ఆస్కారం ఏర్పడుతోంది. సీలింగ్ భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న అసలు హక్కుదారులు పేర్లే ఇంకా రికార్డులలో కొనసాగుతుండడంతో 1బి రికార్డు కాపీ ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. పాత డాక్యుమెంట్లపై ఫోటోలు ఉండవు. దీన్నీ ఆసరాగా చేసుకొని అమ్మేసిన ఆస్థులనే మరలా నకిలీ వ్యక్తులతో వారిని వారసులుగా చూపించి నేరుగా విక్రయాలు జరుపుతున్నారు. 1బిలో పొరపాటున భూ హక్కుదారుల కాకుండా, వేరే పేర్లు నమోదైతే రియాల్టర్లు దాన్నే ఆసరాగా చేసుకొని, విక్రయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టా భూములను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు దాన్ని ఆనుకొని ఉన్న బంజరు భూములను కొనుగోలు చేసి వాటితో కలిపి లే అవుట్లును వేసి విక్రయిస్తున్నారు. పూర్తిస్థాయి సర్వే జరిపితే గానీ పట్టా ఏదో బంజరు భూమి ఏదో తెలియదు. ఈ లోగా కొనుగోలుదారులు మోసపోతున్నారు. మధురవాడ, ఆనందపురం, భీమిలి, పెందుర్తి ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేసిన వారు విదేశాలలో స్థిరపడి ఉన్నారు. అలాంటి వారి వివరాలు సేకరించి, నకిలీ డాక్యుమెంట్లులను సృష్టించి విక్రయాలు జరుపుతున్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలు కొనుగోలు చేయబోయే స్థిరాస్తికి సంబంధించి తొలుత ఈసీ (ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికేట్)ని తీసుకొని డాక్యుమెంట్‌తో సరిపోల్చుకోవాలి. వారసత్వ ఆస్థి అయితే ఎస్.ఎఫ్.ఎ (సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్) రికార్డుని పరిశీలించిఅసలు హక్కు దారులను రూఢీ చేసుకోవాలి. కొనుగోలు ఆస్తిఅయితే లింకు డాక్యుమెంట్లు తప్పనిసరి. అవి కూడా ఎస్.ఎఫ్.ఎ రికార్డులో ఉన్న హక్కుదారుడు నుంచి సంక్రమించినట్టు వరుస డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. అసలు హక్కుదారు మరణిస్తే వారి కుటుంబ వారసత్వ ధ్రువపత్రాన్ని తప్పకుండా పరిశీలించి అధికారులచే నిర్థారించుకోవాలి. అమ్మకదారు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉంటే వారి పేరు 1బి రికార్డులలో నమోదయింది లేనిదీ సరిచూసుకోవాలి. లేదంటే బ్యాంకులు రుణాలు అందించడానికి అంగీకరించవు. కొనుగోలు చేసిన స్థలాలు తప్పకుండా సర్వే చేయించుకొని కొనుగోలు చేస్తున్న స్థలం డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్లలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. లేదంటే పట్టా భూముల సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను విక్రయించే అవకాశం ఉంది. కొనుగోలు చేస్తున్న ఆస్థి యొక్క సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, కోర్టు వివాదాలు, ప్రభుత్వం వివిధ అవసరాలకు సేకరించిన జాబితాలో ఉందో లేదో రెవిన్యూ అధికారులు సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఎనీవేర్ రిజిస్టేషన్లతోనూ ఇబ్బందులు... కక్షిదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిష్ట్రేషన్ వలన కూడా పలు ఇబ్బందులు ఉన్నాయి. ఆస్తులను తమ పరిధిలోని సబ్ రిజిస్ట్టార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే ఉత్తమం. వేరే ప్రాంతలో చేస్తే పెండింగ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఒక చోట ఆస్తి వెరిఫికేషన్ మరో చోట జరగడం వలన పొరపాటు జరిగే అవకాశం ఉంది. మాతృ కార్యాలయంలోనే పరిశీలన చేసుకోవడానికి అన్ని రికార్డులు అందుబాటులో ఉంటాయి. ఇలా చేస్తే మంచిది. రెవిన్యూ శాఖాధికారులు ఎస్.ఎఫ్.ఎ, నిషేధిత ఆస్తుల జాబితా (22ఎ) సీలింగ్ భూములు, ప్రభుత్వ ఆస్థుల జాబితా, ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆస్థుల వివరాలను కక్షిదారులు నేరుగా పరిశీలించుకోవడానికి అవకాశం కల్పించాలి. -
అక్రమా‘లే అవుట్’!
అక్రమ లే అవుట్ల తొలగింపునకు {పత్యేకాధికారి నియామకం నేటినుంచి 29 గ్రామాల పరిధిలో అక్రమ లే అవుట్ల తొలగింపు రెవెన్యూ అధికారుల నుంచి జాబితా స్వీకరించిన అధికారులు లే అవుట్లు వేసి అమ్మకాలు జరిపిన రియల్ఎస్టేట్ వ్యాపారులు గుంటూరు రాష్ట్ర నూతన రాజధాని ప్రాంతంలో అనధికార లే అవుట్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. సీఆర్డీఏ పరిధిలో అక్రమ లే అవుట్ల నిర్మూలనకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారి చంద్రుడుని నియమించారు. అలాగే తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో అక్రమ లే అవుట్ల జాబితాను ఉంచబోతున్నారు. ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ప్లాట్లుగా వేసి విక్రయాలు జరిపారు. రాజధాని ప్రాంతమైతే తమ ప్లాట్ల రేట్లు పెరుగుతాయన్న ఆశతో చాలామంది మధ్య తరగతి ప్రజలు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ అక్రమ లే అవుట్లు వేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి అక్రమ లే అవుట్లను తొలగించేందుకు అవసరమైన చర్యలను అధికారులు చేపట్టారు. సర్వేయర్లు, ఇతర సిబ్బందిని అందుబాటులో ఉండాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. అలాగే 29 గ్రామాల పరిధిలోని భూముల వివరాలను ఇప్పటికే రెవెన్యూ అధికారుల నుంచి స్వీకరించిన సీఆర్డీఏ అధికారులు ఆ జాబితా ఆధారంగా లే అవుట్లను గుర్తించనున్నారు. దీంతో పాటు జియోగ్రఫీకల్ టెక్నాలజీ ద్వారా ఎప్పుడు లే అవుట్లను అభివృద్ధి చేశారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఆర్డీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆక్రమ లే అవుట్లపై త్వరలోనే చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉడా ఉన్న సమయంలో చాలా మంది అక్రమ లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లుగా ప్రజలకు అమ్మారు. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశాలు జారీచేశారు. -
‘లే -అవుట్ల’ నిరోధక ఆదేశాలపై స్టే
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారయ్యేంతవరకు విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి లే-అవుట్ల, గ్రూప్ డెవలప్మెంట్ తదితరాలకు అనుమతులు ఇవ్వొదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఇంకా తయారుకాని మాస్టర్ ప్లాన్‌ను కారణంగా చూపి ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఏపీ సర్కార్ ఆదేశాల అమలును నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రాసిన లేఖ చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లేఖ విషయంలో ప్రభుత్వం చట్ట పరిధిని దాటి వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎంయూడీఏ) పరిధిలో ఎటువంటి లేఔట్లు, గ్రూప్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని వీజీటీఎంయూడీఏ వైస్ చైర్మన్, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్లను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి ఈ ఏడాది సెప్టెంబర్ 17న లేఖ రాశారు. దీనిని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కుమారుడు శ్రీ చైతన్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు విచారించారు.వాదనలు విన్న న్యాయమూర్తి పై విధంగా ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు.