భూ.. మంత్రం! | Cute Kaman | Sakshi
Sakshi News home page

భూ.. మంత్రం!

Published Fri, Apr 3 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

భూ.. మంత్రం!

భూ.. మంత్రం!

అందమైన కమాన్.. చుట్టూ ప్రహారీ.. మధ్య మధ్యలో పచ్చని చెట్లు.. అంతర్గత రోడ్లతో చూడగానే కొనాలనిపించే అందమైన లే-అవుట్! అయితే ఇదంతా ఓ మేడిపండే. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడ వాలిపోయి అనుమతుల్లేకుండా గ్రామ పంచాయతీ లే-అవుట్లని, హెచ్‌ఎండీఏ నామ్స్ అని కల్లబొల్లి మాటలతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు వ్యాపారులు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకూ గండికొడుతున్నారు కూడా.
 
హైదరాబాద్:  మెట్రో రైలు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఔటర్ రింగ్ రోడ్, హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్లతో హైదరాబాద్ నలువైపులా అభివృద్ధికి బాటలు పరుచుకుంది. ముంబై హైవేలో.. పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ వరకు, నాగ్‌పూర్ హైవేలో.. మేడ్చల్, తుప్రాన్, చేగుంట, రామాయంపేట్ వరకు, వరంగల్ హైవేలో.. బీబీనగర్, భువనగిరి, ఆలేరు, యాదాద్రి వరకు, విజయవాడ రోడ్‌లో.. చౌటుప్పల్, చిట్యాల్, సూర్యాపేట వరకు, బెంగళూరు హైవేలో.. కొత్తూరు, ఫరూక్‌నగర్, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల వరకూ లెక్కలేనన్ని లే-అవుట్లు, వెంచర్లు వెలిశాయి. రెవెన్యూ అధికారిక లెక్కల ప్రకారం సుమారు 40 వేల ఎకరాలకు పైగానే ఉంటాయని సమాచారం.
 
వందల సంఖ్యల్లో

లే-అవుట్‌కు అనుమతి రావాలంటే.. మొత్తం స్థలంలో 30 శాతం రోడ్లు, ్రైడె నేజీ కోసం, 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కోసం కేటాయించాలి. ఆ స్థలం మున్సిపల్ పరిధిలో ఉంటే రెండున్నర ఎకరాల లోపు వరకైతే ఆర్జేడీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెండున్నర ఎకరాలు దాటితే డీటీసీపీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇలాంటి నిబంధనలేవీ పాటించకుండా శ్రీమిత్రా ఎస్టేట్స్, విదర్భ టౌన్‌షిప్, సవేరా ఇన్‌ఫ్రా, వీవీఆర్ హౌజింగ్, సిటీస్క్వేర్, జన్మభూమి హోమ్, అరుణోదయ ఎన్‌క్లేవ్, మధుపాలా, సిరి ఎన్‌క్లేవ్.. ఇలా ఒక్కటేమిటీ వందల సంఖ్యల్లో స్థిరాస్తి సంస్థలు అక్రమంగా లే-అవుట్లను వేస్తున్నాయి. తక్కువ ధరకు విక్రయిస్తూ ఒకవైపు కొనుగోలుదారులను మోసం చేస్తుంటే.. రిజిస్ట్రేషన్ చార్జీలు, సెస్, హెచ్‌ఎండీఏ అనుమతుల ఫీజులు, జీపీ, హౌజింగ్ ఫీజులు, అమ్మకపు పన్నులు.. ఇలా వివిధ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారని సుచిరిండియా సీఈఓ  కిరణ్ చెప్పారు. అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీ, గ్రామ స్థాయి అధికారుల అండదండలతోనే అసంఘటిత వ్యాపారులు అక్రమంగా లే-అవుట్లు వేస్తూ.. సంఘటిత స్థిరాస్తి మార్కెట్‌ను దెబ్బతీస్తున్నారన్నారని పేర్కొన్నారు.
 
సైట్‌లో డిస్‌ప్లే చేయాల్సిందే

అనుమతి కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకోగానే దానికి లే-అవుట్ పర్మిషన్ నంబర్‌ను కేటాయిస్తారు. అయితే ఆ నంబర్ మాత్రమే ఉంటే సరిపోదు.. లే-అవుట్ రిలీజ్ అయ్యిందా లేదా అనేదే ముఖ్యమైందంటున్నారు ఏవీ కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వెంకట్‌రెడ్డి. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రతి లే-అవుట్ వివరాలు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్లో ఉంటాయి. అంతేకాదు అనుమతి పొందిన లే-అవుట్ పా ్లన్‌ను ప్రతి బిల్డర్ తన సైట్‌లో డిస్‌ప్లే చేయాలి. లేకపోతే ఆ లే-అవుట్‌పై డౌట్ పడాల్సిందే. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ప్రతి లే- అవుట్ వివరాలను అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులకూ పంపించాలి. అలాగే రిజి స్ట్రేషన్ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ అనుమతి పత్రం వీటిలో ఏదైనా కాపీని జత చేస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడే డబుల్ రిజిస్ట్రేషన్లు, టైటిల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement