LBnagar
-
చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆ శ్మశాన వాటికలో చితిమంటలు ఉండవు. కట్టెలతో కాల్చే పద్ధతి కానరాదు. ఎల్బీనగర్లో ఆధునిక విధానంలో సోలార్ శ్మశాన వాటిక త్వరలోనే అందుబాటులోకి రానుంది. నాగోలు వద్ద ఫతుల్లాగూడలో నిర్మించే శ్మశాన వాటిక ఇందుకు వేదిక కానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇక్కడి శ్మశాన వాటిక పనులు తుది దశకు చేరుకున్నాయి. సోలార్ బర్నింగ్ శ్మశాన వాటిక నిర్మాణ పనులు హెచ్ఎండీఏ పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టింది. సుమారు రూ.25 కోట్లతో దీని పనులు పూర్తి కావస్తున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విదేశాల్లో ఉన్నవారు సైతం తమ బంధువుల అంత్యక్రియలను ఇంటర్నెట్ ద్వారా చూసే అవకాశముంది. ఇందుకోసం తెర ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 సీసీ కెమెరాలతో పాటు ఒక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం నగరంలోనే మొదటిది. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని సుమారు 6 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇక్కడ మూడు మతాలకు చెందిన శ్మశాన వాటికలను రూపుదిద్దుకుంటున్నాయి. హిందు, క్రిస్టియన్, ముస్లింలకు వేర్వేరుగా అత్యున్నత ప్రమాణాలతో అన్ని హుంగులతో నిర్మాణం సాగుతోంది. సుందరమైన లాన్లు, పచ్చిక బయళ్లు, కూర్చునేందుకు విశాలమైన హాల్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఫతుల్లాగూడలోని మహాప్రస్థానాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేశాం. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చేవారికి అన్ని సదుపాయాలు కల్పించనున్నాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే (చదవండి: ఇదేమి ‘పని’ష్మెంట్!) -
భార్య ఫిర్యాదు చేసిందని.. భర్త అఘాయిత్యం!
నాగోలు: ఇంట్లో గొడవలపై భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం చోలెరామారానికి చెందిన కృష్ణ, వాణిలకు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరు నగరానికి వచ్చి ఎల్బీనగర్ కాకతీయకాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో వాణి మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం మోత్కూరు, సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆదివారం సరూర్‌నగర్ స్టేషన్లో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఉంది. పోలీసులు కృష్ణకు ఫోన్ చేసి కౌన్సెలింగ్‌కు తల్లిని వెంట తీసుకురావాలని చెప్పారు. నగరానికి వచ్చిన కృష్ణ తల్లి బంధువుల ఇంట్లో ఉంది. బంధువులు ఉదయం 6 నుంచి కృష్ణ కు ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లి కిటికిలో నుంచి చూడగా ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. దీంతో ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. తన మృతికి భార్య, అత్త, మామ, నలుగురు బావమరుదులు, ఇంటి యజమాని కారణమని అందులో పేర్కొన్నాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో యువతి అదృశ్యం
హైదరాబాద్: ఓ యువతి అదృశ్యమవడం నగరంలో కలకలం రేపింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.... ఎల్బీనగర్ సెంట్రల్‌బ్యాంక్ కాలనీకి చెందిన కృష్ణ కుమార్తె రమ్య (24) ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి
ఎల్బీనగర్లో ఘటన పరారీలో నిందితులు నాగోలు: ఓ చిన్నారిపై దుండగులు లైంగికదాడికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా అందోల్ మండలం కిచ్చెనపల్లికి చెందిన ఈశ్వర్ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. వీరికి ఐదేళ్ల కూతురు, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈశ్వర్ ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తన కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత అతని భార్యా పిల్లలు మొదటి అంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2 గంటల ప్రాంతంలో తల్లి లేచి చూసేసరికి కూతురు కనిపించలేదు. వెంటనే విషయాన్ని భర్తకు చెప్పింది. అంతలోనే మూడో అంతస్తు నుంచి ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. కుటుంబ సభ్యులు పైకి వెళ్లేసరికి చిన్నారి రోదిస్తూ కనిపించింది. పరిశీలించగా తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు కిందికి వచ్చేసరికి వీరు నివాసం ఉండే గది తాళం పగులగొట్టి ఉంది. రూ.4 వేల నగదు కనిపించకపోగా లైట్లు ఆర్పివేసి ఉన్నాయి. చిన్నారిని ఆరా తీయగా ఇద్దరు వ్యక్తులు నోరు మూసి పైఅంతస్తులోకి తీసుకెళ్లారని ఏడుస్తూ చెప్పింది. చికిత్స నిమిత్తం శుక్రవారం ఉదయం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరీక్షల నిమిత్తం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎల్బీ నగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సీతారాం, ఎల్బీనగర్ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. ఎల్బీ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను శిక్షించాలి.. లైంగిక దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూరాధ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలన్నారు.