leela kumari
-
ఎంపీ రాయపాటికి వైఎస్ జగన్ పరామర్శ
గుంటూరు: టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపాన్ని తెలిపారు. రాయపాటికి వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లీలాకుమారి శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. -
ఎంపీ రాయపాటికి సతీవియోగం
గుంటూరు : నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ రోజు తెల్లవారుజామున ఆమెకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లీలాకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.